hyderabadupdates.com movies ‘కరెంటు బిల్లు’ మాట నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం

‘కరెంటు బిల్లు’ మాట నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం

‘కరెంటు బిల్లు’ మాట నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం post thumbnail image

రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర కానుకగా ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి డిస్కంలకు చెల్లించాల్సిన ట్రూఅప్ భారాన్ని ప్రజలపై మోపబోమని కూటమి ప్రభుత్వం స్పష్టంగా నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి ప్రభుత్వం అధికారికంగా లేఖ రాసింది.

మొత్తం రూ.4,498 కోట్ల ట్రూఅప్ భారాన్ని ప్రజలపై ఒక్క పైసా కూడా పడకుండా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని ఆ లేఖలో పేర్కొంది. దీంతో విద్యుత్ చార్జీల పెంపుపై ఉన్న భయాలకు తెరపడింది. ప్రజల ప్రయోజనాలే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.

గతంలో ఇచ్చిన హామీకి అనుగుణంగానే చంద్రబాబు నాయుడు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ట్రూడౌన్ అమలు ద్వారా యూనిట్ విద్యుత్ చార్జీలను తగ్గించి ఉపశమనం కల్పించిన ప్రభుత్వం, ఇప్పుడు వేల కోట్ల భారాన్ని కూడా ప్రజలపై పడకుండా భుజాన వేసుకోవడం ద్వారా ప్రజా హిత పాలనకు నిదర్శనంగా నిలిచింది.

Related Post

జూబ్లీహిల్స్ పోరు: అభ్య‌ర్థుల అస‌లు బెంగ ఇదే!జూబ్లీహిల్స్ పోరు: అభ్య‌ర్థుల అస‌లు బెంగ ఇదే!

హైద‌రాబాద్‌లోని కీల‌క‌మైన జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ఉప ఎన్నిక పోలింగ్‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతోంది. వచ్చే నెల 11న పోలింగ్ ప్ర‌క్రియ జ‌ర‌గ‌నుంది. దీనికి సంబంధించి ఎన్నిక‌ల సంఘం కూడా ఏర్పాట్ల‌ను ముమ్మ‌రంగా చేస్తోంది. ఇప్ప‌టికే.. ఓట‌ర్ల జాబితాను విడుద‌ల చేసింది.