వత్సవాయి/జగ్గయ్యపేట : విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి వస్తున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో కొత్తగా మరిన్ని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత వెల్లడించారు. ఎంజేపీ స్కూళ్లలో క్రీడల ప్రోత్సాహానికి స్పోర్ట్స్ కిట్లు అందజేయనున్నట్లు ప్రకటించారు. వత్సవాయి మండల కేంద్రంలో ఉన్న ఎంజేపీ బాలుర స్కూల్ ను స్థానిక ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)తో కలిసి మంత్రి సవిత ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో విద్య కోసం కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్య ఇస్తోందన్నారు. ముఖ్యంగా బీసీ బిడ్డల విద్యకు రూ.వందల కోట్లు వెచ్చిస్తోందన్నారు. బీసీ బిడ్డలకు నాణ్యమైన భోజనం అందించాలన్న ఉద్దేశంతో మంత్రి నారా లోకేశ్ సన్న బియ్యం అందజేస్తున్నారన్నారు.
తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ఎందరు బిడ్డలు ఉంటే అందరికీ రూ.15 వేలు చొప్పున అందజేశామన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో విద్యా మిత్ర కిట్లు కూడా ఇస్తున్నామన్నారు ఎస్. సవిత. హాస్టళ్లు, గురుకులాల్లో పరిశుద్ధమైన తాగునీటికి ఆర్వో ప్లాంట్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. బీసీ బిడ్డలకు ఆహార, ఆరోగ్య భద్రతతో కూడిన విద్య అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సవిత స్పష్టంచేశారు.రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో నడిచే గురుకులాల్లో ఎంజేపీ గురుకులాల అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నాయని మంత్రి సవిత తెలిపారు. అందుకే, రాష్ట్ర వ్యాప్తంగా ఎంజేపీ స్కూళ్లకు విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి విపరీతమైన ఆదరణ లభిస్తోందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని, రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా మరిన్ని ఎంజేపీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
The post ఏపీలో త్వరలో మరిన్ని ఎంజేపీ స్కూళ్లు : సవిత appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
ఏపీలో త్వరలో మరిన్ని ఎంజేపీ స్కూళ్లు : సవిత
Categories: