hyderabadupdates.com Gallery ఏపీ, త‌మిళ‌నాడు ప్రజలది అన్నదమ్ముల బంధం

ఏపీ, త‌మిళ‌నాడు ప్రజలది అన్నదమ్ముల బంధం

ఏపీ, త‌మిళ‌నాడు ప్రజలది అన్నదమ్ముల బంధం post thumbnail image

త‌మిళ‌నాడు : ఏపీ, తమిళ‌నాడు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌ది అన్న‌ద‌మ్ముల అనుబంధం ఉంద‌న్నారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. తమిళనాడు ఎన్నిక‌ల సంద‌ర్బంగా మంగళ‌వారం జ‌రిగిన‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి పాల్గొని ప్ర‌సంగించారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా చెన్నైకి ఎన్టీఆర్ తాగునీరు ఇచ్చారన్నారు.
తిరువళ్ళూర్ నుంచి అబ్దుల్ కలాం వరకు ఎంతో మంది ప్రముఖులు ఈ గడ్డ నుంచి వచ్చారని తెలిపారు. తమిళనాడుకు చెందిన ఎంతో మంది ఉన్నతాధికారులు దేశానికి సేవ చేశార‌ని, ఇంకా చేస్తూనే ఉన్నార‌ని చెప్పారు నారా చంద్ర‌బాబు నాయుడు.
తమిళ ప్రజలకు వారి భాష అంటే ఎంతో ప్రేమ, కష్టించి పని చేసే మనస్తత్వం వారిదన్నారు. ఏపీ తమిళనాడు రాష్ట్రాల ప్రజలది అన్నదమ్ముల కంటే ఎక్కువ బంధం ఉద‌న్నారు. ఘనమైన వారసత్వం, సంపద కలిగిన రాష్ట్రం తమిళనాడు అని పేర్కొన్నారు. మన దేశానికి ఓ సంస్కరణ వాది ప్రధానిగా ఉన్నారన్నారు. రాష్ట్రాల మధ్య అభివృద్ధి పోటీ ఉందని, దీనికి కేంద్ర ప్రోత్సాహం కూడా ఉందన్నారు.
మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్రాన్ని ఓడించామని కాంగ్రెస్, డీఎంకే అంటున్నాయన్నారు. కానీ వారు మహిళలను ఓడించారని పేర్కొన్నారు సీఎం. నియోజకవర్గాల పునర్విభజన ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం లేదన్నారు. కొత్త సెన్సస్ ప్రకారం అయితే దక్షిణాది నష్టపోవాల్సి వచ్చేదన్నారు.
The post ఏపీ, త‌మిళ‌నాడు ప్రజలది అన్నదమ్ముల బంధం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Pakistan: 14 మందిని సిక్కులను వెనక్కి పంపేసిన పాక్Pakistan: 14 మందిని సిక్కులను వెనక్కి పంపేసిన పాక్

    సిక్కుల గురువు గురునానక్ దేవ్ 556వ జయంతి సందర్భంగా అట్టారి-వాగా సరిహద్దు వద్ద 14 మందికి పైగా యాత్రికులకు ప్రవేశాన్ని పాకిస్థాన్ నిరాకరించింది. యాత్రికుల హిందూ మత విశ్వాసాలను కారణంగా చూపుతూ పాకిస్థాన్ ఇమిగ్రేషన్ అధికారులు వారిని వెనక్కి

BJP: బీఎంసీ ఎన్నికలపై బీజేపీ కసరత్తుBJP: బీఎంసీ ఎన్నికలపై బీజేపీ కసరత్తు

  త్వరలో జరుగనున్న ప్రతిష్టాత్మక బ్రిహాన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై బీజేపీ (BJP) కసరత్తు ప్రారంభించింది. మహాయుతి కూటమిలో భాగంగా 140 నుంచి 150 సీట్లలో పోటీ చేయాలని కమలనాథుల ఆలోచనగా ఉంది. బీజేపీ భాగస్వామ్య పార్టీ

కేసీఆర్ తో పెట్టుకోవ‌డం అంటే పులిని గోక్క‌వ‌డ‌మేకేసీఆర్ తో పెట్టుకోవ‌డం అంటే పులిని గోక్క‌వ‌డ‌మే

హైద‌రాబాద్ : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బీఆర్ఎస్ బాస్, తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి, త‌న తండ్రి కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి స‌ర్కార్ ఏర్పాటు చేసిన సిట్ విచార‌ణ‌కు హాజ‌రు కావాలంటూ నోటీసులు