hyderabadupdates.com movies ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్ గా తీసుకుంటే ఇండియాలో ఇంకెక్కడా ఇక్కడ జరిగినంత బిజినెస్ జరగదు. అలాంటిది తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటిదాకా ఒక్క ఐమాక్స్ స్క్రీన్ కూడా లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. హైదరాబాద్ సైతం ఇందుకు నోచుకోకపోయింది. బెంగళూరులో ఐదు ఐమాక్స్ స్క్రీన్లు ఉండడం విశేషం.

ఇంకా దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లోనూ ఐమాక్స్ స్క్రీన్లున్నాయి. హాలీవుడ్ భారీ సినిమాలను ఐమాక్స్ స్క్రీన్లలో చూసేందుకు మన సెలబ్రెటీలు చెన్నైకో, బెంగళూరుకో వెళ్తుంటారు. గతంలో ప్రసాద్స్‌లో ఐమాక్స్ స్క్రీన్ ఉండేది. కానీ మధ్యలో ఆ ఒప్పందం టెర్మినేట్ అయింది. ఐతే మళ్ళీ హైదరాబాద్ కు ఐమాక్స్ స్క్రీన్ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మహేష్ బాబు-రాజమౌళిల ‘వారణాసి’ రిలీజయ్యే సమయానికి హైదరాబాద్‌లో ఐమాక్స్ స్క్రీన్ రావచ్చని అంటున్నారు.

ఐతే ఐమాక్స్ స్క్రీన్ కోసం మన వాళ్లు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండడం బాగానే ఉంది కానీ.. అది వస్తే అందులో ఉండే టికెట్ ధరలను మన వాళ్లు తట్టుకోగలరా అన్నది సందేహం. ‘అవతార్-3’ సినిమాకు బెంగళూరులోని ఒక ఐమాక్స్ స్క్రీన్లో ఏకంగా రూ.1750 రేటు పెట్టడం విశేషం. సినిమా రేంజిని, దానికున్న డిమాండును బట్టి ఐమాక్స్ స్క్రీన్లో టికెట్ ధర ఉంటుంది. ఢిల్లీ, ముంబయి, చెన్నై నగరాల్లోనూ క్రేజున్న సినిమాలకు భారీ రేటు పెడుతుంటారు ఐమాక్స్ స్క్రీన్లో.

ఐతే ఆ నగరాల్లో మాదిరి తెలుగు రాష్ట్రాల్లోని సిటీల్లో ఫ్లెక్సీ ప్రైసింగ్‌కు అవకాశం లేకపోవడం, ఇక్కడ టికెట్ ధర మీద క్యాప్ ఉండడమే ఐమాక్స్ స్క్రీన్ రాకపోవడానికి కారణమనే వాదన కూడా ఉంది. రేప్పొద్దున ఐమాక్స్ స్క్రీన్ వస్తే దానికి ఈ నిబంధన అమలు కాకుండా చూడాల్సి ఉంటుంది. ఒక వేళ క్యాప్ తీసేసినా.. ఇంతింత రేట్లు పెడితే మన వాళ్లు తట్టుకోగలరా అన్నది సందేహం. ఐతే ఇక్కడి ప్రేక్షకులు, డిమాండును బట్టి మరీ అంతంత రేట్లు పెట్టకపోవచ్చని.. ఓ మోస్తరు రేట్లతో ఐమాక్స్ స్క్రీన్ ను నడిపిస్తారని ట్రేడ్ పండిట్లు అంటున్నారు.

Related Post

న‌న్ను 420 అన్నారు.. వాళ్లే 420 అయ్యారు: చంద్ర‌బాబున‌న్ను 420 అన్నారు.. వాళ్లే 420 అయ్యారు: చంద్ర‌బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు వైసీపీ నేత‌ల‌ను ఉద్దేశించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గ‌తంలో త‌న‌ను 420 అంటూ విమ‌ర్శించిన వారే(వైసీపీ నేత‌లు).. ఇప్పుడు 420 అయ్యార‌ని అన్నారు. అన్ని విధాలా.. రాష్ట్రాన్ని ప్ర‌జ‌లను కూడా మోసం చేశార‌ని బాబు విమ‌ర్శించారు. దీంతో