hyderabadupdates.com movies ఇచ్చిన హామీ 10 రోజుల ముందే పూర్తి చేసిన పవన్

ఇచ్చిన హామీ 10 రోజుల ముందే పూర్తి చేసిన పవన్

నెలా పదిహేను రోజుల్లో సమస్య పరిష్కరిస్తానన్న హామీని 10 రోజుల ముందే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిలబెట్టుకున్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా శంకరగుప్తం మేజర్ డ్రెయిన్ ఆధునీకరణ పనులకు పవన్ కళ్యాణ్ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.

కోనసీమ కొబ్బరి రైతులతో గత నెల మాట్లాడిన సందర్భంగా 45 రోజుల్లో సమస్యకు పరిష్కారం చూపుతానని ఇచ్చిన హామీని ఆయన 10 రోజుల ముందుగానే అమలు చేసి, 35 రోజుల్లోనే రూ.20.77 కోట్లతో పనులకు శ్రీకారం చుట్టారు.

రాజోలు పర్యటనలో రైతుల ఇబ్బందులను ప్రత్యక్షంగా విన్న పవన్ కళ్యాణ్, శంకరగుప్తం మేజర్ డ్రెయిన్ ఆధునీకరణకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని హామీ ఇచ్చారు. ముక్కోటి పర్వదినాన సమస్యకు పరిష్కార దిశగా అడుగు పడటంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. రైతుల ఆవేదనను గమనించి నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమం, సమస్యల శాశ్వత పరిష్కారానికి కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.

మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి పవన్ కళ్యాణ్ వర్చువల్‌గా కార్యక్రమంలో పాల్గొన్నారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వర్చువల్‌గా హాజరుకాగా, శంకరగుప్తంలో జరిగిన కార్యక్రమంలో రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, జిల్లా కలెక్టర్, జలవనరుల శాఖ అధికారులు పాల్గొన్నారు.

Related Post

‘సీఎంగా చంద్ర‌బాబు’ ప్ర‌వేశ పెట్టిన తొలితీర్మానం!‘సీఎంగా చంద్ర‌బాబు’ ప్ర‌వేశ పెట్టిన తొలితీర్మానం!

ఔను! అసెంబ్లీలో ఏ తీర్మానం అయినా ప్ర‌వేశ పెట్టేందుకు.. సంబంధిత శాఖ‌కు మంత్రులుగా ఉన్న‌వారు వాటిని ప్ర‌వేశ పెడ‌తారు. తాజాగా ఏపీ అసెంబ్లీ ప్ర‌త్యేక భేటీలో అమ‌రావ‌తికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించే తీర్మానాన్ని మాత్రం ముఖ్య‌మంత్రి హోదాలో చంద్ర‌బాబు ప్ర‌వేశ పెట్టారు. ఇలా..

“Raju Weds Rambai” Trailer Wins Hearts with Its Pure, Native Love Story“Raju Weds Rambai” Trailer Wins Hearts with Its Pure, Native Love Story

The trailer of Raju Weds Rambai has struck a chord with audiences for its soulful portrayal of a rustic, emotional village love story. Starring Akhil Uddeamari and Tejaswini Rao in