hyderabadupdates.com movies ఏటిగట్టులో ఉన్నది కులాల కొట్లాటే

ఏటిగట్టులో ఉన్నది కులాల కొట్లాటే

ఈ మధ్య  కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ హాట్ టాపిక్ గా మారిన అంశం కుల గొడవల సినిమాలు. ముఖ్యంగా ధృవ్ విక్రమ్ బైసన్ రిలీజయ్యాక ఈ చర్చ మరింత విస్తృతమయ్యింది. మారి సెల్వరాజ్, పా రంజిత్ లాంటి దర్శకులు తమను అదే పనిగా టార్గెట్ చేయడం పట్ల ఓపెన్ గా కామెంట్స్ చేస్తూ కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సంవత్సరానికి మూడు వందల కమర్షియల్ సినిమాలు వస్తున్నాయని, వాటిని వదిలేసి కేవలం తమ ముగ్గురిని కామెంట్ చేయడం పట్ల వెట్రిమారన్ ని కలుపుకుని పా పంజిత్ అన్న మాటలు డిస్కషన్ కు దారి తీశాయి. క్యాస్ట్ బేస్డ్ మూవీస్ వద్దంటున్న సోషల్ మీడియా బ్యాచ్ పెద్దదే ఉంది.

కాకపోతే తెలుగులో ఇలాంటి ప్రయత్నాలు తక్కువే. అప్పుడెప్పుడో సప్తపది, జయం మనదేరా లాంటి చిత్రాల్లో ఈ కులాల గురించి టచ్ చేశారు కానీ గత కొన్నేళ్లలో ఎవరూ వీటి జోలికి వెళ్ళలేదు. సాయి దుర్గ తేజ్ నటిస్తున్న సంబరాల ఏటిగట్టులో ఈ సున్నితమైన అంశాన్ని టచ్ చేసినట్టు తాజాగా ఇచ్చిన ఒక ఇంగ్లీష్ ఇంటర్వ్యూలో స్వయంగా హీరోనే చెప్పేశాడు. కింది కులాల మీద అగ్ర కులాలు దారుణమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించినప్పుడు జరిగే పరిణామాలను ఇందులో చూపించబోతున్నట్టు చెప్పాడు. ఇంకేముంది తమిళ అభిమానుల సంఘం ఇప్పుడీ పాయింట్ ని పట్టుకుని ఎక్స్, ఇన్స్ టాలో డిస్కషన్లు మొదలుపెట్టేలా ఉంది.

ఒకప్పటిలా కాకపోయినా అంతో ఇంతో కుల వివక్ష సమాజంలో ఇంకా ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రూపు మాసిపోలేదు. అందుకే తరచుగా ఈ కాన్సెప్ట్స్ కి టచ్ చేస్తున్న దర్శకులు లేకపోలేదు. ఇదంతా ఓకే కానీ సంబరాల ఏటిగట్టు విడుదల తేదీ వ్యవహారం మాత్రం ఇంకా తేలలేదు. డిసెంబర్ ఛాన్స్ దాదాపు లేనట్టే. సంక్రాంతికి స్లాట్ ఖాళీగా లేదు. జనవరి నెలాఖరు ఆప్షన్ ఉంది కానీ ఇంత పెద్ద బడ్జెట్ కి రిస్క్ అవ్వొచ్చు. మార్చి నుంచి వరసగా పెద్ది, ఉస్తాద్ భగత్ సింగ్, విశ్వంభరలున్నాయి. వీటికన్నా ముందే వచ్చేయాలి. మరి ఫిబ్రవరిలో ఏమైనా వచ్చే ఆలోచన చేస్తుందేమో  ప్రకటన వచ్చే దాకా వేచి చూడాలి.

Related Post

శివంగిగా మారిన శివన్న… చాలా విచిత్రంగా ఉందేశివంగిగా మారిన శివన్న… చాలా విచిత్రంగా ఉందే

శాండల్ వుడ్ హీరో ఉపేంద్ర ఎంత టిపికల్ గా ఆలోచిస్తారో తొంభై దశకంలో సినిమాలు చూసిన వాళ్లకు బాగా తెలుసు. కేవలం A టైటిల్ తో సెన్సేషన్ సృష్టించడం ఆయనకే చెల్లింది. తెలుగులో అప్పుడప్పుడు కనిపించే ఈ విలక్షణ నటుడు ఈ

Pawan Kalyan’s Ustaad Bhagat Singh expected to near the finish line by this timePawan Kalyan’s Ustaad Bhagat Singh expected to near the finish line by this time

Powerstar Pawan Kalyan’s OG is now ruling the OTT space with terrific viewership. The actor-turned-politician’s next release is Ustaad Bhagat Singh, directed by Harish Shankar. The film is loosely based