hyderabadupdates.com Gallery ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత జ‌ట్టుకు స‌న్మానం

ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత జ‌ట్టుకు స‌న్మానం

ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత జ‌ట్టుకు స‌న్మానం post thumbnail image

ముంబై : భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి (బీసీసీఐ) సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. శ‌నివారం అధికారికంగా ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత‌గా నిలిచింది సూర్య కుమార్ సార‌థ్యంలోని టీం ఇండియా. ఇందులో భాగంగా ఇప్ప‌టికే ప్రపంచంలో ఏ క్రికెట్ బోర్డు ప్ర‌క‌టించ‌ని న‌గ‌దు బ‌హుమ‌తిని ప్ర‌క‌టించింది బీసీసీఐ. ఈ మేర‌కు విజేత జ‌ట్టుకు రూ. 131 కోట్లు ఇస్తున్న‌ట్లు తెలిపింది. మ‌రో వైపు ఐసీసీ క‌ప్ గెలుచు కోవ‌డంతో భారీ న‌గ‌దు ద‌క్కింది. తాజాగా మ‌రో కీల‌క అప్ డేట్ ఇచ్చింది బీసీసీఐ. త్వ‌ర‌లో బీసీసీఐ ఆద్వ‌ర్యంలో న‌మ‌న్ అవార్డుల కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌నుంది. ఇందులోనే భార‌త జ‌ట్టును స‌త్క‌రించ‌నున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది.
ఈనెల 15న ఆదివారం ముంబై వేదిక‌గా జ‌రిగిన వార్షిక నామ‌న్ అవార్డుల కార్య‌క్ర‌మంలో స‌త్క‌రించాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వెల్ల‌డించింది.ఇటీవల ఐసీసీ టైటిళ్లను గెలుచుకున్న ఐదు భారతీయ జట్లను స‌త్క‌రించ‌నున్న‌ట్లు తెలిపింది. ఇది చారిత్రాత్మకంగా మొదటిసారి అని భారత క్రికెట్ బోర్డు శనివారం ప్రకటించింది. గౌతమ్ గంభీర్ శిక్షణ పొందిన జట్టు మార్చి 8న అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో ఓడించి మూడుసార్లు T20 ప్రపంచ కప్‌ను గెలుచుకున్న మొదటి జట్టుగా నిలిచింది, టైటిల్‌ను విజయవంతంగా నిలబెట్టుకున్న మొదటిది. స్వదేశంలో ఈ ఘనత సాధించిన మొదటి జట్టుగా నిలిచింది.
ఇదిలా ఉండ‌గా ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో ఒంట‌రి పోరాటం చేశాడు కేర‌ళ క్రికెట్ స్టార్ సంజు శాంస‌న్. త‌ను కేవ‌లం 5 ఇన్నింగ్స్ లు మాత్ర‌మే ఆడాడు. మొత్తం 321 ర‌న్స్ 200 స్ట్రైక్ రేట్ తో సాధించాడు. టోర్న‌మెంట్ లో అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న చేయ‌డంతో ప్లేయ‌ర్ ఆఫ్ ది టోర్న‌మెంట్ అవార్డు పొందాడు.
The post ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత జ‌ట్టుకు స‌న్మానం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

విద్యా శాఖకు టీటీడీ రూ.118.89 కోట్లు : ఈవోవిద్యా శాఖకు టీటీడీ రూ.118.89 కోట్లు : ఈవో

తిరుపతి : టిటిడి ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థల సమగ్ర అభివృద్ధికి 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.118.89 కోట్ల నిధులను టిటిడి కేటాయించింది. అత్యాధునిక సాంకేతికత, విద్యార్థుల సామర్థ్యాల పెంపు, నైపుణ్యాభివృద్ధి శిక్షణ తదితర అంశాలకు ప్రాధాన్యం ఇస్తూ విద్యా శాఖలో

CM Revanth Reddy: కేసీఆర్‌ కు భవిష్యత్తు లేదు – సీఎం రేవంత్‌రెడ్డిCM Revanth Reddy: కేసీఆర్‌ కు భవిష్యత్తు లేదు – సీఎం రేవంత్‌రెడ్డి

  బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు గతమే ఉంది… భవిష్యత్తు లేదంటూ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. తన కళ్ల ముందే పార్టీ కూలిపోతోంటే.. కేసీఆర్‌ ఆవేదనలో ఉన్నారు. అందుకే బయటకు రావడం లేదన్నారు. ప్రతిపక్ష నేత రెండేళ్లుగా శాసనసభకే

ఆంధ్రప్రదేశ్‌ను ప‌ర్యాట‌క‌ గమ్య స్థానంగా తీర్చిదిద్దుతాంఆంధ్రప్రదేశ్‌ను ప‌ర్యాట‌క‌ గమ్య స్థానంగా తీర్చిదిద్దుతాం

అమరావతి : ఏపీని ప‌ర్యాట‌క హ‌బ్ గా మార్చేస్తామ‌న్నారు రాష్ట్ర ప‌ర్యాట‌క , సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్ర‌బాబు దిశా నిర్దేశంలో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో ప్రవేశ పెట్టిన