hyderabadupdates.com Gallery ఏపీ బ‌డ్జెట్ లో వ్య‌వ‌సాయ రంగానికి రూ. 53,752.12 కోట్లు

ఏపీ బ‌డ్జెట్ లో వ్య‌వ‌సాయ రంగానికి రూ. 53,752.12 కోట్లు

ఏపీ బ‌డ్జెట్ లో వ్య‌వ‌సాయ రంగానికి రూ. 53,752.12 కోట్లు post thumbnail image

అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర స‌ర్కార్ ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్ లో వ్య‌వసాయ రంగానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇవ్వ‌డం జ‌రిగింద‌న్నారు వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున వ్యవసాయ‌, అనుబంధ శాఖల బడ్జెట్ 2026-27 సంవత్సరానికి గాను మొత్తం రూ.53,752.12 కోట్లు ప్రతిపాదించాన‌ని చెప్పారు. రైతును రాజుగా చేయడానికి ముఖ్యమంత్రి చంద్ర‌బాబు రైతన్నా మీకోసం కార్యక్రమాన్ని ప్రారంభించారని చెప్పారు. ఇందులో పంచ సూత్రాలు అయిన నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వం నుంచి మద్దతు అనే అంశాలకి అధిక ప్రాధాన్యత కల్పించామ‌న్నారు. ఇందులో భాగంగా రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోంద‌ని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం “స్వర్ణాంధ్ర 2047” సాధన కోసం రూపొందించిన పది సూత్రాలలో వ్యవసాయ రంగానికి సంబంధించి “ఫార్మర్స్ అగ్రిటెక” ముఖ్యమైన సూత్రంగా ఉంద‌న్నారు అచ్చెన్నాయుడు. డీప్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డ్రోన్లు, రోబోటిక్స్, ఉపగ్రహ ఆధారిత వ్యవస్థల వంటి ఆధునిక సాంకేతికతల ద్వారా, వ్యవసాయాన్ని లాభదాయకంగా, అధిక ఆదాయ రంగంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేస్తున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర GSDP 17,62,357 కోట్ల రూపాయలు కాగా వ్యవసాయ రంగం వాటాగా 33.20 శాతం తో 5,39,454 కోట్ల రూపాయలు అందించిన‌ట్లు చెప్పారు. దేశ‌ వ్యవసాయం వృద్ధి రేటు 0.80 శాతం కాగా, మనరాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వలన, రాష్ట్ర వ్యవసాయరంగ వృద్ధి రేటు 7.83 శాతంగా నమోదయిందని వెల్ల‌డించారు. దేశ వ్యవసాయరంగ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాటా 10 శాతం అని గర్వంగా తెలియజేస్తున్నానని శాస‌న స‌భ సాక్షిగా ప్ర‌క‌టించారు.
The post ఏపీ బ‌డ్జెట్ లో వ్య‌వ‌సాయ రంగానికి రూ. 53,752.12 కోట్లు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

హార్వ‌ర్డ్ స్కూల్ నుంచి సీఎంకు స‌ర్టిఫికెట్హార్వ‌ర్డ్ స్కూల్ నుంచి సీఎంకు స‌ర్టిఫికెట్

అమెరికా : తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి అనుముల రేవంత్ రెడ్డి అమెరికా లోని ప్ర‌తిష్టాత్మ‌క‌మైన హార్వ‌ర్డ్ కెన్న‌డీ స్కూల్ లో గ‌త కొన్ని రోజులుగా జ‌రుగుతున్న కోర్సులో జాయిన్ అయ్యారు. అంత‌కు ముందు స్విట్జ‌ర్లాండ్ లోని దావోస్ లో జ‌రిగిన ప్ర‌త్యేక

అమెరికా కార్మిక శాఖ సీఐఓగా మంగ‌ళ కుప్పాఅమెరికా కార్మిక శాఖ సీఐఓగా మంగ‌ళ కుప్పా

అమెరికా : భార‌త సంత‌తికి చెందిన మ‌హిళ మంగ‌ళ కుప్పాకు అరుదైన , కీల‌క‌మైన ప‌ద‌వి ద‌క్కింది. ఈ మేర‌కు అమెరికా ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. అత్యున్న‌మైన కార్మిక శాఖ‌కు సీఐఓగా బాధ్య‌త‌లు అప్ప‌గించింది. మంగళ కుప్పా ఏజెన్సీ అంతటా

ప్ర‌జాస్వామిక మార్గంలోనే స‌మాజంలో మార్పు సాధ్యంప్ర‌జాస్వామిక మార్గంలోనే స‌మాజంలో మార్పు సాధ్యం

హైద‌రాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆయుధాలు, హింస ద్వారా ప్రజా సమస్యలకు పరిష్కారం దొరకదని అన్నారు. ప్రజాస్వామిక మార్గంలోనే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని పునరుద్ఘాటించారు. అజ్ఞాత మావోయిస్టులు ఆయుధాలను విడిచిపెట్టి జనజీవన స్రవంతిలోకి వచ్చి,