hyderabadupdates.com movies ఈటీవీ విన్… జాగ్రత్తపడాలి

ఈటీవీ విన్… జాగ్రత్తపడాలి

ఈటీవీ విన్.. పోస్టర్ మీద ఈ లోగో ఉంటే చాలు.. అది సినిమా అయినా, వెబ్ సిరీస్ అయినా అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందని జనాలు నమ్మకం పెట్టుకునే స్థాయిలో క్రెడిబిలిటీ సంపాదించుకుంది ఆ సంస్థ. ‘నైంటీస్ మిడిల్ క్లాస్’తో మొదలుపెట్టి.. అనగనగా, లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి, ఆల్ ఇండియా ర్యాంకర్స్.. ఇలా మంచి మంచి కంటెంట్ అందించిన ఘనత ఆ సంస్థ సొంతం.

ఏదో ఒక కొత్తదనం లేకుండా.. ఎంగేజింగ్ కంటెంట్ లేకుండా వాళ్లు ఏ సినిమా, సిరీస్ తీయరనే నమ్మకం ప్రేక్షకుల్లో కలిగింది. కానీ ఈ మధ్య ఆ సంస్థ క్రెడిబిలిటీని దెబ్బ తీసే సినిమాలు వస్తున్నాయి. ప్రోమోలతో ఆసక్తి రేకెత్తించి, బాగా ప్రమోట్ చేసి రిలీజ్ చేస్తున్న సినిమాలు.. అంచనాలను అందుకోలేక, ప్రేక్షకులను విసుగెత్తించి ఆ సంస్థ మీద నమ్మకాన్ని పోగొడుతున్నాయి. రెండు నెలల వ్యవధిలో ఇలాంటి చిత్రాలు రెండు వచ్చాయి.

మార్చిలో వచ్చిన శివాజీ సినిమా ‘సంప్రదాయిని సుప్పిని శుద్ధపూసని’ చూసి ప్రేక్షకులు బెంబేలెత్తిపోయాయి. నేరుగా ఈటీవీ విన్‌లో రిలీజ్ చేయాలనుకున్న సినిమాను.. వెండితెరపై అద్భుతాలు చేస్తుందన్న ధీమాతో థియేటర్లలో రిలీజ్ చేశారు. కానీ సీరియల్‌ను తలపించిన ఆ సినిమా.. ప్రేక్షకులకు తీవ్ర అసహనాన్ని కలిగించింది. థియేటర్లలో ఈ సినిమా కనీస ప్రభావం కూడా చూపించలేకపోయింది. ఈ చిత్రాన్ని థియేటర్లలో చూసిన వాళ్లంతా తిట్టుకున్నారు.

ఇప్పుడు ‘పాపం ప్రతాప్’ సినిమా సైతం అదే ఫీలింగ్ కలిగించింది. ఈ సినిమాను టీం మామూలుగా ప్రమోట్ చేయలేదు. దాని కోసం ప్రత్యేకంగా బడ్జెట్ కూడా పెట్టారు. తీరా చూస్తే ప్రోమోల్లో ఉన్నంత ఆసక్తి సినిమాలో లేకపోయింది.

చిన్న పాయింట్ పట్టుకుని విపరీతంగా సాగతీసి ప్రేక్షకులకు తీవ్ర అసహనం కలిగించాడు దర్శకుడు. ఈ మాత్రం కంటెంట్ గురించా ఇంత హడావుడి చేశారు అనే ఫీలింగ్ కలిగింది జనాలకు. ఈ సినిమాకు పెట్టిన ప్రొడక్షన్ బడ్జెట్, ప్రమోషన్ల ఖర్చు కలిపితే 7-8 కోట్ల దాకా అయిందట. కానీ థియేటర్ల నుంచి కోటి రూపాయల షేర్ కూడా రాని పరిస్థితి.

డిజిటల్‌ రిలీజ్‌తో ఎంత మాత్రం ప్రయోజనం పొందుతారో కానీ.. బాక్సాఫీస్ లెక్కల్లో మాత్రం సినిమా డిజాస్టర్‌గానే నిలిచింది. ఈటీవీ విన్ నెలన్నర వ్యవధిలో రెండు పేలవమైన సినిమాలు రావడం ఆ సంస్థ ఇమేజీకి పెద్ద డ్యామేజే. ఇకపై ఈటీవీ విన్ సినిమాలు అంటే ప్రేక్షకులు కొంచెం ఆలోచించే థియేటర్లకు వెళ్లే పరిస్థితి కనిపిస్తోంది.

Related Post

Fresh Romantic Film Launched: Sangeeth Shobhan Teams Up with Promising TalentFresh Romantic Film Launched: Sangeeth Shobhan Teams Up with Promising Talent

A new romantic entertainer featuring young actor Sangeeth Shobhan officially went on floors today with a traditional pooja ceremony in Hyderabad. The actor, who earned strong youth following with MAD

ప‌సిడి ధ‌ర.. ప‌ర్సులు పిసికేస్తోంది.. రీజ‌నేంటి?ప‌సిడి ధ‌ర.. ప‌ర్సులు పిసికేస్తోంది.. రీజ‌నేంటి?

ప‌సిడి.. బంగారం.. స్వ‌ర్ణం.. పేర్లు ఏవైనా.. ప్రతి ఒక్క‌రూ పండుగ‌ల సీజ‌న్‌లో అంతో ఇంతో కొనుగోలు చేయాల‌ని భావిస్తారు. ముఖ్యంగా కొత్త‌గా పెళ్ల‌యిన జంట‌ల‌కు అత్త‌మామ‌లు.. పుట్టింటివారు కూడా కానుక‌గా స్వ‌ర్ణాభర‌ణాల‌నే ఇవ్వాల‌ని త‌ల‌పోస్తారు. ఇక‌, ఇళ్ల‌లో జ‌రిగే శుభ‌కార్యాల‌కు కూడా