hyderabadupdates.com movies కల్కి 2 ప్లానింగ్… ఒక పద్ధతి ఒక ప్రణాళిక

కల్కి 2 ప్లానింగ్… ఒక పద్ధతి ఒక ప్రణాళిక

ప్రభాస్ సినిమాలు సెట్స్ మీద ఎన్ని ఉన్నా ముందుగా ఏది విడుదలవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొన్న మాట వాస్తవం. ఆదిపురుష్ ఈవెంట్ లో ఏడాదికి రెండు రిలీజులు ఉంటాయని ప్రభాస్ ఇచ్చిన హామీ మేరకు, ఎవరూ ఫాలో కానంత వేగంగా ప్యాన్ ఇండియా మూవీస్ ఓకే చేస్తున్నా వాటి నిర్మాణం, పోస్ట్ ప్రొడక్షన్ వల్ల ఇచ్చిన మాట నెరవేరడం లేదు.

తీరిక లేనంత బిజీగా డార్లింగ్ సెట్స్ లోనే ఉంటున్న మాట నిజమే కానీ కొన్ని నిర్మాణ సంస్థల ప్లానింగ్ లోపాల వల్ల టైమింగ్ మిస్సవుతోంది. అందుకే దర్శకుడు సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ విషయంలో చాలా క్లారిటీతో ఉంటూ అఫీషియల్ గా రిలీజ్ డేట్ ప్రకటించేసుకున్నారు.

ఫౌజీ ఇంకా పూర్తి కాకుండానే కల్కి 2 సెట్స్ పైకి వెళ్ళిపోయింది. ప్రస్తుతానికి ప్రభాస్ లేని ఎపిసోడ్స్ ని దర్శకుడు నాగ అశ్విన్ షూట్ చేస్తున్నారు. వీటిలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ తో పాటు మెయిన్ క్యాస్టింగ్ భాగం కానుంది. ఇంకో రెండు నెలల లోపు ప్రభాస్ జాయిన్ కావొచ్చని అంటున్నారు.

హీరోయిన్ గా దీపికా పదుకునే స్థానంలో ఎవరు వచ్చారనే క్లారిటీ ఇప్పటిదాకా లేదు. సాయిపల్లవి పేరు వినిపిస్తున్నా టీమ్ దాన్ని అధికారికంగా ప్రకటించలేదు. సో అనౌన్స్ మెంట్స్ వచ్చే దాకా వెయిట్ చేయాలి. అమితాబ్, కమల్ కాల్ షీట్స్ దొరకడంతో ముందు ఆ భాగాలను పూర్తి చేసే పనిలో ఉన్నాడు నాగ్ అశ్విన్.

విడుదల తేదీ పరంగా కల్కి 2 మీద ఎలాంటి ఒత్తిడి లేదు. ఎందుకంటే దీనికన్నా ముందు ఫౌజీ, స్పిరిట్ వస్తాయి. అంటే 2028లో కల్కి 2 ప్లాన్ చేసుకోవచ్చు. పోస్ట్ ప్రొడక్షన్, విఎఫ్ఎక్స్ కు తగినంత సమయం కావాలి కాబట్టి నాగ్ అశ్విన్ కి ఇది మంచి ప్లానింగ్ అవుతుంది.

మొదటి భాగానికి అయిదు రెట్లు ఎక్కువనే స్థాయిలో సీక్వెల్ కంటెంట్ ఉంటుందని, విజువల్స్ అబ్బురపరుస్తాయని ఇన్ సైడ్ టాక్. పార్ట్ 1 లో తక్కువ స్పేస్ దక్కించుకున్న కమల్ హాసన్ ఈసారి ఫుల్ లెన్త్ రోల్ లో విశ్వరూపం చూపిస్తారట. ముఖ్యంగా ఆయనకు, ప్రభాస్ కు మధ్య వచ్చే సన్నివేశాలు నెవర్ బిఫోర్ అనే స్థాయిలో ఉంటాయని వినికిడి.

Related Post

I got goosebumps watching Nani sir on the sets of The Paradise-Deekshith ShettyI got goosebumps watching Nani sir on the sets of The Paradise-Deekshith Shetty

Deekshith Shetty, who made his Telugu debut with Nani’s Dasara, is all praise for the star’s upcoming project The Paradise. Sharing his excitement, Deekshith said he recently visited the sets

వారందరికి పవన్ ‘48 గంటల’ వార్నింగ్వారందరికి పవన్ ‘48 గంటల’ వార్నింగ్

వైసీపీ నేతలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. తమ ప్రభుత్వం తలచుకొని ఒక నిర్ణయం తీసుకుంటే 48 గంటల్లో కిరాయి రౌడీ గ్యాంగులు ఉండవని హెచ్చరించారు. అలా చేస్తే కిరాయి గ్యాంగులు మెయింటైన్ చేసే వ్యక్తులు