hyderabadupdates.com movies ఎన్ని ఆట‌లు ఆడ‌తావ‌య్యా పెద్ది

ఎన్ని ఆట‌లు ఆడ‌తావ‌య్యా పెద్ది

ఈ రోజు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ పుట్టిన రోజు. అనుకున్న‌ట్లే చ‌ర‌ణ్ కొత్త సినిమా పెద్ది నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఐతే ఈ గ్లింప్స్ చూసి అంద‌రూ ఒక్క‌సారిగా షాకైపోయారు. పెద్ది సినిమా నుంచి ఇప్ప‌టిదాకా రిలీజ్ చేసిన ప్ర‌తి ప్రోమోల‌నూ క్రికెట్ లింక్ ఉంది. ఫ‌స్ట్ టీజ‌ర్.. చికిరి చికిరి పాట‌.. రారా రైరా సాంగ్.. ఇలా అన్నింట్లోనూ హీరో క్రికెటింగ్ స్కిల్స్ చూపించారు.

ఈ సినిమాలో హీరో క్రికెట‌ర్.. క‌థ కూడా దాని చుట్టూనే తిరుగుతుందని అంతా అనుకుంటూ వ‌చ్చారు. కానీ ఈ రోజు లాంచ్ చేసిన గ్లింప్స్‌లో ఒక్క‌సారిగా చ‌ర‌ణ్ కుస్తీ యోధుడిగా మారిపోవ‌డం.. స్ట‌న్నింగ్ మేకోవ‌ర్‌తో క‌నిపించ‌డం చూసి అంద‌రూ అవాక్క‌య్యారు. ఆ బాడీ ఏంటి.. ఆ మేకోవ‌ర్ ఏంటి.. ఆ ప‌ర్ఫెక్ష‌న్ ఏంటి అంటూ కామెంట్లు పెడుతున్నారు.

పెద్ది క్రికెట‌ర్ క‌థ అనుకుంటే.. కొత్త‌గా ఈ కుస్తీ యాంగిల్ ఏంటో అర్థం కాక అయోమ‌యానికి గుర‌వుతున్నారు. ఈ గ్లింప్స్ చూశాక క్రికెట్ కొద్ది సేపు ఆడి.. కుస్తీనే చాలా సీరియ‌స్‌గా ఆడేలా క‌నిపిస్తున్నాడు చ‌ర‌ణ్‌. దీని కోసం త‌న మేకోవ‌ర్ ఆ రేంజిలో ఉంది మ‌రి.

పెద్ది లేటెస్ట్ గ్లింప్స్ చూశాక‌.. ఒక్క‌  సినిమాలో ఎన్ని ఆట‌లు ఆడ‌తావ‌య్యా చ‌ర‌ణూ అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజ‌న్లు సోష‌ల్ మీడియాలో. కానీ విశేషం ఏంటంటే.. సినిమాలో చ‌ర‌ణ్ ఇంకో ఆట కూడా ఆడ‌తాడు. దాని వెనుక పెద్ద ట్విస్ట్ కూడా ఉంటుంది. సినిమాలో ఆ ట్విస్ట్ చూసిన‌పుడు ప్రేక్ష‌కులు షాకైపోతారు.

ఈ సినిమాలో యునీక్ పాయింట్.. ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు సానా ముద్ర‌ను చూపించే పాయింట్ అదే. బ‌హుశా సినిమా రిలీజ్ ముందు వ‌ర‌కు ఆ పాయింట్ ఏంటి అన్న‌ది చూచాయిగా కూడా చెప్ప‌క‌పోవ‌చ్చు.

ఇక లేటెస్ట్ గ్లింప్స్ అభిమానుల‌కు ఇచ్చిన మ‌రో శుభ‌వార్త ఏంటంటే..పెద్ది సినిమా అనుకున్న ప్ర‌కార‌మే ఏప్రిల్ 30న విడుద‌ల కాబోతోంది. షూటింగ్, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ హ‌డావుడి అయ్యేలా ఉండ‌డంతో ఈ చిత్రాన్ని మ‌రోసారి వాయిదా వేయ‌బోతున్న‌ట్లు ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. కానీ ఆ ప్ర‌చారానికి బుచ్చిబాబు అండ్ టీం ఈ రోజు తెరదించేసింది. ఈ వేస‌విలో తెలుగు నుంచి రాబోతున్న అతి పెద్ద సినిమా కావ‌డంతో దీనిపై ప్రేక్ష‌కులే కాదు, ఇండ‌స్ట్రీ కూడా భారీ ఆశ‌లే పెట్టుకుంది.

Related Post

Bigg Boss 9 Telugu: Divya and Thanuja get into a massive fightBigg Boss 9 Telugu: Divya and Thanuja get into a massive fight

Bigg Boss 9 Telugu witnessed high-voltage drama when friends-turned-rivals Thanuja and Divya got into a heated altercation during a task. What started as a small disagreement quickly escalated, shocking both

యూత్ హీరోలు రూటు మారుస్తున్నారుయూత్ హీరోలు రూటు మారుస్తున్నారు

దశాబ్దాల క్రితం హీరోలు కేవలం సినిమాలకు మాత్రమే పరిమితమయ్యేవారు. టీవీ రంగమంటే అసలు అటువైపు చూసేవాళ్ళే కాదు. అమితాబ్ బచ్చన్ కౌన్ బనేగా కరోడ్ పతితో కొత్త మార్గం చూపించాక మెల్లగా ఇతరులు దాన్ని ఫాలో కావడం జరుగుతోంది. షారుఖ్ ఖాన్,