hyderabadupdates.com movies ఇన్ని బూతులేంటి సైక్ సిద్దార్థా

ఇన్ని బూతులేంటి సైక్ సిద్దార్థా

ఒకప్పుడు బూతులు బయట మాట్లాడ్డమే మహా నేరంగా చూడటం దగ్గరి నుంచి క్రియేటివ్ ఫ్రీడమ్ పేరుతో వాటిని ఏకంగా సినిమాల్లో జనరలైజ్ చేయడం దగ్గర దాకా ఎన్నో పరిణామాలు చూస్తూనే ఉన్నాం. సెన్సార్ ఎంత మ్యూట్ చేసినా ఆర్టిస్టులు ఏం  డబుల్ మీనింగ్ మాట్లాడుతున్నారో జనం ఈజీగా గుర్తు పట్టేస్తున్నారు. దానికి ప్రత్యేకంగా లిప్ సింక్ ఎక్స్ పర్ట్ అవసరం లేదు. అడిగితే నిజ జీవితంలో ఉన్నవే పెడుతున్నామని ఫిలిం మేకర్స్ సమర్ధించుకుంటున్నారు కానీ ఇదొక కామన్ ట్రెండ్ గా మారిపోతోంది. ఈ లిస్టులో చేరుతున్న మూవీ సైక్ సిద్దార్థ డిసెంబర్ 12 విడుదల కానుంది. ఇందులో నందు హీరో.

చిన్న టీజర్ తో హీరో క్యారెక్టరైజేషన్ ని పరిచయం చేశారు. హైదరాబాద్ లో ఉండే ఓ యువకుడు నగర వాతావరణం, మనుషుల ప్రవర్తన చూసి విసుగెత్తిపోయి సైకో తరహాలో మాట్లాడుతూ ఉంటాడు. మాటకు ముందు వెనుక బూతులు లేనిదే సంభాషణ చేయలేడు. ఆర్టిసి బస్ డ్రైవర్ గురించైనా లేదా స్నేహితుడు లేదా ప్రియురాలు ఎవరైనా సరే ఇతని సంస్కృత భాషకు జడుసుకోవాల్సిందే. యూత్ ని టార్గెట్ చేయడమే ఈ కథ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. ఆర్టిస్టుగా నందు మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చినప్పటికీ కనీసం ఫామిలీతో కూర్చుని టీజర్ చూడలేనంత బూతులు పుష్కలంగా ఉన్నాయి.

వరుణ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సైక్ సిద్దార్థకు నందు హీరో మాత్రమే కాదు రచన సహకారం కూడా అందించాడు. స్మరన్ సాయి సంగీతం సమకూర్చారు. అసలు బూతులు లేకుండా యూత్ ని ఆకట్టుకోలేమా అంటే బహుశా ఇప్పటి కుర్ర డైరెక్టర్లు నో అంటారేమో. లిటిల్ హార్ట్స్ లో ఒకటి అరా పదాలు తప్ప డైలాగులన్నీ క్లీన్ గా ఉంటాయి. జాతిరత్నాలులో వెతికినా డబుల్ మీనింగ్స్ దొరకవు. మరి సైక్ సిద్దార్థ అన్ని ఎందుకు అవసరమయ్యాయో సినిమా చూశాకే క్లారిటీ వస్తుంది. అన్నట్టు దీంట్లో ఆసియన్ సురేష్ సంస్థలు భాగస్వామిగా ఉన్నాయి. క్యాస్టింగ్ లో యామిని భాస్కర్, ప్రియాంక రెబెకా తదితరులున్నారు.

Related Post

Breaking: National Award winner Parvathy Thiruvothu joins Don Palathara and Dileesh Pothan for upcoming Malayalam dramaBreaking: National Award winner Parvathy Thiruvothu joins Don Palathara and Dileesh Pothan for upcoming Malayalam drama

National Award-winning actor Parvathy Thiruvothu will headline Don Palathara’s upcoming directorial venture, alongside acclaimed filmmaker-actor Dileesh Pothan. The collaboration brings together three of Malayalam cinema’s most respected creative voices. This

పాతికేళ్ళయినా తగ్గని పడయప్ప క్రేజ్పాతికేళ్ళయినా తగ్గని పడయప్ప క్రేజ్

ఎంత బ్లాక్ బస్టర్ అయినా ఒక్కోసారి రీ రిలీజులకు సరైన స్పందన రాదు. కొన్ని మాత్రం ఏకంగా రికార్డులు సాధించే దిశగా ట్రేడ్ ని ఆశ్చర్యపరుస్తాయి. ప్రస్తుతం తమిళనాడులో వీరవిహారం చేస్తున్న పడయప్ప (తెలుగులో నరసింహ) ఏదో కొత్త సినిమా రేంజ్