hyderabadupdates.com movies కంగారెత్తిస్తున్న కొత్త కుర్రాడి స్టార్‌డమ్

కంగారెత్తిస్తున్న కొత్త కుర్రాడి స్టార్‌డమ్

దర్శకుడిగా రెండు సినిమాలు.. హీరోగా రెండు సినిమాలు.. ఇంతలోనే ప్రదీప్ రంగనాథన్ అనే కుర్రాడు తెచ్చుకున్న ఫాలోయింగ్, మార్కెట్ చూసి ఇప్పుడు సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ షాకైపోతోంది. తన సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే వంద కోట్ల వసూళ్లు ఈజీగా వచ్చేసే పరిస్థితి కనిపిస్తోంది. ప్రదీప్ కొత్త చిత్రం ‘డ్యూడ్’కు ఎబోవ్ యావరేజ్ టాక్ వచ్చింది. అయినా ఈ సినిమా ఇప్పటిదాకా వరల్డ్ వైడ్ రూ.80 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది.

అటు తమిళంలోనే కాదు.. ఇటు తెలుగులోనూ ఆ చిత్రం దీపావళి హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచే సంకేతాలు కనిపిస్తున్నాయి. ‘డ్యూడ్’కు వచ్చిన ఓపెనింగ్ కోలీవుడ్‌కు పెద్ద షాక్. తొలి రోజు ఏకంగా 22 కోట్లు రాబట్టింది. మిడ్ రేంజ్ స్టార్లకు కూడా సాధ్యం కాని ఓపెనింగ్ ఇది. హీరోగా కేవలం రెండు సినిమాల అనుభవంతో ప్రదీప్ ఇలాంటి ఓపెనింగ్ రాబట్టడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది.ప్రదీప్ ముందు దర్శకుడిగా కోలీవుడ్లోకి అడుగుపెట్టాడు.

జయం రవి హీరోగా ‘కోమాలి’ సినిమా తీశాడు. అది ఓ మోస్తరుగా ఆడింది. తర్వాత అవకాశాలు రాలేదు. గ్యాప్ వచ్చింది. దీంతో తనే హీరోగా అరంగేట్రం చేస్తూ ‘లవ్ టుడే’ సినిమా తీయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. పెద్ద ప్రొడక్షన్ హౌస్ సపోర్ట్ దొరికింది. ఆ సినిమా అటు తమిళంలో, ఇటు తెలుగులో సెన్సేషన్ క్రియేట్ చేసింది. తర్వాత హీరోగా చేసిన ‘డ్రాగన్’ ఏకంగా రూ.140 కోట్ల మేర వసూళ్లు రాబట్టి ఔరా అనిపించింది.

లుక్స్ పరంగా చాలా మామూలుగా అనిపించినా.. తన పెర్ఫామెన్స్, స్టైల్‌తో ప్రదీప్ యువతను కట్టిపడేస్తున్నాడు. ‘డ్యూడ్’ అంత గొప్ప సినిమా కాకపోయినా ఆడుతోందంటే.. ప్రదీప్ పెర్ఫామెన్స్ ముఖ్య కారణం.

వీక్ సినిమాను కూడా నిలబెట్టే స్థాయికి తన స్టార్‌డమ్ చేరుకుంది. తక్కువ టైంలో తనకు వచ్చిన ఈ ఫాలోయింగ్, మార్కెట్ స్టార్లను కంగారు పెట్టేదే. అదే సమయంలో తన మీద అంచనాలు పెరిగిపోవడం ప్రదీప్‌కు కూడా ఇబ్బందికరమే. ఇకపై కథలు ఎంచుకోవడం, హిట్లు డెలివర్ చేయడం అతడికి సవాలుగా మారొచ్చు. ఐతే స్వతహాగా దర్శకుడు కాబట్టి అతను జాగ్రత్తగానే అడుగులు వేస్తాడని, మంచి జడ్జిమెంట్‌తో సినిమాలు చేస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.

Related Post

Sandhya 70mm Theatre Stampede Case: Chargesheet Filed Against 23 AccusedSandhya 70mm Theatre Stampede Case: Chargesheet Filed Against 23 Accused

The Hyderabad City Police have completed the investigation into the Sandhya 70mm Theatre stampede case and filed a chargesheet before the Hon’ble Court on December 24, 2025. Hyderabad Police Commissioner