hyderabadupdates.com movies కల్కి-2 గురించి అప్‌డేట్

కల్కి-2 గురించి అప్‌డేట్

బాహుబలి తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి ఏ సినిమా విజయవంతం అయినా.. దానికి సీక్వెల్ అనౌన్స్ చేసేస్తున్నారు. తన లేటెస్ట్ మూవీ ‘రాజాసాబ్’ సక్సెస్ అయి ఉంటే దానికీ సీక్వెల్ ఉండేది. కానీ రాజాసాబ్ ఆశించిన ఫలితాన్ని అందుకోకపోవడంతో పార్ట్-2 అటకెక్కినట్లే. ఐతే దీని కంటే ముందు సలార్-2, కల్కి-2 చిత్రాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. 

కానీ మరోవైపు ప్రభాస్ లైనప్ ఫుల్ ప్యాకప్ అయిపోవడంతో ఆ సీక్వెల్స్ ఎప్పుడు మొదలవుతాయో.. ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తాయో తెలియట్లేదు. ‘సలార్-2’ అయితే అసలు ఉంటుందో లేదో అన్న సందేహాలు కూడా కలుగుతున్నాయి. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇప్పుడిప్పుడే దాన్ని టేకప్ చేసే స్థితిలో కూడా లేడు. కానీ ‘కల్కి-2’ కోసం మాత్రం టీం చాన్నాళ్ల నుంచే కష్టపడుతోంది. దర్శకుడు నాగ్ అశ్విన్ ‘కల్కి’ రిలీజైన కొన్ని నెలల నుంచే దీని మీద పని చేస్తున్నాడు.

తాజాగా ‘కల్కి-2’ గురించి సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ అప్‌డేట్ ఇచ్చాడు. ఈ సినిమా కోసం తన పని ముందే మొదలైనట్లు తెలిపాడు. సంగీత దర్శకుడిగా ‘కల్కి’ తన కెరీర్లో అత్యంత పెద్ద సినిమా అని.. దాన్నుంచి ఎంతో నేర్చుకున్నానని.. ఇప్పుడు ‘కల్కి-2’ కోసం తన వర్క్ ఆల్రెడీ మొదలైందని అతను చెప్పాడు. కల్కి-2 తన కెరీర్లో బెస్ట్ వర్క్ కాబోతోందని అతను పెద్ద స్టేట్మెంటే ఇచ్చాడు. దాని కోసం తనతో పాటు టీం అంతా చాలా ఎఫర్ట్ పెడుతోందని సంతోష్ తెలిపాడు. 

‘కల్కి-2’లో ముఖ్య నటీనటులందరూ మెగాస్టార్లు అని.. వాళ్లందరి డేట్లూ కలిసి రాగానే షూటింగ్ మొదలవుతుందని అతను చెప్పాడు. ‘కల్కి’కి సంతోష్ నారాయణన్ మంచి మ్యూజికే ఇచ్చినప్పటికీ.. దాని విషయంలో కొంత మిశ్రమ స్పందన వచ్చింది. కానీ ఈ ఫీడ్ బ్యాక్‌ను తీసుకుని మరింత బెస్ట్ వర్క్ ఇవ్వడానికే కష్టపడుతున్నట్లున్నాడు సంతోష్. ‘కల్కి-2’ ఈ ఏడాది ద్వితీయార్దంలో సెట్స్ మీదికి వెళ్లొచ్చని అంచనా వేస్తున్నారు.

Related Post

Exclusive: Nora Fatehi is dating a footballer, visits Morocco to attend AFCON 2025 gamesExclusive: Nora Fatehi is dating a footballer, visits Morocco to attend AFCON 2025 games

Nora Fatehi is currently grabbing all the attention as she balances her international music collaborations with her thriving Bollywood presence. But it seems her personal life might be hitting equally

ప్రపంచవ్యాప్తంగా అణు ఆయుధాల లెక్కలివే.. ఏ దేశం దగ్గర ఎన్ని?ప్రపంచవ్యాప్తంగా అణు ఆయుధాల లెక్కలివే.. ఏ దేశం దగ్గర ఎన్ని?

ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ దాడుల నేపధ్యంలో మరోసారి న్యూక్లియర్ బాంబులపై చర్చ మొదలైంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మొత్తం 9 దేశాల దగ్గర అణు ఆయుధాలు ఉన్నట్లు అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. రష్యా, అమెరికా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్, భారత్, పాకిస్థాన్,