hyderabadupdates.com movies ఊహకు అందని రాజమౌళి స్ట్రాటజీలు

ఊహకు అందని రాజమౌళి స్ట్రాటజీలు

ఇంకా సగం షూటింగ్ కూడా అవ్వలేదు. అప్పుడే రాజమౌళి వారణాసి ప్రమోషన్లు మొదలుపెట్టడం గురించి ఇండస్ట్రీలోనే కాదు ప్రేక్షకుల్లోనూ ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ప్రత్యేకంగా ఒక హాలీవుడ్ ఛానల్ కి మహేష్ బాబు, పృథ్విరాజ్, ప్రియాంకా చోప్రాలతో కలిసి ఇంటర్వ్యూ ఇవ్వడం, దాని ఫోటోలు సోషల్ మీడియాలో రావడం చకచకా జరిగిపోయాయి. టైటిల్ లాంచ్ ఈవెంట్ లో జరిగన హెచ్చు తగ్గుల మాట పక్కన పెడితే మూడు నిమిషాల వీడియోలో విజువల్స్ చాలా బాగున్నా ఆశించిన గొప్ప స్థాయిలో వేగంగా రెస్పాన్స్ తెచ్చుకోలేదని వ్యూస్ చూస్తే అర్థమవుతోంది. అలాని జక్కన్నని తక్కువంచనా వేయడానికి లేదు.

అసలు రాజమౌళి ఇంత అడ్వాన్స్ గా ఉండటానికి కారణాలు లేకపోలేదు. కీరవాణి చెప్పిన ప్రకారమైతే వారణాసి 2027 వేసవికి వచ్చేస్తుంది. అంటే అటుఇటుగా కేవలం ఏడాదిన్నర సమయం మాత్రమే ఉంది. ఇందులోనే పోస్ట్ ప్రొడక్షన్, విఎఫ్ఎక్స్, రీ రికార్డింగ్, మార్కెటింగ్ అన్నీ అయిపోవాలి. టీజర్ కే సంవత్సరం టైం పడితే మరి సినిమాకు ఎంత పడుతుందో ఎవరూ ఊహించలేకపొతున్నారు. ఆర్ఆర్ఆర్ లాగా పోస్ట్ రిలీజ్ పబ్లిసిటీ కాకుండా వారణాసి కోసం రాజమౌళి కొత్త ప్లాన్ వేస్తున్నారు. ఇప్పటి నుంచే ఆడియన్స్ ని సన్నద్ధం చేస్తున్నారు. ఇతిహాసాలతో ముడిపడిన కాన్సెప్ట్ కావడంతో గ్లోబల్ ఆడియన్స్ ని మెప్పించడం ఈజీ కాదు.

ఇప్పుడే కాదు రాబోయే రోజుల్లో కూడా క్రమం తప్పకుండా వారణాసికి సంబంధించి ఏదో ఒక అప్డేట్ ఉండేలా ఎస్ఎస్ కార్తికేయ పక్కా ప్రణాళికతో ఉన్నట్టు తెలిసింది. మెయిన్ క్యాస్టింగ్ ముగ్గురు తప్ప ఇప్పటిదాకా ఇంకెవరిని రివీల్ చేయలేదు. ఆర్ మాధవన్ ఉన్నాడని అన్నారు కానీ ఆయన గురించి ఎక్కడా మాట్లాడ్డం లేదు. హనుమంతుడి పాత్రలో షాకింగ్ ఆర్టిస్ట్ ఉంటారని అంటున్నారు కానీ అది మాధవనా లేక జక్కన్న ఇంకెవరినైనా గుట్టుగా ఉంచారా అనేది తెలియాల్సి ఉంది. తన రెగ్యులర్ స్టైల్ కాకుండా పూర్తిగా డిఫరెంట్ స్ట్రాటజీతో వెళ్తున్న రాజమౌళి రాబోయే రోజుల్లో ఇంకెన్ని షాకులు ఇస్తారో చూడాలి.

Related Post

యల్లమ్మ.. అటు తిరిగి ఇటు తిరిగి…యల్లమ్మ.. అటు తిరిగి ఇటు తిరిగి…

యల్లమ్మ.. టాలీవుడ్లో కొన్నేళ్ల నుంచి వార్తల్లో ఉన్న సినిమా. ‘బలగం’ సినిమాతో అందరినీ ఆశ్చర్యపరిచిన కమెడియన్ వేణు.. తన రెండో సినిమాగా ‘యల్లమ్మ’ తీయాలనుకున్నాడు. ముందు నేచురల్ స్టార్ నానిని ఈ సినిమాకు హీరోగా అనుకున్నారు. నిర్మాత దిల్ రాజు సైతం ఆ విషయాన్ని ధ్రువీకరించాడు. కానీ