“ఏపీలో కూటమి బలం ఏ విధంగా ఉందో చెప్పడానికి ఈ రెండు ఫొటోలు చాలు!“ ఈ మాట అన్నది ఎవరో టీడీపీ నాయకులో.. బీజేపీ నేతలో కాదు.. తటస్థులు, రాజకీయ విశ్లేషకులు!!. అంతేకాదు.. నెటిజన్లు కూడా ఫిదా అవుతున్న ఈ రెండు ఫొటోలు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతున్నాయి. అవే.. ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కలిసి ఉన్న ఫొటో. దీనిలో `అతడే మా సైన్యం“ అన్నట్టుగా ప్రధాని వెంట ఇద్దరు నాయకులు అడుగులు వేస్తున్న తీరుకు నెటిజన్లు ఫిదా అవుతుంటే.. నాయకుల హావ భావాలు చూసిన విశ్లేషకులు.. కూడా మంత్రముగ్ధులవుతున్నారు.
ఫొటో-1
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పుట్టపర్తిలో భగవాన్ శ్రీసత్యసాయి బాబా శతజయంతి వేడుకలకు వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని సత్యసాయి కుల్వంత్ హాల్లోకి సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తోడ్కొని వెళ్లారు. ఈ క్రమంలో ప్రధాని మోడీ ముందు నడుస్తుంటే.. ఆయనకు కుడి పక్కన ఉప ముఖ్యమంత్రి.. రెండు అడుగులు వెనగ్గా.. అడుగులు వేస్తూ ముందుకు సాగారు. మరోవైపు సీఎం చంద్రబాబు అదే డిస్టెన్స్‌లో ప్రధాని మోడీని అనుసరించారు. ఈ సమయంలో ముగ్గురు నేతలు చాలా గంభీరంగా, ఎంతో ఆత్మ విశ్వాసంతో కనిపించడాన్ని నెటిజన్లు ప్రస్తావిస్తున్నారు.
ఫొటో-2
సత్యసాయి వేడుకల నిమిత్తం అనంతపురంలోని విమానాశ్రయానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు వచ్చినప్పుడు తీసిన ఫొటో ఇది. అయితే.. ఇద్దరూ ఆ సమయంలో ప్రధాని మోడీ రాకకోసం వేచి ఉన్నారు. అంతేకాదు.. ఇరువురు ఎంతో దీర్ఘంగా చర్చించుకుంటున్నట్లు కనిపించింది. అంతేకాదు.. ఇద్దరూ ప్రశాంతంగా ఉన్నారు. ఈ ఫొటోను కూడా మెజారిటీ నెటిజన్లు మెచ్చుకున్నారు. ఇరువురు నేతల మధ్య సఖ్యతను ప్రస్తావిస్తూ కామెంట్లు చేశారు. దీనిపై విశ్లేషకులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. దీనిని బట్టి కూటమి బలం ఎలా ఉందో చెప్పొచ్చని వ్యాఖ్యానించడం గమనార్హం.