hyderabadupdates.com Gallery కండ‌రాల గాయం ప‌లు మ్యాచ్ ల‌కు ధోనీ దూరం

కండ‌రాల గాయం ప‌లు మ్యాచ్ ల‌కు ధోనీ దూరం

కండ‌రాల గాయం ప‌లు మ్యాచ్ ల‌కు ధోనీ దూరం post thumbnail image

చెన్నై : ఐపీఎల్ 2026 మార్చి 28 శ‌నివారం నుండి ప్రారంభం కానుంది. ఈ స‌మ‌యంలో ఉన్న‌ట్టుండి బిగ్ షాక్ త‌గిలింది రుతురాజ్ గైక్వాడ్ సార‌థ్యంలోని చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టుకు. ఒక ర‌కంగా త‌మిళ క్రికెట్ అభిమానుల‌కు కోలుకోలేని దెబ్బ అని చెప్ప‌క త‌ప్ప‌దు. నిన్న‌టి దాకా మైదానంలో క‌లియ తిరుగుతూ అంద‌రినీ పేరు పేరునా ప‌ల‌క‌రిస్తూ వ‌చ్చిన మాజీ కెప్టెన్, ఇంపాక్ట్ ప్లేయ‌ర్ మ‌హేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ లో కొన్ని మ్యాచ్ ల‌కు దూరం కానున్నాడు. త‌ను ప్రాక్టీస్ చేస్తున్న సంద‌ర్బంగా పిక్క కండ‌రాల‌కు గాయం ఏర్ప‌డింది. దీంతో సీనియ‌ర్ వైద్యుల సూచ‌న మేర‌కు త‌ను కొన్ని మ్యాచ్ ల‌కు దూరం కానున్న‌ట్లు స‌మాచారం.
ఒక ర‌కంగా త‌మ‌ను దేవుడి కంటే గొప్ప‌గా ఆరాదించే ధోని అభిమానులకు ఒక పెద్ద నిరాశ కలిగించే వార్త ఇది. ఈ విష‌యాన్ని ఇవాళ ఆ ఫ్రాంచైజీ అధికారికంగా వెల్లడించింది. ధోని ప్రస్తుతం పిక్క కండరాల గాయం నుంచి కోలుకునేందుకు పునరావాస చికిత్స పొందుతున్నారు. దీని ఫలితంగా, ఆయన తొలి రెండు వారాలకు దూరమయ్యే అవకాశం ఉంది అని సీఎస్కే స్ప‌ష్టం చేసింది. ఇక షెడ్యూల్ లో భాగంగా చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టు ఈనెల 30న గౌహతిలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌తో త‌ల‌ప‌డ‌నుంది. ధోని కేవలం ఐపీఎల్ లో మాత్రమే ఆడుతుండటంతో, మ్యాచ్ ఫిట్‌నెస్‌ను కొనసాగించడం ఆయనకు మరింత కష్టంగా మారుతోంది. గైక్వాడ్ కెప్టెన్ గా ఉన్న‌ప్ప‌టికీ మొత్తం జ‌ట్టంతా త‌న క‌నుస‌న్న‌ల‌లోనే జ‌రుగుతుంది.
The post కండ‌రాల గాయం ప‌లు మ్యాచ్ ల‌కు ధోనీ దూరం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

CM Revanth Reddy: తెలంగాణా అభివృద్ధి నిరోధకులు కిషన్‌రెడ్డి, కేటీఆర్ – సీఎం రేవంత్CM Revanth Reddy: తెలంగాణా అభివృద్ధి నిరోధకులు కిషన్‌రెడ్డి, కేటీఆర్ – సీఎం రేవంత్

    ‘కేంద్రానికి రూ.43 వేల కోట్లతో మెట్రో విస్తరణ ప్రతిపాదనలను ఇస్తే కిషన్‌రెడ్డి, కేటీఆర్‌ అడ్డుకున్నారు. రీజినల్‌ రింగురోడ్డు, 20 టీఎంసీల గోదావరి జలాల తరలింపు ప్రాజెక్టులకు సైతం అడ్డుపడుతున్నారు. వీళ్లిద్దరి సమన్వయం ప్రాజెక్టులను ఆపడానికా? తెలంగాణపై ఎందుకింత కక్ష?

CM Revanth Reddy: భూ కబ్జాలపై ఉక్కుపాదం మోపాలి – సీఎం రేవంత్CM Revanth Reddy: భూ కబ్జాలపై ఉక్కుపాదం మోపాలి – సీఎం రేవంత్

CM Revanth Reddy : వరంగల్ నగరంలో చెరువులు, నాళాల కబ్జాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కబ్జాదారులు ఎంతటి వారైనా వదలొద్దని హెచ్చరించారు. ఫ్లడ్ వాటర్ మేనేజ్‌మెంట్‌పై ఇరిగేషన్ శాఖ సంసిద్ధంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. అన్ని

Victory Venkatesh Joins Megastar Chiranjeevi’s “Mana Shankara Varaprasad Garu” ShootVictory Venkatesh Joins Megastar Chiranjeevi’s “Mana Shankara Varaprasad Garu” Shoot

The buzz around Megastar Chiranjeevi’s upcoming film “Mana Shankara Varaprasad Garu” continues to grow as the project races ahead under the direction of Anil Ravipudi. Ever since its announcement, the