hyderabadupdates.com movies ఎన్టీఆర్ లుక్‌పై మూవీ లవర్స్ రియాక్షన్ ఏంటి

ఎన్టీఆర్ లుక్‌పై మూవీ లవర్స్ రియాక్షన్ ఏంటి

గత ఏడాది ‘దేవర’ సినిమాతో అభిమానులను మురిపించాడు జూనియర్ ఎన్టీఆర్. కానీ ఈ ఏడాది అతడికి కలిసి రాలేదు. బాలీవుడ్ ఎంట్రీ మూవీ ‘వార్-2’ మీద అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు కానీ.. అది ఆ అంచనాలను అందుకోలేకపోయింది. ఈ చిత్రంలో తారక్ లుక్ మీద కూడా మిశ్రమ స్పందన వచ్చింది. కొన్ని సన్నివేశాల్లో మరీ బక్క చిక్కి కనిపించడం చాలామందికి నచ్చలేదు. 

తర్వాతి సినిమా ప్రశాంత్ నీల్‌తో కావడంతో తారక్ లుక్ అదిరిపోతుందనే అంచనాతో ఉన్నారు ఫ్యాన్స్. కానీ ఈ సినిమా షూట్ మొదలయ్యాక తారక్ కనిపిస్తున్న తీరు అనేక అనుమానాలను రేకెత్తిస్తోంది. ‘వార్-2’లో కనిపించిన లీన్ లుక్కే ఫ్యాన్స్‌కు అంతగా నచ్చలేదంటే.. ఈ మధ్య తారక్ ఇంకా సన్నబడిపోయాడు. తారక్ కెరీర్ ఆరంభంలో ఒక పదేళ్లు ఎంత బొద్దుగా ఉన్నాడో తెలిసిందే. కానీ తర్వాత బాగా బరువు తగ్గాడు. మరీ అంత సన్నబడ్డపుడూ బాలేడు కానీ.. తిరిగి కొంచెం ఒళ్లు చేశాక లుక్ పర్ఫెక్ట్‌గా అనిపించింది. 

తారక్‌ను ఫ్యాన్స్ అలాంటి బ్యాలెన్స్డ్ లుక్‌లో చూడాలనే కోరుకుంటున్నారు. ‘జనతా గ్యారేజ్’ చిత్రంలో మాదిరి తయారవ్వాలని కోరుకుంటున్నారు. ప్రశాంత్ నీల్ సినిమా కోసం గడ్డం పెంచడం బాగానే ఉంది కానీ.. బరువు మరీ తగ్గిపోవడమే ఫ్యాన్స్‌కు నచ్చట్లేదు. లీన్ లుక్ కోసం ప్రయత్నించే క్రమంలో తారక్ ముఖంలో కళ తగ్గింది. డల్లుగా కనిపిస్తున్నాడు. తాజాగా తన బావమరిది నార్నె నితిన్ పెళ్లిలోనూ తారక్ లుక్ పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

ప్రస్తుతం నీల్ సినిమా షూట్ నుంచి బ్రేక్ తీసుకున్నాడు తారక్. నవంబరులో మూవీ కొత్త షెడ్యూల్ మొదలు కానుంది. ఆ సమయానికి తారక్ కొంచెం బరువు పెరిగితే, గుబురు గడ్డంతో ఊర మాస్‌గా తయారవుతాడని.. అప్పుడు నీల్ సినిమాలో పర్ఫెక్ట్‌‌లో కనిపిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. నీల్ మూవీ అంటే మాస్ ఎలివేషన్లకు పెట్టింది పేరు. తారక్‌కు మాస్‌లో ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఈ కాంబినేషన్లో రాబోయే సినిమా అంచనాలకు తగ్గట్లు ఉంటే.. బాక్సాఫీస్ దగ్గర ఆకాశమే హద్దు.

Related Post

Premaledhani Teaser: A Heartfelt Tale of Love, Insecurity, and EmotionPremaledhani Teaser: A Heartfelt Tale of Love, Insecurity, and Emotion

The much-awaited teaser of Premaledhani, directed by GD Narasimha under the banner of GDR Motion Picture, has finally been released — and it’s winning hearts already. The film, produced by

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు. అంతేకాదు.. గ‌త ఐదేళ్ల‌లో ఇక్క‌డ చంద్ర‌బాబును ఓడించేందుకు వైసీపీ చేసిన ప్ర‌య‌త్నాలు కూడా నిర్వీర్య మ‌య్యాయి. మ‌రోసారి కూడా చంద్ర‌బాబుకు