hyderabadupdates.com Gallery ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి లోకేష్

ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి లోకేష్

ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి లోకేష్ post thumbnail image

మంగళగిరి: మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మహానాడు ప్రాంత ప్రజల దశాబ్దాల కలను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నెరవేర్చారు. తాడేపల్లి పట్టణం సీతానగరం మహానాడు వద్ద రిటైనింగ్ వాల్ నిర్మాణానికి మంత్రి లోకేష్ సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. తాడేపల్లిలో ప్రకాశం బ్యారేజీ దిగువన 0.9 కి.మీ నుంచి 2.610 కి.మీల వరకు కృష్ణా నది కుడివైపు రూ.294.20 కోట్లతో వరద రక్షణ గోడను నిర్మించనున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధికి మంత్రి లోకేష్ పెద్దపీట వేశారు. దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న ఈ ప్రాజెక్ట్ కు కేవలం ఏడాది కాలంలోనే రూ.294.20 కోట్ల పరిపాలన అనుమతులు సాధించడమే కాకుండా టెండర్ ప్రక్రియను కూడా పూర్తి చేశారు.
భవిష్యత్ లో భారీ వరదలను దృష్టిలో పెట్టుకుని 15 లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని సైతం తట్టుకునేలా పట్టిష్టమైన డిజైన్ తో రిటైనింగ్ వాల్ ను నిర్మించనున్నారు. కేవలం సాధారణ గోడ కాకుండా భూమి లోపల 26 నుంచి 38 మీటర్ల లోతు వరకు 1,920 పైల్స్ వేసి, పైల్- రాఫ్ట్ సాంకేతికతతో భూకంపాలను, నీటి ఉధృతిని తట్టుకునేలా నిర్మించనున్నారు. రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తైతే సుందరయ్య నగర్, మహానాడు కాలనీ వంటి లోతట్టు ప్రాంతాల్లో నివసించే దాదాపు 50వేల మంది ప్రజలు వరద భయం నుంచి శాశ్వతంగా విముక్తి పొందుతారు. అమరావతి రాజధాని పరిధిలోని కీలక ప్రాంతాలకు, జాతీయ రహదారి-65కు రక్షణగా రిటైనింగ్ వాల్ నిలవనుంది.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పద్మశాలీ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ నందం అబద్దయ్య, టీటీడీ బోర్డు మెంబర్ తమ్మిశెట్టి జానకీ దేవి, గుంటూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా, తాడేపల్లి మండల టీడీపీ అధ్యక్షుడు దాసరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
The post ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి లోకేష్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

టీడీపీ శ్రేణులు సంయ‌మ‌నం పాటించాలిటీడీపీ శ్రేణులు సంయ‌మ‌నం పాటించాలి

మంగ‌ళ‌గిరి : రాష్ట్రంలో టీడీపీ శ్రేణులు దాడుల‌కు దిగ‌వ‌ద్ద‌ని , కాస్త సంయ‌మ‌నం పాటించాల‌ని సూచించారు టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ప‌ల్లా శ్రీ‌నివాస రావు. సోమ‌వారం మంగ‌ళ‌గిరిలోని పార్టీ కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. పార్టీ జాతీయ అధ్య‌క్షుడు , సీఎం

APCC chief Sharmila threatens fast unto death if Aarogyasri services are not restored immediatelyAPCC chief Sharmila threatens fast unto death if Aarogyasri services are not restored immediately

APCC President YS Sharmila protested at Andhra Ratna Bhavan in Vijayawada on Wednesday demanding the immediate release of Arogya Sri funds in the wake of the government failing to pay Aarogyasri (NTR

Ravi Teja’s Mass Jathara ‘Super Duper’ Track Takes the Buzz to New HeightsRavi Teja’s Mass Jathara ‘Super Duper’ Track Takes the Buzz to New Heights

Mass Jathara, a much awaited movie featuring Ravi Teja and Sreeleela, is preparing for a massive cutout with its release on the horizon, and the producers are intensifying their promotions