hyderabadupdates.com Gallery ఒలింపిక్స్ లో స్వ‌ర్ణం గెల‌వ‌డం ల‌క్ష్యం

ఒలింపిక్స్ లో స్వ‌ర్ణం గెల‌వ‌డం ల‌క్ష్యం

ఒలింపిక్స్ లో స్వ‌ర్ణం గెల‌వ‌డం ల‌క్ష్యం post thumbnail image

ముంబై : ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ను గెలుచుకున్న అనంత‌రం జ‌ట్టు కెప్టెన్ సూర్య కుమార్ యాద‌వ్ త‌న స్వంత స్థ‌లం ముంబైకి చేరుకున్నాడు. ఈ సంద‌ర్బంగా గ్రాండ్ వెల్ కం ల‌భించింది. రాష్ట్ర స‌ర్కార్ త‌ర‌పున త‌న‌కు ఘ‌నంగా స‌న్మానం చేశారు. కెప్టెన్ మీడియాతో మాట్లాడాడు. ఇది స‌మిష్టి విజ‌యం అని పేర్కొన్నాడు. ఇంత కాలం టోర్నీపై ఫోక‌స్ పెట్టామ‌ని, కుటుంబాల‌కు దూరంగా ఉన్నామ‌ని తెలిపాడు. వరుసగా ట్రోఫీలు గెలవడం నాకు చాలా సంతోషంగా ఉంద‌న్నారు సూర్య కుమార్ యాద‌వ్. 2024లో టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత, 2026లో మన గడ్డపై ట్రోఫీ గెలిస్తే చాలా బాగుంటుందని అనుకున్నాం అని తెలిపాడు.
పొట్టి ఫార్మాట్ లో ఎవ‌రూ ఊహించ లేదు తాము గెలుస్తామ‌ని అని అన్నాడు. కానీ త‌మ జ‌ట్టు అన్ని రంగాల‌లో డామినేట్ చేస్తూ వ‌చ్చింద‌న్నాడు. జ‌ట్టు ప‌రంగా ప్ర‌తి ఒక్క‌రు త‌మ వంతు స‌హ‌కారం అందించార‌ని చెప్పాడు. ఇదే స‌మ‌యంలో కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్ గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని అన్నాడు. త‌ను క‌మ్ బ్యాక్ అయిన విధానం సూప‌ర్ అని పేర్కొన్నాడు. విండీస్, ఇంగ్లండ్, ఫైన‌ల్ లో న్యూజిలాండ్ తో త‌ను అద్బుతంగా ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చాడ‌ని, త‌న‌తో పాటు బుమ్రా కీల‌క‌మైన భూమిక పోషించాడ‌ని ప్ర‌శంసించాడు సూర్య కుమార్ యాద‌వ్.
త‌మ‌మ‌ తదుపరి లక్ష్యం ఒలింపిక్స్‌లో భారతదేశం తరఫున స్వర్ణం గెలవడం మాత్ర‌మే మిగిలి ఉంద‌న్నాడు . భారత క్రికెట్ జట్టు మంచి జోరులో ఉందని, భవిష్యత్తులో భారతదేశం తరఫున మరిన్ని ట్రోఫీలు గెలవడానికి ప్రయత్నిస్తాన‌ని చెప్పాడు కెప్టెన్.
The post ఒలింపిక్స్ లో స్వ‌ర్ణం గెల‌వ‌డం ల‌క్ష్యం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

మూవీ ప్ర‌మోష‌న్ లో న‌టి స‌మంత బిజీమూవీ ప్ర‌మోష‌న్ లో న‌టి స‌మంత బిజీ

హైద‌రాబాద్ : అక్కినేని నాగ చైత‌న్య‌తో విడాకుల త‌ర్వాత డైరెక్ట‌ర్ తో పెళ్లి చేసుకున్నాక దూకుడు పెంచింది న‌టి స‌మంత రుత్ ప్ర‌భు. తాజాగా త‌ను మా ఇంటి బంగారం మూవీ ప్ర‌మోష‌న్ లో బిజీగా మారి పోయింది. ఇందుకు సంబంధించిన

Kochi: కేరళలో కుప్పకూలిన వాటర్ ట్యాంక్‌ ! జనావాసాలపై 1.38 కోట్ల లీటర్ల నీరు !Kochi: కేరళలో కుప్పకూలిన వాటర్ ట్యాంక్‌ ! జనావాసాలపై 1.38 కోట్ల లీటర్ల నీరు !

    కేరళ వాటర్ అథారిటీ (KWA) ఫీడర్ ట్యాంక్ సోమవారం తెల్లవారుజామున ఒక్కసారిగా కుప్పకూలింది. కేరళలోని తమ్మనం అనే ప్రాంతంలో ఉన్న కేడబ్ల్యూఏ నీటి ట్యాంక్‌ కూలడంతో 1.38 కోట్ల లీటర్ల నీరు ఒక్కసారిగా జనావాసాలపై గుమ్మరించినట్లు పడిపోయింది. దీంతో