hyderabadupdates.com movies ఏపీలో రాహుల్ గాంధీ నిరసన… ఎందుకు?

ఏపీలో రాహుల్ గాంధీ నిరసన… ఎందుకు?

ఏపీకి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రానున్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్చిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో భారీ నిరసనకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 2న కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాష్ట్రానికి రానున్నారు. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలోని బండ్లపల్లి గ్రామంలో ఈ నిరసన సభ నిర్వహించనున్నారు.

బండ్లపల్లిని వేదికగా ఎంచుకోవడం వెనుక ప్రత్యేక రాజకీయ ప్రాధాన్యత ఉంది. 2006 ఫిబ్రవరి 2న ఇదే గ్రామంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ చేతుల మీదుగా ఉపాధి హామీ పథకం ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభమైంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రారంభమైన ఈ పథకం కోట్లాది గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించిందని కాంగ్రెస్ గుర్తు చేస్తోంది.

పథకం పేరును ‘వికసిత్ భారత్ రోజ్‌గార్ – అజీవికా హామీ మిషన్’గా మార్చడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇది కేవలం పేరు మార్పు కాదని, మహాత్మాగాంధీ ఆలోచనలను తొలగించే ప్రయత్నమని పార్టీ ఆరోపిస్తోంది. పథకం ప్రారంభించి 20 ఏళ్లు పూర్తవుతున్న రోజునే అదే గ్రామంలో నిరసన చేపట్టడం ద్వారా కేంద్రానికి గట్టి సందేశం ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ సభ ద్వారా భవిష్యత్తు పోరాట కార్యాచరణను ప్రకటించనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు.

Related Post

మెక్సికన్ డాన్ ను గర్ల్ఫ్రెండ్ పట్టించిందా..మెక్సికన్ డాన్ ను గర్ల్ఫ్రెండ్ పట్టించిందా..

మెక్సికోలో అత్యంత ప్రమాదకరమైన డ్రగ్ మాఫియా డాన్ నెమెసియో రూబెన్ ఒసెగ్వెరా సెర్వంటెస్ అలియాస్ ‘ఎల్ మెంచో’ కథ ముగిసింది. హాలీవుడ్ యాక్షన్ సినిమాను తలపించేలా సాగిన ఒక భారీ సైనిక ఆపరేషన్‌లో ఇతను తీవ్రంగా గాయపడి మరణించినట్లు మెక్సికో రక్షణ

జాన్వీ ఘట్టమనేని – అమ్మ లక్ష్యం కోసం వారసురాలుజాన్వీ ఘట్టమనేని – అమ్మ లక్ష్యం కోసం వారసురాలు

స్టార్ హీరోల కొడుకులు వచ్చినంత వేగంగా కూతుళ్లు మేకప్ వేసుకుని తెరమీదకు రారనేది నగ్న సత్యం. శృతి హాసన్ లాంటి ఒకరిద్దరు దీనికి మినహాయింపులా నిలుస్తారు కానీ, బాలీవుడ్ ఖాన్లు కపూర్ల కుటుంబాల నుంచి హీరోయిన్లు వచ్చినంత ఫాస్ట్ గా మన

మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ హవామున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ హవా

పంచాయతీ ఎన్నికల్లో మాదిరిగానే తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లోనూ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాల్లో గెలుపొందింది. చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు లీడింగ్ లో ఉన్నారు. 7 కార్పొరేషన్లకు ఎన్నికలు