hyderabadupdates.com Gallery ఏప్రిల్ 30న రానున్న బుచ్చిబాబు ‘పెద్ది’

ఏప్రిల్ 30న రానున్న బుచ్చిబాబు ‘పెద్ది’

ఏప్రిల్ 30న రానున్న బుచ్చిబాబు ‘పెద్ది’ post thumbnail image

హైద‌రాబాద్ : ఉప్పెన మూవీతో సంచ‌ల‌నం సృష్టించాడు ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు స‌న‌. త‌న కెరీర్ లో మ‌రో కీల‌క‌మైన చిత్రానికి శ్రీ‌కారం చుట్టాడు. ఇప్ప‌టికే షూటింగ్ దాదాపు పూర్తి కావ‌చ్చింది . ఆ సినిమానే పెద్ది. ఇప్ప‌టికే అంచ‌నాలు మ‌రింత పెంచేలా చేశాడు. గ్లింప్స్, పాట‌లు దుమ్ము రేపుతున్నాయి. టాప్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఏఆర్ రెహ‌మాన్ మ‌రోసారి త‌న స‌త్తా ఏమిటో చూపించాడు. సోష‌ల్ మీడియాను ఊపేస్తున్నాయి ఈ సాంగ్స్. ఇక స‌న్నివేశాల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఆర్ఆర్ఆర్ త‌ర్వాత అంత‌కు మించి అద్భుత‌మైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకునే ప్రయ‌త్నం చేశాడు మెగాస్టార్ త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్. త‌న‌తో ముంబై అందాల సుంద‌రి జాహ్న‌వి క‌పూర్ కీ రోల్ పోషిస్తోంది.
పెద్ది మూవీలో మ‌రో ముఖ్య‌మైన పాత్ పోషించాడు క‌న్న‌డ సినీ ప‌రిశ్ర‌మ‌లో టాప్ హీరో శివ రాజ్ కుమార్. సినిమాపై మ‌రింత హోప్ పెంచేలా చేసింది. పెద్ది మూవీని ఆట నేప‌థ్యంలో తీర్చిదిద్దాడు. చాలా మంది ఫ్యాన్స్ ఈ సినిమా పూర్తిగా క్రికెట్ నేప‌థ్యంలో తీస్తున్నార‌ని అనుకుంటున్నారు. కానీ క్రికెట్ తో పాటు చాలా ఆట‌ల‌ను ఇందులో చిత్రీక‌రించిన‌ట్లు టాక్. ఇందులో ప్ర‌ధానంగా కుస్తీ కూడా ఉంది. రామ్ చ‌ర‌ణ్ బ‌ర్త్ డే గ్లింప్స్ లో ‘కుస్తీ’ పై ఫోక‌స్ చేశారు ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు స‌న‌. ఇందులో రామ్ చ‌ర‌ణ్ స్క్రీన్ ప్రెజెన్స్‌, లుక్‌.. మ‌రోసారి ఫ్యాన్స్‌ని మెస్మ‌రైజ్ చేశాయి. ఇప్ప‌టి వ‌ర‌కూ చూడ‌ని చ‌ర‌ణ్ ని బుచ్చిబాబు ప్ర‌జెంట్ చేయ‌బోతున్నాడ‌న్న ధీమా మ‌రోసారి క‌లిగింది. ఏప్రిల్ 30న ‘పెద్ది’ రిలీజ్ ఖాయ‌మంటూ మ‌రోసారి నిర్మాత‌లు ధైర్యంగా రిలీజ్ డేట్ ప్ర‌క‌టించారు.
The post ఏప్రిల్ 30న రానున్న బుచ్చిబాబు ‘పెద్ది’ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

శివరాత్రి బ్రహ్మోత్సవాల‌కు సీఎంకు ఆహ్వానంశివరాత్రి బ్రహ్మోత్సవాల‌కు సీఎంకు ఆహ్వానం

అమరావతి : ల‌క్ష‌లాది మంది భ‌క్తుల‌కు కొంగు బంగారంగా విల‌సిల్లుతోంది నంద్యాల జిల్లాలో కొలువు తీరిన శ్రీ‌శైలం పుణ్య‌క్షేత్రం. ఫిబ్ర‌వ‌రి 15వ తేదీన మ‌హా శివ‌రాత్రి ప‌ర్వ‌దినం ఘ‌నంగా జ‌ర‌గ‌నుంది. ఆంధ్రప్ర‌దేశ్, తెలంగాణ‌, మ‌హారాష్ట్ర‌, క‌ర్ణాట‌క‌, తమిళ‌నాడు, త‌దిత‌ర రాష్ట్రాల నుంచి

KTR: బీఆర్ఎస్, కాంగ్రెస్‌ మధ్యే పోటీ – కేటీఆర్KTR: బీఆర్ఎస్, కాంగ్రెస్‌ మధ్యే పోటీ – కేటీఆర్

    జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక రెండే పార్టీల మధ్య జరుగుతోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. ఆరు గ్యారంటీలను ఎగ్గొట్టి, పేదవాడి గూడు కూలగొట్టి, వాళ్ల నడుం విరగ్గొట్టి ఉపాధి లేకుండా చేస్తున్న కాంగ్రెస్‌కు… పేదవాడి కోసం ప్రభుత్వాన్ని గల్లా

Congress: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ ఘన విజయంCongress: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ ఘన విజయం

    జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయంసాధించింది. ఆ పార్టీ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ జయకేతనం ఎగురవేశారు. తన సమీప ప్రత్యర్థి, BRS అభ్యర్థి మాగంటి సునీతపై 24,729 ఓట్లకుపైగా మెజార్టీతో ఆయన గెలుపొందారు. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ