hyderabadupdates.com Gallery ఏపీలో వ‌డ‌గాల్పులు..భారీ వ‌ర్షాలు : ఎండీ

ఏపీలో వ‌డ‌గాల్పులు..భారీ వ‌ర్షాలు : ఎండీ

ఏపీలో వ‌డ‌గాల్పులు..భారీ వ‌ర్షాలు : ఎండీ post thumbnail image

అమ‌రావ‌తి : రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని రెండు రోజుల పాటు ఇదే విధంగా ఉండే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత, మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన అకాల వర్షాల కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు . నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 44.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డైనట్లు ప్రఖర్ జైన్ తెలిపారు. మొత్తం 28 జిల్లాలకు గాను 16 జిల్లాల పరిధిలోని 88 మండలాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉండి 41 డిగ్రీలకు పైగా నమోదైనట్లు వెల్లడించారు.
గురువారం అధిక ఉష్ణోగ్రతలతో పాటు విజయనగరం జిల్లాలోని బొబ్బిలి, బొండపల్లి, రామభద్రాపురం మండలాలు, పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి, మక్కువ, పాచిపెంట, పార్వతీపురం, సాలూరు, సీతానగరం మండలాలు, అల్లూరి జిల్లా అనంతగిరి మండలాల్లో(10) తీవ్ర వడగాల్పులు, మరో 20 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు.
ఇవాళ నెల్లూరు(జి) కొమ్మిపాడులో 44.1°C, అనకాపల్లి(జి) దేవరపల్లిలో 43.4°C, పల్నాడు(జి) బెల్లంకొండలో 43.3°C, మార్కాపురం(జి) నందనమారెళ్ళలో 43.2°C, చిత్తూరు(జి) గంగవరం 42.8°C, కర్నూలు(జి) నగరడోనలో 42.7°C, తిరుపతి(జి) దొరవారిసత్రంలో 42.5°C, ఎన్టీఆర్(జి) తొర్రగుడిపాడు 42.4°C, మన్యం(జి) మక్కువ, పోలవరం(జి) విఆర్ పురంలో 42.2°C, నంద్యాల(జి) చాగలమర్రి, ప్రకాశం(జి) కొప్పెరపాడు, వైఎస్సార్ కడప(జి) లింగాలలో 42.1°C, అనంతపురం(జి) రాయదుర్గంలో 42 చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొన్నారు.
మరోవైపు ద్రోణి ప్రభావంతో విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉత్తరాంధ్ర జిల్లాలు, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు పొలాల్లో పని చేసే రైతులు, పశు కాపరులు చెట్ల కింద నిలబడరాదని హెచ్చరించారు.
The post ఏపీలో వ‌డ‌గాల్పులు..భారీ వ‌ర్షాలు : ఎండీ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

రియ‌ల్ ఎస్టేట్ దందా చేస్తున్న సీఎం : కేటీఆర్రియ‌ల్ ఎస్టేట్ దందా చేస్తున్న సీఎం : కేటీఆర్

హైద‌రాబాద్ : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఆయ‌న సీఎం రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. రాష్ట్రంలో రియ‌ల్ ఎస్టేట్ దందా కొన‌సాగుతోంద‌ని, ప్ర‌జా పాల‌న‌కు మంగ‌ళం పాడారంటూ మండిప‌డ్డారు. సింగ‌రేణి స్కాంలో సీఎం కీల‌క పాత్ర ఉంద‌ని,

Pawan Kalyan: ప్రజలకు న్యాయం చేయలేకపోతే రాజకీయాలు వదిలేస్తా – పవన్ కళ్యాణ్Pawan Kalyan: ప్రజలకు న్యాయం చేయలేకపోతే రాజకీయాలు వదిలేస్తా – పవన్ కళ్యాణ్

    నేను ఉప ముఖ్యమంత్రిగానో… ఎమ్మెల్యేగానో… ఉప్పాడకు రాలేదు. ఓ మత్స్యకారుడి బాధను అర్థం చేసుకోవడానికి వారి ఇంట్లోని సభ్యుడిగా… వారిలో ఒకడిగా వచ్చాను. నాకు మత్స్యకారులు పడుతున్న వేదన, వేట కోసం పడుతున్న యాతన తెలిసి… ఇక్కడికి వచ్చానని