hyderabadupdates.com Gallery ఏకీకృత భారతదేశాన్ని జరుపు కోవాలి : స్టాలిన్

ఏకీకృత భారతదేశాన్ని జరుపు కోవాలి : స్టాలిన్

ఏకీకృత భారతదేశాన్ని జరుపు కోవాలి : స్టాలిన్ post thumbnail image

చెన్నై : 77వ గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్బంగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు త‌మిళ‌నాడు రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎంకే స్టాలిన్. సోమ‌వారం ఆయ‌న జెండాను ఆవిష్క‌రించి రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. తాము ఏక రూప భార‌త దేశాన్ని కోరుకోవ‌డం లేద‌ని అన్నారు. 143 కోట్ల‌మంది ప్ర‌జ‌లు కేవ‌లం ఏకీకృత భార‌త దేశం కావాల‌ని కోరుకుంటున్నార‌ని చెప్పారు. ఆయ‌న త్రిభాషా విధానాన్ని ఎట్టి ప‌రిస్థితిలో ఒప్పుకునేది లేద‌ని ఇప్ప‌టికే స్ప‌ష్టం చేశారు. ఆయ‌న నిరంత‌రం కేంద్రంతో ఘ‌ర్ష‌ణ ప‌డుతున్నారు. ఈ త‌రుణంలో తాజాగా చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి. భారతదేశంలో అనేక స్వరాలు ఉన్నాయని అన్నారు. అనేక గుర్తింపులు దేశాన్ని తీర్చిదిద్దాయని ముఖ్యమంత్రి స్ప‌ష్టం చేశారు.
గణతంత్ర దినోత్సవాన్ని ఏకరూప భారతదేశంగా కాకుండా, ఐక్య భారతదేశంగా జరుపుకోవాలని నొక్కి చెప్పారు. సంస్కృతులు ఒకదానికొకటి సుసంపన్నం చేసుకుంటూ, భాషలు గర్వంగా సహ జీవనం చేసే దేశంగా ఇది కొనసాగాలని ఆయన అభిప్రాయ‌ప‌డ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు చేశారు. ప్రతి పౌరుడు గౌరవంగా, ఆత్మవిశ్వాసంతో , స్వేచ్ఛతో జీవించ గలిగినప్పుడే భారతదేశం ముందుకు సాగుతుంద‌న్నారు. కులం పేరుతో, మ‌తం పేరుతో, ప్రాంతం పేరుతో రెచ్చ‌గొడుతూ ప్ర‌జ‌ల మ‌ధ్య విద్వేషాల‌ను ర‌గిలిస్తూ వ‌స్తున్న వారికి ఇది చెంప‌పెట్టుగా మారాల‌న్నారు. ప్ర‌తి ఒక్క‌రూ జాగురూక‌త‌తో ఉండాల‌ని సూచించారు ఎంకే స్టాలిన్.
విశ్వాసం ఒక వ్యక్తిగత సత్యంగా ఉండే దేశంగా మనం కొనసాగాల్సిన అవస‌రం ఉంద‌న్నారు సీఎం.మన బలం ఎప్పుడూ ఏకరూపత కాదన్నారు. అది ఎల్లప్పుడూ మన బహుళత్వం. వైవిధ్యం రక్షించ బడినప్పుడు, ఐక్యతా భావన సహజంగా ఉంటుంద‌న్నారు ఎంకే స్టాలిన్.
The post ఏకీకృత భారతదేశాన్ని జరుపు కోవాలి : స్టాలిన్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

అంగ‌రంగ వైభోగం ధ్వ‌జారోహ‌ణంఅంగ‌రంగ వైభోగం ధ్వ‌జారోహ‌ణం

తిరుపతి : తిరుపతి శ్రీకపిలేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఆదివారం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. అర్చకుల వేదమంత్రోచ్ఛారణ, శంఖనాదాలు, శివ నామస్మరణ మధ్య ధ్వజారోహణ ఘట్టం శాస్త్రోక్తంగా జరిగింది. పంచమూర్తులైన శ్రీ సోమస్కంధ మూర్తి, శ్రీ కామాక్షి అమ్మ వారు, శ్రీ

గ‌ద్ద‌ర్ అవార్డుల‌ను ప్ర‌క‌టించిన స‌ర్కార్గ‌ద్ద‌ర్ అవార్డుల‌ను ప్ర‌క‌టించిన స‌ర్కార్

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. శ‌నివారం అధికారికంగా గ‌త ఏడాది 2025 సంవ‌త్స‌రానికి సంబంధించి దివంగ‌త ప్ర‌జా యుద్ద నౌక గ‌ద్ద‌ర్ పేరుతో ఏర్పాటు చేసిన అవార్డుల‌కు సంబంధించి విజేత‌ల వివ‌రాలు అధికారికంగా వెల్ల‌డించింది. ఇందులో

Telangana Police: నోరు జారి జైలుపాలయిన హత్య కేసు నిందితులుTelangana Police: నోరు జారి జైలుపాలయిన హత్య కేసు నిందితులు

  కరీంనగర్ లో ఓ హత్య కేసు నిందితులు… అనుకోకుండా పోలీసులకు పట్టుబడ్డారు. ఓ కేసులో వారిపై పోలీసులు నిఘా ఉంచగా… అది తెలియక నోరు జారడంతో గతంలో వీరు చేసిన హత్య వెలుగులోనికి వచ్చింది. దీనితో రంగంలోనికి దిగిన పోలీసులు