hyderabadupdates.com movies ఏపీలో ఇకపై టికెట్ రేట్లు అలా పెంచరు

ఏపీలో ఇకపై టికెట్ రేట్లు అలా పెంచరు

టాలీవుడ్ లో భారీ బడ్జెట్ సినిమాలు విడుదలకు ముందు టికెట్ రేట్లు పెంచడం ఆనవాయితీగా వస్తోంది. ఆయా చిత్రాల నిర్మాతలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేయడం, వారం లేదా పది రోజులపాటు స్పెషల్ షోలు, టికెట్ రేట్ల పెంపునకు ప్రభుత్వాలు ఆమోద ముద్ర వేయడం పరిపాటి. అయితే, ఈ రకంగా సినిమా టికెట్ల రేట్లు పెంచడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తూ న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు.

ఇటీవల అఖండ-2 చిత్రానికి తెలంగాణ ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచినా సరే కొందరు కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే అటువంటివి జరగకుండా ఏపీలో సినిమా టికెట్ రేట్ల పెంపు కోసం సరికొత్త విధానాన్ని రూపొందించబోతున్నామని ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.

ప్రతిసారి సినిమా బడ్జెట్ ప్రకారం టికెట్ రేట్లు పెంచుతున్నామని ఆయన అన్నారు. కానీ, ఇకనుంచి ఇందుకోసం ఒక నిర్దిష్టమైన విధానాన్ని రూపొందించబోతున్నామని చెప్పారు. సినిమా టికెట్ల రేట్లపై నూతన విధానం కోసం ఏర్పాటైన కమిటీతో ఆయన సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా పలు అంశాలపై సంబంధిత అధికారులతో దుర్గేష్ చర్చించారు. ఆల్రెడీ అమల్లో ఉన్న జీవోతోపాటు సినిమా బడ్జెట్ ప్రకారం సినిమా టికెట్ రేట్లు పెంచుకుంటూ వస్తున్నామని, భవిష్యత్తులో ఒక నూతన విధానాన్ని రూపొందించాలని నిర్ణయించామని చెప్పారు.

కేటగిరీల ప్రకారం సమానంగా టికెట్ రేట్లు పెంచే విధానాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. అయితే, లో బడ్జెట్, హై బడ్జెట్ చిత్రాల టికెట్ రేట్లు ఎంత పెంచాలి అనే విషయంపై కమిటీ చర్చించి సరైన తీసుకుంటుందని తెలిపారు. అంతేకాదు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల అభిప్రాయాలను, సలహాలను కూడా పరిగణలోకి తీసుకొని తుది నిర్ణయం వెల్లడిస్తామని చెప్పారు. ఇటు, నిర్మాతలకు, అటు ప్రేక్షకులకు భారం కాకుండా సినీ పరిశ్రమకు, ప్రజలకు మేలు కలిగేలా నూతన విధానాన్ని రూపొందిస్తామన్నారు.

ఐ బొమ్మ రవి అరెస్ట్ నేపథ్యంలో సినిమా టికెట్ల పెంపు వ్యవహారంపై తీవ్ర స్థాయిలో ఇటు మీడియాలో, అటు సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో చర్చ జరిగిన సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ చిత్రాలకు ప్రభుత్వాలు టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతినిచ్చినా కొందరు సామాజిక కార్యకర్తలు, న్యాయవాదులు కోర్టులను ఆశ్రయించడంతో చివరి నిమిషంలో చిత్ర బృందానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలోనే పాత విధానాలకు స్వస్తి పలికి సరికొత్త విధానాన్ని రూపొందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.

Related Post

అంచ‌నాల‌కు చేరుతున్న ఆదాయం… సీఎం హ్యాపీ!అంచ‌నాల‌కు చేరుతున్న ఆదాయం… సీఎం హ్యాపీ!

రాష్ట్ర ప్ర‌భుత్వానికి నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఆర్థిక ఇబ్బందులు ఎదురైన విష‌యం తెలిసిందే. ముఖ్యంగా వైసీపీ హ‌యాంలో రాష్ట్ర ఆర్థిక వ్య‌వ‌స్థ చిన్నాభిన్నం అయింద‌ని సీఎం చంద్ర‌బాబు స‌హా డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌లు ఆరోపించారు. ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ధ్వంసం చేశార‌ని..

లోక్‌స‌భ‌లో రచ్చ‌ జరిగినా ఆగని బిల్లులోక్‌స‌భ‌లో రచ్చ‌ జరిగినా ఆగని బిల్లు

పార్ల‌మెంటు శీతాకాల స‌మావేశాలు శుక్ర‌వారం(రేపు)తో ముగియ‌నున్నాయి. ఈ స‌మావేశాల్లో చివ‌రి రెండో రోజైన గురువారం రాజ‌కీయ వేడి లోక్‌స‌భ‌ను కుదిపేసింది. కేంద్ర ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన `విక‌సిత్ భార‌త్ గ్యారెంటీ ఫ‌ర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిష‌న్ -గ్రామీణ్‌(వీబీ జీ-రామ్‌జీ) బిల్లును గురువారం