hyderabadupdates.com movies ఐఫోన్ పాకెట్… ధర ఎన్ని వేలో తెలుసా?

ఐఫోన్ పాకెట్… ధర ఎన్ని వేలో తెలుసా?

మీ ఖరీదైన ఐఫోన్ కోసం యాపిల్ ఒక కొత్త ‘జేబు’ను రిలీజ్ చేసింది. దీని పేరు ‘ఐఫోన్ పాకెట్’. ఇది మామూలు జేబు కాదు, జపాన్‌కు చెందిన ఫేమస్ ఫ్యాషన్ డిజైనర్ ‘ఇస్సే మియాకే’తో కలిసి తయారు చేయించింది. ‘ఒక గుడ్డ ముక్క’ స్ఫూర్తితో 3D నిట్టింగ్‌తో (అల్లిక) దీన్ని తయారు చేశారట. చూడటానికి చాలా సింపుల్‌గా, స్టైలిష్‌గా ఉన్నా, దీని ధర మాత్రం అస్సలు సింపుల్‌గా లేదు.

ఈ లగ్జరీ పర్సు ధర అక్షరాలా 20,379 రూపాయలు ($229.95). ఇందులో ఐఫోన్‌తో పాటు మరికొన్ని చిన్న చిన్న వస్తువులు కూడా పెట్టుకోవచ్చట. యాపిల్ దీన్ని ‘చాలా తెలివైన అదనపు పాకెట్’ అని గర్వంగా చెబుతోంది. ఇందులో కాస్త చిన్న వెర్షన్ కూడా ఉంది, దాని ధర $149.95 (సుమారు 12,500). దీన్ని చేతికి తగిలించుకోవచ్చు, లేదా మీ కాస్ట్లీ బ్యాగ్‌కు కట్టుకోవచ్చు.

ఈ ప్రొడక్ట్, దాని ధర చూడగానే ఇంటర్నెట్‌లో జనాలు షాక్ అయ్యారు. ప్రముఖ టెక్ యూట్యూబర్ MKBHD, “ఇది యాపిల్ ఫ్యాన్స్‌కి అసలైన పరీక్ష. 230 డాలర్లు పెట్టి దీన్ని కూడా కొని, సపోర్ట్ చేస్తారేమో చూడాలి” అని ట్వీట్ చేశాడు. “ఇది నిజమేనా లేక ఏదైనా పేరడీనా?” అని చాలా మంది కామెంట్ చేశారు.

“ప్రపంచమంతా AI మీద రీసెర్చ్ చేస్తుంటే, యాపిల్ మాత్రం ఇలాంటి వాటితో ఆడుకుంటోంది” అని మరో యూజర్ సెటైర్ వేశారు. అయితే, ఈ విమర్శల మధ్య ఓ యూజర్, “ఇది ఆఫీసులకు వెళ్లే రిచ్ లేడీస్‌కి బాగా నచ్చుతుంది, వాళ్ల కోసం ఇది పెద్ద హిట్ అవుతుంది, మీకేం అర్థం కాదు” అని మరింత డిఫరెంట్ గా కామెంట్ చేశాడు.

నిజానికి యాపిల్‌కు ఇలాంటివి కొత్త కాదు. 2004లో స్టీవ్ జాబ్స్ ‘ఐపాడ్ సాక్స్’ను 29 డాలర్లకు అమ్మారు. ఇప్పుడు అదే కాన్సెప్ట్‌కు ఫ్యాషన్ టచ్ ఇచ్చి, ధరను మాత్రం దాదాపు పదింతలు పెంచి ‘పాకెట్’ పేరుతో లాంచ్ చేశారు. ఏదేమైనా, టెక్నాలజీతో పాటు మన ఫోన్ల యాక్సెసరీలు కూడా చాలా కాస్ట్లీగా మారుతున్నాయనడంలో సందేహం లేదు.

Related Post

పెద్ది దర్శకుడికి ఏమైంది?పెద్ది దర్శకుడికి ఏమైంది?

‘ఉప్పెన’ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేశాడు బుచ్చిబాబు సనా. తన దర్శకత్వ ప్రతిభ చూసి ఇండస్ట్రీ షాకైపోయింది. రెండో సినిమాకే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో సినిమా చేసే అద్భుత అవకాశాన్ని అందుకున్నాడు. దీన్ని కూడా అతను సద్వినియోగం చేసుకునేలాగే

Archana Iyer: Shambhala Pulls Audiences Into Its World in Just Five MinutesArchana Iyer: Shambhala Pulls Audiences Into Its World in Just Five Minutes

Actor Archana Iyer has expressed strong confidence in the immersive power of Shambhala: A Mystic World, stating that audiences are completely drawn into the film’s universe within the first five