hyderabadupdates.com movies ఏపీ పాలిటిక్స్‌లో అక్క‌డ అంద‌రూ హీరోలే ..!

ఏపీ పాలిటిక్స్‌లో అక్క‌డ అంద‌రూ హీరోలే ..!

కొన్ని కొన్ని జిల్లాల్లో రాజ‌కీయాలు భిన్నంగా ఉంటున్నాయి. ఎమ్మెల్యేలు-అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేసుకుంటున్న జిల్లాలు కొన్ని ఉండ‌గా.. మ‌రికొన్ని మాత్రం అధికారులే హీరోలుగా చ‌లామ‌ణి అవుతు న్నారు. వారి మాటే వినాల‌న్న ప‌ట్టు కూడా ప‌డుతున్నారు. దీంతో పాల‌న ప‌రంగా ఇబ్బందులు వ‌స్తున్నా యి. అయినా.. అధికారులు మాట విన‌డం లేద‌న్న‌ది వాస్త‌వం. ఇటీవ‌ల ఈ విష‌యంపై చంద్ర‌బాబుకు ఫిర్యాదులు కూడా అందాయి. దీంతో త్వ‌ర‌లోనే అధికారుల‌ను దారిలో పెట్టే అవ‌కాశం ఉంద‌ని స‌మాచా రం.

ఇదిలావుంటే.. అనంత‌పురం జిల్లాలో అధికారుల‌కు-నాయ‌కుల‌కు మ‌ధ్య మ‌రింత గ్యాప్ ఎక్కువ‌గా క‌నిపి స్తోంది. ఇక్క‌డి నియోజ‌క‌వ‌ర్గాల్లో  ఎమ్మెల్యేలు.. ఎవ‌రికి వారే హీరోలు అనే టాక్ ప్ర‌బ‌ల‌డం గ‌మ‌నార్హం. అయితే.. అంద‌రూ కాదుకానీ.. ముఖ్యంగా నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల్లోఅయితే ఈ మాటే వినిపిస్తోంది. దీంతో ఈ నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌నులు ఎలా ఉన్నా.. అధిప‌త్య పోరు మాత్రం ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. సొంత పార్టీలో నే నాయ‌కులు విజృంభిస్తున్న ప‌రిస్థితి కూడా క‌నిపిస్తోంది. దీనిని అదుపు చేయాల‌న్న వాద‌న ఉంది.

ఇక‌, క‌డ‌ప జిల్లాలో కొన్ని నియోజ‌వ‌ర్గాల వ‌ర‌కు బాగానే ఉన్నా.. మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో కూట‌మి నాయ కుల మ‌ధ్య తేడాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ఈ ప‌రిస్థితుల‌ను కూడా చ‌క్క‌దిద్దాల‌న్న ప‌రిస్థితి ఉంది. అయితే.. ఎప్ప‌టిక‌ప్పుడు ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో రాజ‌కీయాల‌పై దృష్టి పెడుతున్నా.. నాయ‌కుల మ‌ధ్య సామ‌ర‌స్యం అయితే క‌నిపించ‌డం లేదు. ఇటీవ‌ల జిల్లాల‌పై చ‌ర్చించిన పార్టీ అధినేత‌.. త్వ‌ర‌లోనే వాటి ప‌రిస్థితుల‌పై నివేదిక తెప్పించుకునేందుకు  పార్టీ ప‌రంగా.. చ‌ర్య‌లు తీసుకునేందుకు అడుగులు ప‌డుతున్నాయి.

ఎందుకిలా.. ?కొన్ని కొన్ని జిల్లాల్లో.. బ‌ల‌మైన నాయ‌కులు గ‌త ఎన్నిక‌ల్లో పోటీ నుంచి త‌ప్పుకొన్నారు. ఈ క్ర‌మంలోనే కొం ద‌రు కొత్త‌వారికి అవ‌కాశం ఇచ్చారు. మ‌రికొన్ని చోట్ల వార‌సులు రంగంలోకి దిగారు. దీంతో ఆయా నియోజ‌క వ‌ర్గాల్లో ఆధిప‌త్య పోరు సాగుతోంది. టికెట్ త్యాగం చేసిన వారు.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి తిరిగి పోటీ చేయా ల‌న్న ల‌క్ష్యంతో ఉన్నారు. అయితే.. గ‌త ఎన్నిక‌ల్లో టికెట్ ద‌క్కించుకున్న‌వారు.. దీనిపై ఎక్కువ‌గా దృష్టి పెట్ట‌డంతోనే స‌మ‌స్య తెర‌మీదికి వ‌చ్చింద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఈ జిల్లాల్లో ప‌రిస్థితిని లైన్‌లో పెట్టేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. మ‌రి ఏమేర‌కు జిల్లాల్లో ప‌రిస్థితి మారుతుందో చూడాలి.

Related Post

Nari Nari Naduma Murari Review: A light-hearted family entertainer with decent funNari Nari Naduma Murari Review: A light-hearted family entertainer with decent fun

Among the films released in theatres this Sankranti season, Nari Nari Naduma Murari, starring Charming Star Sharwanand, is one of the notable releases and hit screens on January 14, 2026.