hyderabadupdates.com Gallery ఒంటిమిట్ట‌లో విశిష్ట సేవ‌లు అందించిన శ్రీ‌వారి సేవకులు

ఒంటిమిట్ట‌లో విశిష్ట సేవ‌లు అందించిన శ్రీ‌వారి సేవకులు

ఒంటిమిట్ట‌లో విశిష్ట సేవ‌లు అందించిన శ్రీ‌వారి సేవకులు post thumbnail image

ఒంటిమిట్ట / తిరుపతి : ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగ‌రంగ వైభ‌వంగా కొన‌సాగుతున్నాయి. ఉత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని నిర్వహించిన శ్రీ సీతారాముల కల్యాణాన్ని ఘ‌నంగా నిర్వ‌హించారు. 80 వేల మందికి పైగా భ‌క్తులు ద‌ర్శించుకున్నారు. భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసింది టీటీడీ. ఇదే క్ర‌మంలో ఉచితంగా సేవ‌లు అందించారు శ్రీ‌వారి సేవ‌కులు. వారు అందిస్తున్న సేవ‌ల గురించి ఎంత చెప్పినా త‌క్కువే. తాజాగా ఉత్స‌వాల‌లో శ్రీవారి సేవకులు అత్యంత క్రమశిక్షణతో, భక్తి శ్రద్ధలతో విశేష సేవలందించారు.
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ఎం. రవిచంద్ర ఆదేశాల మేరకు, జేఈవో వి. వీరబ్రహ్మం పర్యవేక్షణలో, సిపిఆర్ఓ డా. టి. రవి, పిఆర్ఓ (ఎఫ్‌ఏసీ) కుమారి నీలిమ ఆధ్వర్యంలో కడప పరిసర ప్రాంతాల నుండి వచ్చిన సుమారు 2,600 మంది శ్రీవారి సేవకులు వివిధ విభాగాల్లో భక్తులకు సేవలందించారు. కల్యాణ వేదిక పరిసరాల్లో అన్నప్రసాదం, ఆరోగ్య, విజిలెన్స్ విభాగాలతో సమన్వయం చేసుకుంటూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సేవలను సమర్థవంతంగా నిర్వహించారు.
గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులకు తాగునీరు, మజ్జిగ, ఫ్రూటీ, అన్నప్రసాదాలు సమృద్ధిగా అందించారు. అదేవిధంగా శ్రీవారి లడ్డూ, ముత్యాల తలంబ్రాలు, కంకణాలు కలిగిన బ్యాగులను భక్తిశ్రద్ధలతో పంపిణీ చేశారు. భక్తులు సులభంగా గ్యాలరీలలోకి ప్రవేశించి దర్శనం చేసుకునేలా మాడ వీధుల్లో ప్రవేశ, నిష్క్రమణ ద్వారాల వద్ద, గ్యాలరీలలో రద్దీని క్రమబద్ధీకరించడంలో టిటిడి అధికారులకు సేవకులు సహకారం అందించారు. శ్రీ సీతారాముల కల్యాణానికి విచ్చేసిన భక్తులకు శ్రీవారి సేవకులు తిరునామధారణ సేవలు అందించి ఆధ్యాత్మిక భావాన్ని మరింత పెంపొందించారు. సీతారాముల కళ్యాణం సందర్భంగా టీటీడీ చేపట్టిన ఏర్పాట్లపై భక్తుల నుండి అభిప్రాయాలు సేకరించారు.
శ్రీవారి సేవకులు 1.60 లక్షల ముత్యాల తలంబ్రాలను అత్యంత భక్తి భావంతో ప్యాక్ చేశారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయం నుండి తీసుకు వచ్చిన సుమారు 85 వేల శ్రీవారి లడ్డూలను కల్యాణానికి విచ్చేసిన భక్తులకు పంపిణీ చేశారు. టీటీడీ అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో సుమారు 85 వేల పులిహోర, 85 వేల కేసరి, బాదుషా, మిక్చర్, బిస్కెట్ ప్యాకెట్లను భక్తులకు అందజేశారు.
The post ఒంటిమిట్ట‌లో విశిష్ట సేవ‌లు అందించిన శ్రీ‌వారి సేవకులు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

కండ‌రాల గాయం ప‌లు మ్యాచ్ ల‌కు ధోనీ దూరంకండ‌రాల గాయం ప‌లు మ్యాచ్ ల‌కు ధోనీ దూరం

చెన్నై : ఐపీఎల్ 2026 మార్చి 28 శ‌నివారం నుండి ప్రారంభం కానుంది. ఈ స‌మ‌యంలో ఉన్న‌ట్టుండి బిగ్ షాక్ త‌గిలింది రుతురాజ్ గైక్వాడ్ సార‌థ్యంలోని చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టుకు. ఒక ర‌కంగా త‌మిళ క్రికెట్ అభిమానుల‌కు కోలుకోలేని దెబ్బ

ఎంఎస్ ధోనీ అస‌లైన వార‌సుడు సంజూ శాంస‌న్ఎంఎస్ ధోనీ అస‌లైన వార‌సుడు సంజూ శాంస‌న్

ముంబై : రేప‌టి నుంచి మెగా ఐపీఎల్ టోర్నీ 2026 ప్రారంభం కానుంది. ఈ త‌రుణంలో భారీ ఎత్తున అంచ‌నాలు నెల‌కొన్నాయి ఆయా జ‌ట్ల‌పై. ప్ర‌ధానంగా ముగ్గురు కీల‌క‌మైన ఆట‌గాళ్లైన మ‌హేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌ల‌పై క‌ళ్లు

DK Shivakumar: కిరణ్‌ మజుందార్‌ షా పై డీకే వ్యంగ్యాస్త్రాలుDK Shivakumar: కిరణ్‌ మజుందార్‌ షా పై డీకే వ్యంగ్యాస్త్రాలు

    బెంగళూరు రోడ్ల పరిస్థితిపై ఇటీవల తీవ్ర చర్చ జరుగుతుంది. ఈ విషయంపై బయోకాన్ లిమిటెడ్‌ వ్యవస్థాపకురాలు కిరణ్‌ మజుందార్ షా విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈ విషయంపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ వ్యంగ్యంగా బదులిచ్చారు.