hyderabadupdates.com Gallery ఏపీ అభివృద్ధికి జర్నలిస్టులు సహకరించాలి

ఏపీ అభివృద్ధికి జర్నలిస్టులు సహకరించాలి

ఏపీ అభివృద్ధికి జర్నలిస్టులు సహకరించాలి post thumbnail image

విజయవాడ : గత ప్రభుత్వంలో జర్నలిస్టులకు కనీసం మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదని, కూటమి ప్రభుత్వం వచ్చాక ఏపీలో మీడియాకు ప్రశ్నించే స్వేచ్ఛ, మాట్లాడే స్వేచ్ఛను కల్పించామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గతంతో పోల్చుకుంటే మీడియాలో విలువలు వేగంగా పడిపోతున్నాయని ఆవేద‌న చెందారు. విలువల పునరుద్దరణ జరిగేలా చూడాలని జర్నలిస్టులను సీఎం కోరారు. రాజకీయ పార్టీలకు సొంత మీడియా ఉండటం ప్రమాదానికి దారి తీస్తోందని అన్నారు. తమది జర్నలిస్ట్ ఫ్రెండ్లీ ప్రభుత్వమని, జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి శక్తి మేరకు కృషి చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఐజేయూ 11వ ప్లీనరీ సమావేశానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముఖ్యమంత్రికి ఐజేయూ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. సీనియర్ జర్నలిస్టులను సీఎం అప్యాయంగా పలకరించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ విజయవాడలో ఐజేయూ 11వ ప్లీనరీని జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్ లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు ఇప్పుడు ఫలితాలు కనిపిస్తున్నాయని ఐజేయూ ప్రతినిధులు చెప్పడం సంతోషంగా క‌లిగించింద‌ని పేర్కొన్నారు సీఎం. ప్రస్తుత కాలంలో జర్నలిజం బాగా మారి పోయిందన్నారు. మీడియా విపరీత పోకడలు సమాజానికి మంచిది కాదన్నారు. అలవోకగా అబద్ధాలను చిత్రీకరిస్తున్నారంటూ వాపోయారు. మీడియాలో విలువలు, సిద్దాంతాలు పడిపోతున్నాయని పేర్కొన్నారు. దీన్ని పునరుద్దరించు కోవాల్సిన అవసరం ఉందన్నారు.
2019లో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ వివేకానందరెడ్డి చనిపోతే నాపై తప్పుడు వార్తలు రాశారని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మొదట వైఎస్ వివేకా మరణాన్ని గుండె పోటుగా చిత్రీకరించారు. పోస్టు మార్టానికి ఆదేశించడంతో అసలు విషయాలు బయటపడే సరికి హత్య నెపాన్ని నాపై మోపారు. నారాసుర రక్త చరిత్ర అని నా చేతిలో కత్తి పెట్టి సాక్షిలో తప్పుడు వార్త రాశారు. తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని మండిప‌డ్డారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరగ్గకుండా నియంత్రించేలా జర్నలిస్టులు కృషి చేయాలి అని సీఎం చంద్రబాబు కోరారు.
The post ఏపీ అభివృద్ధికి జర్నలిస్టులు సహకరించాలి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

డ‌యేరియా , క‌ల్తీ పాల వ్య‌వహారంపై సీఎం సీరియ‌స్డ‌యేరియా , క‌ల్తీ పాల వ్య‌వహారంపై సీఎం సీరియ‌స్

అమరావతి : శ్రీకాకుళం పట్టణంలో నీటి కలుషితం కారణంగా ప్రబలిన డయేరియా, రాజమండ్రిలో కల్తీ పాల కారణంగా పలువురు చనిపోయిన ఘటనలపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో జరిగిన ఈ సమీక్షలో మున్సిపల్, ఆరోగ్య శాఖ అధికారులు

మెగాస్టార్ బొమ్మ బ్లాక్ బ‌స్ట‌ర్ క‌లెక్ష‌న్స్ సూప‌ర్మెగాస్టార్ బొమ్మ బ్లాక్ బ‌స్ట‌ర్ క‌లెక్ష‌న్స్ సూప‌ర్

హైద‌రాబాద్ : మెగాస్టార్ చిరంజీవి, అందాల తార న‌య‌న‌తార , విక్ట‌రీ వెంక‌టేశ్ క‌లిసి న‌టించిన చిత్రం మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ గారు మూవీ వ‌సూళ్ల వేట కొన‌సాగిస్తోంది. సంక్రాంతి పండుగ సంద‌ర్బంగా విడుద‌లైన ఈ మూవీ దుమ్ము రేపుతోంది.

Wife: ప్రియుడి కోసం భర్తను కాల్చి చంపిన భార్యWife: ప్రియుడి కోసం భర్తను కాల్చి చంపిన భార్య

  ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. ముగ్గురు పిల్లల తల్లి గుట్టుగా నడుపుతున్న ప్రేమ వ్యవహారం ఆమె భర్తకు తెలిసింది. దీనిని గ్రహించిన ఆమె భర్త ఎక్కడ రచ్చ చేస్తాడోనని భయపడి, అతనిని అంతం చేయాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం ప్రియుడి సాయం