hyderabadupdates.com Gallery ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య‌కు రూ. కోటి ఎక్స్ గ్రేషియా

ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య‌కు రూ. కోటి ఎక్స్ గ్రేషియా

ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య‌కు రూ. కోటి ఎక్స్ గ్రేషియా post thumbnail image

హైద‌రాబాద్ : స్మ‌గ్ల‌ర్ల దాడిలో తీవ్రంగా గాయ‌ప‌డి నిమ్స్ లో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య ఇవాళ క‌న్నుమూశారు. ఆమె మృతి ప‌ట్ల తెలంగాణ ప్ర‌భుత్వం తీవ్ర సంతాపం వ్య‌క్తం చేసింది. ఈ మేర‌కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేర‌కు రూ. కోటి ఎక్స్ గ్రేషియా ప్ర‌క‌టించింది. ఈ విష‌యాన్ని ఆదివారం రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణ‌రావు వెల్ల‌డించారు. ఆమె మృతి ప‌ట్ల తీవ్ర ఆవేద‌న చెందారు. ఇది జ‌ర‌గ కూడ‌ద‌ని పేర్కొన్నారు. దీనిని సీరియ‌స్ గా తీసుకుంటామ‌న్నారు. ఆమె కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని చెప్పారు. క్షేత్రస్థాయి విధుల్లో ఉన్న ఎక్సైజ్ సిబ్బంది భద్రత కోసం వారికి ఆయుధాలు అందిస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు.
నిజామాబాద్‌లో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ముఠాను అడ్డుకునే ప్రయత్నంలో సౌమ్య జనవరి 23న తీవ్రంగా గాయపడ్డారు. పారిపోయే ప్రయత్నంలో స్మగ్లర్లు కావాలనే తమ వాహనంతో త‌న‌ను ఢీకొట్టారు. నిజామాబాద్ జిల్లాలో విధి నిర్వహణలో ఉండగా ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. త‌న వ‌య‌సు 26 ఏళ్లు. వారి దాడి కార‌ణంగా త‌ను తీవ్రంగా గాయ‌ప‌డింది. త‌న‌ను హుటా హుటిన హైద‌రాబాద్ లోని నిమ్స్ కు త‌ర‌లించారు. కానీ చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించ లేదు. ఇవాళ సౌమ్య తుది శ్వాస విడిచారు. రాష్ట్రంలో గంజాయి స్మ‌గ్ల‌ర్లు పెద్ద ఎత్తున దందా నిర్వ‌హిస్తున్న‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. మొత్తం విలువైన ప్రాణం కోల్పోవ‌డం తెలంగాణ ప్రాంతానికి తీర‌ని న‌ష్టం అని పేర్కొంది స‌ర్కార్.
The post ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య‌కు రూ. కోటి ఎక్స్ గ్రేషియా appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Aadhaar Card: నో ఆధార్‌ నో శాలరీ – ఖజానా డైరెక్టరేట్‌కు ఆర్థికశాఖ ఆదేశాలుAadhaar Card: నో ఆధార్‌ నో శాలరీ – ఖజానా డైరెక్టరేట్‌కు ఆర్థికశాఖ ఆదేశాలు

    ఆధార్‌ సంఖ్యను తెలపని ఉద్యోగులకు ఈ నెల జీతం ఆపేయాలని రాష్ట్ర ఖజానా డైరెక్టరేట్‌కు ఆర్థికశాఖ శనివారం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో పనిచేస్తున్న శాశ్వత, తాత్కాలిక ఉద్యోగులందరి పేర్లు, హోదా, ఆధార్, సెల్‌ఫోన్‌ నంబర్ల వివరాలు ఈ

Local Body Elections: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు నిలిపివేతLocal Body Elections: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు నిలిపివేత

Local Body Elections : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు (High Court) తీర్పు నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల విడుదల చేసిన స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ను నిలిపివేసినట్లు ప్రకటించింది.

SSC Exam Schedule: ఏపీ టెన్త్ ఎగ్జామ్స్‌ షెడ్యూల్ విడుదలSSC Exam Schedule: ఏపీ టెన్త్ ఎగ్జామ్స్‌ షెడ్యూల్ విడుదల

  ఆంధ్రప్రదేశ్ పదోతరగతి పరీక్షల షెడ్యూల్ ను రాష్ట్ర ఎస్ఎస్‌సీ బోర్టు విడుదల చేసింది. ఎస్ఎస్‌సీ బోర్టు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం 2026 మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్‌ 1వ తేదీ వరకు ఏపీ టెన్త్ ఎగ్జామ్స్‌ జరుగనున్నాయి.