hyderabadupdates.com Gallery ఎట్ట‌కేల‌కు అమెరికాపై గెలిచిన పాకిస్తాన్

ఎట్ట‌కేల‌కు అమెరికాపై గెలిచిన పాకిస్తాన్

ఎట్ట‌కేల‌కు అమెరికాపై గెలిచిన పాకిస్తాన్ post thumbnail image

శ్రీ‌లంక : టి 20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో భాగంగా శ్రీ‌లంక రాజ‌ధాని కొలంబో వేదిక‌గా జ‌రిగిన కీల‌క‌మైన మ్యాచ్ లో అమెరికా జ‌ట్టుపై విజ‌యం సాధించింది పాకిస్తాన్. పాక్ జ‌ట్టుకు చెందిన ఫ‌ర్హాన్ అద్భుతంగా ఆడాడు. హాఫ్ సెంచ‌రీతో ఆక‌ట్టుకున్నాడు. బౌల‌ర్లు కూడా స్పిన్ మాయ‌జాలం చేయ‌డంతో పాక్ సునాయ‌సంగా గెలుపొందింది. ఈ రెండు జ‌ట్లు గ్రూప్ – ఎలో త‌ల‌ప‌డ్డాయి. ఫ‌ర్హాన్ 41 బంతులు ఎదుర్కొని 73 ర‌న్స్ చేశాడు. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో పాకిస్తాన్ 9 వికెట్లు కోల్పోయి 190 ర‌న్స్ చేసింది. అబ్రార్ అహ్మ‌ద్ 30 ప‌రుగులు ఇచ్చి ఒక వికెట్ తీయ‌గా . షాదాబ్ ఖాన్ 26 ప‌రుగులు ఇచ్చి 2 వికెట్లు, ఉస్మాన్ తారిక్ 27 ర‌న్స్ ఇచ్చి 3 వికెట్లు తీశాడు.
న‌వాజ్ 21 ర‌న్స్ ఇచ్చి మ‌రో వికెట్ కూల్చాడు. అనంత‌రం 191 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగింది అమెరికా జ‌ట్టు. 8 వికెట్లు కోల్పోయి 158 ప‌రుగుల‌కే ప‌రిమితం అయ్యింది అమెరికా జ‌ట్టు. ఇదిలా ఉండ‌గా పాకిస్తాన్ టీమ్ కు ఇది రెండో విజ‌యం టోర్నీలో. ఇక అమెరికా జ‌ట్టు గెలుపు కు ద‌గ్గ‌ర‌గా వ‌చ్చింది. శుభ‌మ్ రంజానే దూకుడుగా ఆడాడు. త‌ను కేవ‌లం 30 బంతులు మాత్ర‌మే ఎదుర్కొని 51 ప‌రుగులు చేశాడు. ఓపెన‌ర్లు ష‌యాన్ జ‌హంగీర్ 34 బాల్స్ ఎదుర్కొని 49 ప‌రుగుల వ‌ద్ద వెనుదిరిగాడు. గౌస్ 13 బాల్స్ ఎదుర్కొని 13 ర‌న్స్ చేశాడు. చివ‌ర‌కు పాకిస్తాన్ బౌల‌ర్ల మాయాజాలానికి వికెట్లు పారేసుకున్నారు. దీంతో పాకిస్తాన్ గ్రాండ్ విక్ట‌రీని న‌మోదు చేసింది.
The post ఎట్ట‌కేల‌కు అమెరికాపై గెలిచిన పాకిస్తాన్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

DK Shivakumar: దిల్లీ డీకే వర్గీయుల పయనం ! ఆశక్తికరంగా కన్నడ రాజకీయాలు !DK Shivakumar: దిల్లీ డీకే వర్గీయుల పయనం ! ఆశక్తికరంగా కన్నడ రాజకీయాలు !

    కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై జోరుగా ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ క్యాంపు ఎమ్మెల్యేలు గురువారం మధ్యాహ్నం దిల్లీకి వెళ్లినట్లు సమాచారం. సీఎం మార్పునకు కాంగ్రెస్‌ అధిష్ఠానంపై ఒత్తిడి పెంచేందుకు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇచ్చిన మాట

రాష్ట్రంలో పాల‌నా ప‌రంగా సీఎం ఫెయిల్రాష్ట్రంలో పాల‌నా ప‌రంగా సీఎం ఫెయిల్

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచంద‌ర్ రావు రాష్ట్రంలో చోటు చేసుకున్న దారుణ ప‌రిస్థితుల గురించి సీఎం రేవంత్ రెడ్డికి బ‌హిరంగ లేఖ రాశారు. ఈ సంద‌ర్భంగా కీల‌క అంశాల గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా

సింహాచ‌లం చందనోత్స‌వం ఏర్పాట్ల‌పై ఆరాసింహాచ‌లం చందనోత్స‌వం ఏర్పాట్ల‌పై ఆరా

విశాఖపట్నం జిల్లా : సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారిని హోం మంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి దేవస్థాన అధికారులు ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం వేద పండితులు మంత్రోచ్ఛారణల మధ్య