hyderabadupdates.com Gallery ఏపీ బ‌డ్జెట్ లో బీసీల అభ్యున్న‌తికి ప్ర‌యారిటీ

ఏపీ బ‌డ్జెట్ లో బీసీల అభ్యున్న‌తికి ప్ర‌యారిటీ

ఏపీ బ‌డ్జెట్ లో బీసీల అభ్యున్న‌తికి ప్ర‌యారిటీ post thumbnail image

అమరావతి : బీసీల అభ్యున్నతి పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ది మరోసారి రుజువైందని, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో వెనుకబడిన వర్గాల సంక్షేమానికి చరిత్రలో కనీవినీ ఎరుగని కేటాయింపులు చేశారని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత , జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత ఆనందం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత‌ ప్రవేశ పెట్టిన మూడు బడ్జెట్లోనూ నిధుల కేటాయింపులు పెంచుకుంటూ వెళుతున్నామన్నారు. నూతన బడ్జెట్ లో ఆదరణ 3.0 పథకానికి మరో రూ.1000 కోట్లు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు. 2026-27 బడ్జెట్ లో రూ.51,021 కోట్లు బీసీ సంక్షేమానికి కేటాయించినందుకు సీఎం చంద్రబాబుకు, మంత్రి పయ్యావులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ మేరకు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆమె మాట్లాడారు. 2026-27 బడ్జెట్ అన్ని వర్గాల వారికి అనుకూలమైనదన్నారు. ముఖ్యంగా బీసీల ఉన్నతికి బడ్జెట్ లో ప్రాధాన్యత ఇచ్చారన్నారు. 2024-25 బడ్జెట్ లో రూ.39,007 కోట్లు, 2025-26 బడ్జెట్ 47,456 కోట్లు, 2026-27 బడ్జెట్లో 51,021 కోట్లు కేటాయించారన్నారు.
అందులో ఈడబ్ల్యూఎస్ సంక్షేమానికి రూ.10,669 కోట్లు వెచ్చిస్తున్నామన్నారు స‌విత‌. 2025-26లో రూ.10,614 కోట్లు, 2024-25లో రూ.10,273.80కోట్లు కేటాయించిన‌ట్లు తెలిపారు. నూతన బడ్జెట్‌లోనూ ఆదరణ 3.0 పథకానికి మరో రూ.1000 కోట్లు, చేనేతలకు, సెల్లూన్లకు ఉచిత విద్యుత్ కోసం రూ.150 కోట్లు, రూ.50 కోట్లు వెచ్చిస్తున్నామన్నారు. ఇలా ఏటా బీసీ సంక్షేమానికి నిధులు కూటమి ప్రభుత్వం కేటాయింపులు పెంచుతూ వస్తోందన్నారు. చరిత్రలో ఎరుగని విధంగా, సింహ భాగం నిధులు బీసీల సంక్షేమానికి కేటాయించిన‌ట్లు చెప్పారు మంత్రి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ ఇటువంటి కేటాయింపులు చేయలేదన్నారు. రాయలసీమ ను గ్లోబల్ హార్టీ కల్చర్ గా అభివృద్ధి చేయడానికి కూటమి ప్రభుత్వం రూ.30 వేల కోట్లు కేటాయిస్తోందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరేలా బడ్జెట్ ను రూపకల్పన చేశామన్నారు. వ్యవసాయానికి, పారిశ్రామిక రంగానికి కూడా ప్రాధాన్యమిస్తూ బడ్జెట్ లో నిధులు కేటాయించామన్నారు,
The post ఏపీ బ‌డ్జెట్ లో బీసీల అభ్యున్న‌తికి ప్ర‌యారిటీ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

తీర ప్రాంత అభివృద్ధి, మత్స్య రంగంపై ప్రత్యేక దృష్టితీర ప్రాంత అభివృద్ధి, మత్స్య రంగంపై ప్రత్యేక దృష్టి

అమ‌రావ‌తి/ విజ‌య‌వాడ : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సింగపూర్ దేశ ప్రతినిధులతో విజ‌య‌వాడ క్యాంప్ కార్యాల‌యం నుండి కీలక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయ రంగంలో గ్లోబల్ కనెక్టివిటీ, ఆహార భద్రత, సరఫరా వ్యవస్థలు,

Ex MLC Kavitha: సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయండి – కవిత డిమాండ్Ex MLC Kavitha: సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయండి – కవిత డిమాండ్

Ex MLC Kavitha : తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల జీవో, ఎన్నికల నోటిఫికేషన్‌ అమలును నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన స్టేపై సుప్రీంకోర్టును రేవంత్ సర్కార్ ఆశ్రయించాలని తెలంగాణ (Telangana) జాగృతి అధ్యక్షురాలు కవిత (Ex

హోలీ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలిహోలీ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్ వీసీ స‌జ్జ‌నార్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. నగరంలో హోలీ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయ‌న హెచ్చరించారు. బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీ నుంచి ఆయన