hyderabadupdates.com movies ఒక కోడి రామకృష్ణ… ఒక బి గోపాల్… ఒక బోయపాటి శీను

ఒక కోడి రామకృష్ణ… ఒక బి గోపాల్… ఒక బోయపాటి శీను

బాలకృష్ణ, బోయపాటి శీనుల బ్లాక్ బస్టర్ సక్సెస్ ని కొనసాగిస్తుందని అభిమానులు ఎంతో ఆశలు పెట్టుకున్నఅఖండ 2 తాండవం వాటిని నీరు గార్చిన మాట వాస్తవం. అలాని డిజాస్టర్ అందామా ఆ ఛాన్స్ లేదు. ఎందుకంటే యుఎస్ లో ఆలస్యంగా అయినా వన్ మిలియన్ దాటేసింది.

ఇది బ్రేక్ ఈవెన్ కి దూరమే కానీ ఈ మాత్రం వసూళ్లు వచ్చాయంటే ఎంతో కొంత నష్టాల శాతం తగ్గినట్టే. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ తర్వాత వరసగా అయిదో వంద కోట్ల గ్రాసర్ ఖాతాలో వేసుకున్న బాలయ్య ఇలాంటి నెగటివ్ టాక్ తో మూడో వారం వీకెండ్ లో స్టడీగా ఉండటం మాములు విషయం కాదు.

ఇవాళ్టికి కూడా బుక్ మై షోలో గంటకు సగటున రెండు వేల దాకా టికెట్లు అమ్ముడుపోతున్నాయి. ఒకటే స్క్రీన్ ఆడిస్తున్న చాలా సెంటర్స్ లో ఆదివారం హౌస్ ఫుల్స్ పడ్డాయి. వీక్ డేస్ నెంబర్లు పెద్దగా లేనప్పటికీ క్రిస్మస్ లాంటి సెలవుల్లో ఇంత రాబట్టడం చిన్న విషయం కాదు.

అయితే దర్శకుడు బోయపాటి శీనుకు బాలయ్యతో తన కాంబో స్టామినా మరోసారి అర్థమై ఉంటుంది. ఇక్కడో పాయింట్ మాట్లాడుకోవాలి. బాలకృష్ణ కెరీర్ లో అత్యధిక బ్లాక్ బస్టర్లు ఇచ్చిన దర్శకుల్లో మొదటి పేరు కోడి రామకృష్ణది. మంగమ్మ గారి మనవడు, మువ్వ గోపాలుడు, ముద్దుల మావయ్య, బాల గోపాలుడు ఇవన్నీ ఓ రేంజ్లో ఆడిన సూపర్ హిట్లు.

ఆ తర్వాత బి గోపాల్ గురించి అభిమానులు ప్రత్యేకంగా చెప్పుకుంటారు. లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్ పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు ఇలా ఒకదాన్ని మించి మరొకటి ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టాయి. పలనాటి బ్రహ్మనాయుడు వీళ్ళ కలయికకు బ్రేక్ వేసింది. బోయపాటి శీనును వీళ్ళ సరసన చేరే అవకాశాన్ని తృటిలో జార్చుకున్నారు.

ఒకవేళ అఖండ తాండవం 2 కనక అంచనాలు అందుకుని ఉంటే కనీసం రెండు వందల కోట్ల గ్రాస్ కళ్లజూసేది. అలా జరగకనే శంబాల, ఈషా లాంటి చిన్న సినిమాలు ఈ వారం డామినేట్ చేశాయి. అయినా సరే బోయపాటి సరైన కంటెంట్ తో వస్తే మళ్ళీ మేజిక్ చేయొచ్చు. 

Related Post

అనిల్ స్టామినాని తక్కువంచనా వేస్తున్నారేఅనిల్ స్టామినాని తక్కువంచనా వేస్తున్నారే

నిన్న విడుదలైన మన శంకరవరప్రసాద్ గారు సినిమాలోని మీసాల పిల్ల లిరికల్ సాంగ్ ప్రోమో ఇరవై నాలుగు గంటల్లోనే పది మిలియన్ల డిజిటల్ వ్యూస్ తో దూసుకుపోతోంది. అయితే సోషల్ మీడియాలోని ఒక వర్గం ఎప్పటిలాగే అనిల్ రావిపూడి టేకింగ్ మీద

Here is when Mana Shankara Varaprasad Garu’s ticket bookings will openHere is when Mana Shankara Varaprasad Garu’s ticket bookings will open

Mana Shankara Varaprasad Garu, headlined by Megastar Chiranjeevi, is slated for a grand release on January 12. The family entertainer, directed by Anil Ravipudi, will have paid premiere shows on