hyderabadupdates.com Gallery ఉపాధి హామీ నిధులను ఇంటిగ్రేట్ చేయాలి : సీఎం

ఉపాధి హామీ నిధులను ఇంటిగ్రేట్ చేయాలి : సీఎం

ఉపాధి హామీ నిధులను ఇంటిగ్రేట్ చేయాలి : సీఎం post thumbnail image

అమరావతి : జలధార-జలహారతి కార్యక్రమాన్ని అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లాల యంత్రాంగం అత్యంత ప్రాధాన్యతాంశంగా తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో జలధార కార్యక్రమం అమలుపై అధికారులతో సమీక్షించారు. జిల్లాల కలెక్టర్ల సహా జిల్లాల్లోని వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా జలధార కార్యక్రమం జరిగిన తీరుపై సీఎం ఆరా తీశారు. శ్రీకాకుళం జిల్లాలో సాగునీటి సంఘాల సభ్యులు భాగస్వామ్యం బాగుందని సీఎంకు అధికారులు వివరించారు. కార్యక్రమం మొదలు పెట్టిన తొలి రోజునే నంద్యాల, పశ్చిమ గోదావరి జిల్లాలు 100 రోజుల యాక్షన్ ప్లాన్ సిద్దం చేయడంపై ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. నీటి సంరక్షణలో ఇప్పటికే తాను చేపట్టిన చర్యలను అన్నమయ్య జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్సులో వివరించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ కీల‌క సూచ‌న‌లు చేశారు. అన్నమయ్య జిల్లా కలెక్టర్ జలధార పేరుతో అద్భుతంగా నీటి సంరక్షణ చర్యలు చేపట్టారని ప్ర‌శంస‌లు కురిపించారు నారా చంద్ర‌బాబు నాయుడు. అన్నమయ్య కలెక్టర్ తీసుకున్న చొరవతో 8.59 మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగాయని చెప్పారు. 20 వేల బోర్లు రీ-ఛార్జ్ అయ్యాయని తెలిపారు. ప్రతీ జిల్లా కూడా అన్నమయ్య జిల్లా మోడల్ ఫాలో కావాలని పేర్కొన్నారు సీఎం. ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తే కచ్చితంగా మార్పు కన్పిస్తుందన్నారు. ఈ దిశ‌గా వ‌ర్క్ చేస్తే సత్ఫలితాలు వస్తాయన్నారు. నీటి సంరక్షణతో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి జరుగుతుందని నిరూపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా మలిచేందుకు.. వారి భాగస్వామ్యం ఉండేలా సాగునీటి సంఘాల సభ్యులు బాధ్యత తీసుకోవాలని సీఎం సూచించారు.
The post ఉపాధి హామీ నిధులను ఇంటిగ్రేట్ చేయాలి : సీఎం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ఒలెక్ట్రా గ్రీన్ టెక్ సంస్థ అరుదైన రికార్డ్ఒలెక్ట్రా గ్రీన్ టెక్ సంస్థ అరుదైన రికార్డ్

హైద‌రాబాద్ : ప్ర‌ముఖ విద్యుత్ బ‌స్సుల త‌యారీ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్ టెక్ కంపెనీ అరుదైన రికార్డును న‌మోదు చేసింది. ఈ ఏడాది ఆర్థిక సంవ‌త్స‌రానికి సంబంధించి 3వ త్రైమాసికంలో ఏకంగా 385 ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను త‌యారు చేసింది. వాటిని డెలివ‌రీ

క‌మ‌నీయం క‌డు ర‌మ‌ణీయం పుష్ప యాగంక‌మ‌నీయం క‌డు ర‌మ‌ణీయం పుష్ప యాగం

ఒంటిమిట్ట / తిరుపతి : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామివారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం భక్తి భరితంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, ఆలయ శుద్ధి, నిత్యారాధనలు నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం వైభవంగా ప్రారంభమైంది.తులసీదళాలు, మల్లెలు, రోజాలు,

Droupadi Murmu: రఫేల్‌ యుద్ధ విమానంలో రాష్ట్రపతిDroupadi Murmu: రఫేల్‌ యుద్ధ విమానంలో రాష్ట్రపతి

Droupadi Murmu : రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శత్రు భీకర రఫేల్‌ యుద్ధ విమానంలో బుధవారం గగన విహారం చేశారు. హరియాణాలోని అంబాలాలో ఉన్న భారత వాయుసేన (ఐఏఎఫ్‌) స్థావరం నుంచి ఈ యుద్ధ విమానంలో నింగిలోకి దూసుకెళ్లిన ఆమె… దాదాపు