hyderabadupdates.com movies ఇంతకీ విశ్వంభర ఏం చేస్తున్నట్టు

ఇంతకీ విశ్వంభర ఏం చేస్తున్నట్టు

రెండేళ్లుగా నిర్మాణంలో ఉన్న విశ్వంభర రిలీజ్ డేట్లు మార్చుకుంటూ చివరికి వచ్చే ఏడాది విడుదలకు నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. పోస్ట్ పోన్ ప్రకటన వచ్చి కూడా నెలలు దాటిపోయింది. దాని తర్వాత టీమ్ హఠాత్తుగా సైలెంట్ అయిపోయింది. దర్శకుడు వసిష్ఠ తరచుగా బయట ఈవెంట్లలో కనిపించినా మెగా మూవీ గురించి ఎలాంటి కబురు చెప్పడం లేదు. విజువల్ ఎఫెక్ట్స్ , పోస్ట్ ప్రొడక్షన్ ని ఆలస్యానికి కారణాలుగా చెప్పుకుంటూ వచ్చిన యువి క్రియేషన్స్ కు అతి పెద్ద సవాల్ ఇక ముందుంది. పూర్తిగా చల్లారిపోయిన బజ్ ని అమాంతం పైకి తీసుకెళ్లే బాధ్యతను భుజాన మోయాలి.

ఇంతకీ విశ్వంభర ఇప్పుడేం చేస్తున్నాడనే డౌట్ రావడం సహజం. ఇన్ సైడ్ టాక్ ప్రకారం ప్రస్తుతం దీని పనులు ఆపేశారు. మన శంకర వరప్రసాద్ గారులో చిరంజీవి బిజీగా ఉండటంతో, అది రిలీజయ్యాకే విశ్వంభర గురించి మాట్లాడాలని నిర్ణయించుకున్నారట. ఒక బృందం అప్పుడప్పుడు షెడ్యూల్ వేసుకుని విఎఫ్ఎక్స్ పనులను సూపర్ వైజ్ చేస్తున్నట్టు తెలిసింది. గ్రాఫిక్స్ వర్క్ ని కొత్త కంపెనీలు టేకోవర్ చేశాక వాటి నుంచి ఎప్పటికప్పుడు క్వాలిటీ చెక్ చేసుకోవాల్సిన బాధ్యతను ఈ బృందమే చూసుకుంటోంది. పూర్తి సంతృప్తి అనిపించాకే గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. దీనికి చాలా టైం పట్టేలానే ఉంది.

షూట్ పరంగా ఇంకేం బ్యాలన్స్ లేకపోవడం విశ్వంభరకున్న అతి పెద్ద సానుకూలత. ఒకవేళ మన శంకరవరప్రసాద్ గారు కనక బ్లాక్ బస్టర్ అయితే ఆ ప్రభావం విశ్వంభర మీద సానుకూలంగా ఉండే అవకాశం లేకపోలేదు. అలాని ప్రమోషన్లను లైట్ తీసుకుంటే కష్టం. హరిహర వీరమల్లుకి ఏం జరిగిందో అందరూ చూశారు. విశ్వంభర అలాంటి రిస్కు చవి చూడకూడదనుకుంటే పబ్లిసిటీ ప్లాన్ మార్చుకోవాలి. ఎందుకంటే జనవరి నుంచి మార్చి దాకా పెద్ది సౌండ్ ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ హడావిడి మొదలవుతుంది. ఈ మధ్యలోనే విశ్వంభర తన ఉనికిని చాటుకునే దిశగా ఏదైనా చేయాలి.

Related Post

Top 9 South Films Releasing in January 2026: Thalapathy Vijay’s Jana Nayagan to Prabhas’ The Raja SaabTop 9 South Films Releasing in January 2026: Thalapathy Vijay’s Jana Nayagan to Prabhas’ The Raja Saab

Cast: Prabhas, Sanjay Dutt, Malavika Mohanan, Nidhhi Agerwal, Riddhi Kumar, Boman Irani, Zarina Wahab, Samuthirakani, Vennela Kishore Director: Maruthi Language: Telugu Genre: Romantic Fantasy Horror Comedy Release Date: January 9,