hyderabadupdates.com movies ఇరు పార్టీలకు ప్రవీణ్ ప్రకాష్ ఒక రిక్వెస్ట్

ఇరు పార్టీలకు ప్రవీణ్ ప్రకాష్ ఒక రిక్వెస్ట్

ఏపీ కేడర్‌కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్న తర్వాత ఇటీవల తరచుగా వీడియోలు విడుదల చేస్తున్నారు. తాజాగా ఆయన టీడీపీ, వైసీపీలను ఉద్దేశించి ఒక రిక్వెస్ట్ చేస్తూ మాట్లాడారు. ఒక్క తప్పు కారణంగా తాను హీరో నుంచి విలన్‌గా మారిపోయానని ఆయన గతంలో పేర్కొన్నారు.

తప్పు చేశానన్న భావనతోనే వాలంటరీ రిటైర్మెంట్‌కు దరఖాస్తు చేసినట్లు ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు. తాజాగా సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియోలో, “ప్రభుత్వ ఉద్యోగులపై రాజకీయ విచ్ హంటింగ్ ఒక క్యాన్సర్ లాంటిది” అని అభిప్రాయపడ్డారు. దీనిని నిర్మూలించేందుకు టీడీపీ, వైసీపీ కలిసి పనిచేయాలని కోరారు.

గతంలో రాజకీయ విచ్ హంటింగ్ బారిన పడిన వారు ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే ఉండేవారని చెప్పారు. వారిలో ఒకరు అప్పటి ఉమ్మడి రాష్ట్రాల ఎన్నికల కమిషనర్ భన్వర్లాల్ అని పేర్కొన్నారు. 2014–19 మధ్య ఈ సంఖ్య పది మందికి చేరిందని, ఇందులో ప్రధానంగా ప్రభావితమైన అధికారి ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు అని తెలిపారు.

ఆ తరువాత కాలంలో ఈ సంఖ్య పదింతలు పెరిగిందని అన్నారు. మళ్లీ వైసీపీ ప్రభుత్వం వస్తే, రాజకీయ విచ్ హంటింగ్‌కు గురయ్యే వారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఇది క్యాన్సర్ మహమ్మారి లాంటిదని వ్యాఖ్యానించారు. తర్వాత మళ్లీ ప్రభుత్వం మారితే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.

ఈ పరిస్థితికి చెక్ పెట్టాల్సిన బాధ్యత టీడీపీ, వైసీపీ పార్టీలదేనని ఆయన స్పష్టం చేశారు. ఒక ఉన్నతాధికారికి సంబంధించిన చిన్న పొరపాటును పెద్దదిగా చూపించి రాజకీయంగా వేటాడడం మంచిది కాదని అన్నారు.

గతంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొంతమందిపై తాను వ్యవహరించిన తీరు పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేసిన ఆయన, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు, రిటైర్డ్ ఐఆర్‌ఎస్ అధికారి జాస్తి కృష్ణకిశోర్‌లకు బహిరంగ క్షమాపణలు చెప్పారు. మరోసారి కూడా ఏబీ వెంకటేశ్వరరావు పేరును ఆయన ప్రస్తావించారు.

Related Post

అజారుద్దీన్‌కి ఏమేమి శాఖలు ఇచ్చారంటే!అజారుద్దీన్‌కి ఏమేమి శాఖలు ఇచ్చారంటే!

మాజీ క్రికెటర్‌, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మహమ్మద్ అజారుద్దీన్‌ గత నెల 31న రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో బెర్త్ సంపాదించుకున్న విషయం తెలిసిందే. గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆయనను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. అప్పట్లో అజారుద్దీన్‌కు హోం