hyderabadupdates.com movies ‘ఉప్పెన’తో సినిమాలు ఆపేద్దాం అనుకున్న బేబమ్మ

‘ఉప్పెన’తో సినిమాలు ఆపేద్దాం అనుకున్న బేబమ్మ

కొత్త హీరో హీరోయిన్లు.. కొత్త దర్శకుడు కలిసి చేసిన సినిమాకు వంద కోట్లకు పైగా వసూళ్లు రావడం అనూహ్యం. ఉప్పెన సినిమా ఆ ఘనతే సాధించింది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా రూపొందించిన ఈ చిత్రంతోనే వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి కథానాయికలుగా నటించారు. నిజానికి ఈ సినిమాకు ముందు వేరే హీరోయిన్ని తీసుకున్నారు. కానీ తర్వాత ఆమె సూట్ కాదనిపించి.. కృతి శెట్టిని ఎంచుకున్నాడు బుచ్చిబాబు.

తాను ఈ సినిమా చేసే ముందు ఏదో ఊహించుకుని వచ్చానని.. కానీ షూటింగ్ చేస్తున్నపుడు పడ్డ కష్టం, ఎదురైన సమస్యలు చూశాక.. నటన తన వల్ల కాదు అనే నిర్ణయానికి వచ్చేసినట్లు కృతి తెలిపింది. ఆ ఒక్క సినిమాతో నటన ఆపేద్దాం అనుకున్న తాను.. రిలీజ్ తర్వాత ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన చూసి నిర్ణయాన్ని మార్చుకున్నట్లు ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది కృతి.

మీ తొలి చిత్రానికి సంబంధించి ఏమైనా మరిచిపోలేని జ్ఞాపకాలున్నాయా అని ఇంటర్వ్యూలో అడగ్గా, దానికి బదులిస్తూ.. ‘‘ఉప్పెన నా జీవితాన్ని మార్చిన అనుభవం. ఐతే ఒక నటిగా అంత కష్టం ఉంటుందని ఆ సినిమా చేసే ముందు అస్సలు అనుకోలేదు. సినిమాల గురించి నేను ఊహించుకున్నది వేరు. అక్కడ ఎదురైన అనుభవం వేరు. నటించడం చాలా కష్టం అనిపించింది. ఆ పాత్ర చాలా డిమాండ్ చేసింది. కానీ నేను దానికి నేను ప్రిపేరై రాలేదు. నా తల్లిదండ్రులకు కూడా సినిమా కొత్త కాబట్టి నన్నేమీ ప్రిపేర్ చేయలేకపోయారు.

షూటింగ్‌లో విపరీతమైన స్ట్రెస్ ఎదుర్కొన్నాను. దాని వల్ల నా వెంట్రుకలు రాలిపోయాయి. చర్మ సమస్యలు కూడా తలెత్తాయి. ఆ స్ట్రెస్‌ను నేను హ్యాండిల్ చేయలేకపోయాను. అంత సామర్థ్యం నాకు లేదు అనిపించింది. అది చూసి భయపడ్డ నా తల్లిదండ్రులు ఇంత కష్టం అయితే ఇక సినిమాలు వద్దు, ఈ ఒక్కటి చేసి వదిలేద్దాం అన్నారు.

నేను కూడా ఇది నాకు సూట్ కాదు, ఈ సినిమా తర్వాత నటన ఆపేద్దాం అనే అనుకున్నా. కానీ ఆ సినిమా రిలీజైనపుడు ప్రేక్షకుల నుంచరి వచ్చిన ప్రేమ చూశాక నా ఆలోచన మార్చుకున్నా. ప్రేక్షకుల కోసమే సినిమాలు చేయాలనుకున్నా. వాళ్లు ఇచ్చే ప్రేమను తిరిగివ్వడమే నా లక్ష్యం’’ అని కృతి చెప్పింది.

Related Post

DJ Tillu director’s Anumana Pakshi starring Rag Mayur slated for a February 2026 releaseDJ Tillu director’s Anumana Pakshi starring Rag Mayur slated for a February 2026 release

Writer-director Vimal Krishna made a solid debut with the 2022 comedy-drama DJ Tillu. He is now directing another unique and hilarious entertainer titled Anumana Pakshi. Young and talented actor Rag