hyderabadupdates.com movies ఇప్పుడు కేసీఆర్ వంతు?

ఇప్పుడు కేసీఆర్ వంతు?

బీఆర్ఎస్ హయాంలో ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందంటూ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. రెండేళ్లుగా కార్తీక దీపం సీరియల్ లెక్క ఆ కేసు విచారణ కొనసాగుతూనే ఉందని బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు సెటైర్లు కూడా వేశారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ కేసులో తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కూడా నోటీసులు ఇచ్చేందుకు సిట్ అధికారులు రెడీ అయ్యారని తెలుస్తోంది.

మరి కాసేపట్లో ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫాం హౌస్ కు సిట్ అధికారులు వెళ్లబోతున్నారని, అక్కడే ఆయనకు నోటీసులు ఇస్తారని తెలుస్తోంది. అంతేకాదు, ఎర్రవల్లిలోని ఫాం హౌస్ లోనే కేసీఆర్ ను రేపు సిట్ అధికారులువిచారణ చేయబోతున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

వాస్తవానికి, హరీశ్ రావు, కేటీఆర్, సంతోష్ ల తర్వాత కవితను సిట్ అధికారులు విచారణకు పిలుస్తారని అంతా భావించారు. కానీ, అనూహ్యంగా కేసీఆర్ పేరు తెరపైకి వచ్చినట్లు కనిపిస్తోంది. ఓ వైపు తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Related Post

మీనాక్షికి మంచి రోజులు వచ్చినట్టేమీనాక్షికి మంచి రోజులు వచ్చినట్టే

అందం, అభినయం రెండూ చక్కగా ఉండే మీనాక్షి చౌదరి గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాం తర్వాత మళ్ళీ కనిపించనే లేదు. అంత పెద్ద బ్లాక్ బస్టర్ సాధించాక మాములుగా ఎవరైనా వరస సినిమాలతో బిజీ అయిపోతారు. కానీ మీనాక్షి మాత్రం అనగనగా

గుంతల రోడ్లే మేలంటోన్న బీజేపీ ఎంపీగుంతల రోడ్లే మేలంటోన్న బీజేపీ ఎంపీ

ఒక సగటు మనిషి చేసే కామెంట్లకు…బాధ్యత గల ప్రజాప్రతినిధులు చేసే కామెంట్లకు చాలా తేడా ఉంటుంది..ఉండాలి కూడా. కానీ, ఈ మధ్యకాలంలో కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, కేంద్ర మంత్రులు చేస్తున్న కామెంట్లు చూస్తుంటే…వారికన్నా కామన్ మ్యాన్ 100 రెట్లు నయం

‘అనంతపురం అంటే టీడీపీ..టీడీపీ అంటే అనంతపురం’‘అనంతపురం అంటే టీడీపీ..టీడీపీ అంటే అనంతపురం’

తెలుగుదేశం పార్టీకి ఉమ్మడి అనంతపురం జిల్లా కంచుకోట వంటిది. అన్న ఎన్టీఆర్ మొదలు బాలకృష్ణ వరకు అందరినీ అనంతపురం అక్కున చేర్చుకుంది. ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్ వంటి నేతలను ఆ జిల్లా అందించింది. ఇక, 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి