hyderabadupdates.com Gallery ఎన్ని జిమ్మిక్కులు చేసినా బీజేపీ గెల‌వ‌దు

ఎన్ని జిమ్మిక్కులు చేసినా బీజేపీ గెల‌వ‌దు

ఎన్ని జిమ్మిక్కులు చేసినా బీజేపీ గెల‌వ‌దు post thumbnail image

ముంబై : సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న భార‌తీయ జ‌న‌తా పార్టీని ఏకి పారేశారు. ఇంత కాలం కేంద్ర ఎన్నిక‌ల సంఘాన్ని అడ్డం పెట్టుకుని అధికారంలోకి వ‌చ్చింద‌ని ఆరోపించారు. ముంబైలో మాజీ సీఎం మీడియాతో మాట్లాడారు. తాజాగా కేంద్ర ఎన్నిక‌ల సంఘం దేశంలోని ఐదు రాష్ట్రాల‌లో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి షెడ్యూల్ ను ప్ర‌క‌టించింది. దీనిపై స్పందించారు. ఇప్పుడు ఎన్నికల తేదీలు ప్రకటించబడ్డాయి. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ, తమిళనాడులో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే పార్టీ తిరిగి అధికారంలోకి వస్తాయని ప్రజలు విశ్వసిస్తున్నారని చెప్పారు. నాకు కూడా న‌మ్మ‌కం ఉంద‌ని అన్నారు అఖిలేష్ యాద‌వ్. ఇతర ప్రాంతాల్లో కూడా బీజేపీ ఓటమి పాలవుతుంద‌ని జోష్యం చెప్పారు.
అసోం ,కేరళ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని ఎన్నికల సంఘం నిశితంగా పర్యవేక్షిస్తుందని, స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాత ఎన్నికలు జరిగేలా చూస్తుందని తాము ఆశిస్తున్న‌ట్లు తెలిపారు. ఓటర్లందరికీ సురక్షితమైన వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం లభించాల‌ని, దీనికి పూర్తిగా ఈసీ బాధ్య‌త వ‌హించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు మాజీ ముఖ్య‌మంత్రి. ఇదే స‌మ‌యంలో సల్మాన్ ఖాన్‌తో భేటీ గురించి కూడా ప్ర‌స్తావించారు. సల్మాన్ ఖాన్‌ను కలవడానికి నేను ఆయన ఇంటికి వెళ్లాను. ఆయన తండ్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండటంతో నేను ఆయన్ను కలవలేక పోయానని అన్నారు. అయితే, నేను ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నాను. త్వరగా కోలుకుని ఇంటికి తిరిగి వస్తారని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాన‌ని అన్నారు.
The post ఎన్ని జిమ్మిక్కులు చేసినా బీజేపీ గెల‌వ‌దు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Labour Law Reforms: కార్మికులందరికీ సామాజిక భద్రత కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయంLabour Law Reforms: కార్మికులందరికీ సామాజిక భద్రత కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం

    కార్మిక చట్టాల విషయంలో కేంద్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారి కార్మిక చట్టాల్లో భారీ సంస్కరణలను తీసుకొచ్చింది. సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న నాలుగు కార్మిక కోడ్‌ (స్మృతి)లను తక్షణమే అమల్లోకి తెస్తున్నట్లు

పాదయాత్ర ద్వారా సమాజం నుంచి ఎంతో నేర్చుకున్నాపాదయాత్ర ద్వారా సమాజం నుంచి ఎంతో నేర్చుకున్నా

కాకినాడ: అన్నిరంగాల్లో ఆంధ్రప్రదేశ్ ను నెం.1గా ఉంచాలన్నదే మా లక్ష్యం. అందులో విద్యార్థులంతా భాగస్వాములయ్యేలా మీ భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దాలన్నదే నా ధ్యేయం. ఇందుకోసం శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నట్లు రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.

25న బ్రేక్ ద‌ర్శ‌నాలు బంద్ : టీటీడీ చైర్మ‌న్25న బ్రేక్ ద‌ర్శ‌నాలు బంద్ : టీటీడీ చైర్మ‌న్

తిరుమ‌ల : శ్రీ‌వారి ఆల‌యంలో ఈనెల 25న ర‌థ స‌ప్త‌మి నిర్వ‌హిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సామాన్య భక్తులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపారు. ఇందుకు గాను శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవ‌లు,