hyderabadupdates.com movies ఎన్టీఆర్ శోభన్ బాబు… ప్రభాస్ మహేష్ బాబు

ఎన్టీఆర్ శోభన్ బాబు… ప్రభాస్ మహేష్ బాబు

తెలుగు ప్రేక్షకులకు రాముడు అంటే గుర్తొచ్చే రూపం స్వర్గీయ నందమూరి తారకరామారావుగారే. కృష్ణుడి పాత్రల ద్వారానే ఎక్కువ పాపులారిటీ వచ్చినప్పటికీ లవకుశలో ఆయన దివ్యమంగళ దర్శనం జరిగాక వేరొకరిని ఆ క్యారెక్టర్ లో చూసేందుకు జనం ఇష్టపడేవాళ్లు కాదు. అందుకే సంవత్సరాల తరబడి ఎవరు ఆ రిస్క్ చేయలేకపోయారు. అక్కినేని నాగేశ్వరరావుగారిని అడిగినా ఒప్పుకోలేదు. అంతగా ఎన్టీఆర్ ప్రభావం ఆడియన్స్ మీద ఉండేది. తర్వాత సంపూర్ణ రామాయణంలో శోభన్ బాబుని రాముడిగా అద్భుతంగా చూపించిన దర్శకులు బాపు ప్రేక్షకులను ఒప్పించడంలో విజయం సాధించారు. అంత క్లిష్టమైన బాధ్యత ఇది.

ఇప్పుడు ఇన్ని దశాబ్దాల తర్వాత రాముడిగా మహేష్ బాబుని చూపించబోతున్నారు రాజమౌళి. ఒక కీలకమైన్ ఎపిసోడ్ కోసం ఫోటో షూట్ చేశాక వాల్ పేపర్ గా తన ఫోటోనే పెట్టుకున్నానని చెప్పిన జక్కన్న మళ్ళీ ఎవరైనా చూస్తారేమోనని డిలీట్ చేశానని చెప్పుకొచ్చారు. తనకే గూస్ బంప్స్ వచ్చే స్థాయిలో మహేష్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడని ఆనందం వ్యక్తం చేశారు. కొంటె కృష్ణుడిగా కనిపించే మహేష్ సౌమ్యుడైన రాముడిగా సూటవుతాడా అనే అనుమానం పూర్తిగా తొలగిపోయిందని, ఈ ఎపిసోడ్ రాస్తున్నప్పుడు తీస్తున్నప్పుడు గాల్లో తేలిన ఫీలింగ్ కలుగుతోందని ఊహించని పెద్ద స్థాయిలో ఎలివేషన్ ఇచ్చారు.

రాజమౌళి మాటల ప్రకారం మహేష్ బాబు విశ్వరూపం చూపించేది బహుశా రాముడి అవతారంలోనే కావొచ్చు. ఇక్కడ విజయేంద్రప్రసాద్ అన్న మాటలను లింక్ చేసుకుంటే మ్యాటర్ అర్థమైపోతుంది. రాముడిగా ఆదిపురుష్ లో ప్రభాస్ కూడా చేశాడు కానీ సినిమాతో పాటు డార్లింగ్ లుక్స్ మీద మిశ్రమ స్పందన వచ్చింది. ఓం రౌత్ సరిగా వాడుకుని ఉంటే నెగటివ్ కామెంట్స్ వచ్చేవి కాదు కానీ ఛాన్స్ మిస్ చేశాడు. కానీ ఇప్పుడు మహేష్ ని హ్యాండిల్ చేస్తోంది రాజమౌళి. సో అంచనాలు ఎంత పెట్టుకున్నా దానికి మించిన అవుట్ ఫుట్ ఇస్తాడని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే ఎక్కువ వెయిట్ చేయాలి. 

Related Post

టీమ్ లో గిల్ లేకపోవడం మంచిదేటీమ్ లో గిల్ లేకపోవడం మంచిదే

నిన్నటి నుంచి అందరూ టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ గురించే మాట్లాడుకుంటున్నారు. వైస్ కెప్టెన్ రేంజ్ లో ఉన్న శుభ్‌మన్ గిల్ లేకపోవడం పెద్ద షాక్ అని ఫీలవుతున్నారు. కానీ సెలెక్టర్లు తీసుకున్న ఈ ఒక్క నిర్ణయం వెనుక చాలా పెద్ద

Rajamouli Builds a Massive Set for Mahesh Babu’s SSMB29 Public EventRajamouli Builds a Massive Set for Mahesh Babu’s SSMB29 Public Event

The anticipation for Mahesh Babu and Rajamouli’s upcoming global adventure film SSMB29 is reaching new heights. According to sources, director S.S. Rajamouli is going all out to create a never-seen-before

హైకోర్టును కూడా వదలని హ్యాకర్లు.. ఏం జరిగిందిహైకోర్టును కూడా వదలని హ్యాకర్లు.. ఏం జరిగింది

vహ్యాకింగ్ మోసాలకు అంతు లేకుండా పోయింది. ప్రభుత్వ వెబ్ సైట్లు, వ్యక్తుల సోషియల్ మీడియా ఖాతాలను కూడా హ్యాక్ చేస్తున్నారు. కీలక సమాచారాన్ని తస్కరిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఆ సమాచారాన్ని డిలీట్ చేసిన ఘటనలు కూడా కనిపిస్తున్నాయి. ఇటీవల ప్రముఖ నటుడు