hyderabadupdates.com Gallery క‌ల్వ‌కుంట్ల క‌విత‌పై కోమ‌టిరెడ్డి షాకింగ్ కామెంట్స్

క‌ల్వ‌కుంట్ల క‌విత‌పై కోమ‌టిరెడ్డి షాకింగ్ కామెంట్స్

క‌ల్వ‌కుంట్ల క‌విత‌పై కోమ‌టిరెడ్డి షాకింగ్ కామెంట్స్ post thumbnail image

మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా : రాష్ట్ర రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న మాజీ సీఎం కేసీఆర్ కూతురు, ఇటీవ‌లే త‌న ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేసిన క‌ల్వ‌కుంట్ల క‌విత పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. భార‌త రాష్ట్ర స‌మితి పార్టీని, మాజీ సీఎం కేసీఆర్ ను విమ‌ర్శించేందుకు, ఏకిపారేసేందుకు తాము అవ‌స‌రం లేద‌ని అన్నారు . త‌న కూతురు క‌విత ఒక్క‌రు చాల‌ని పేర్కొన్నారు కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధిపై దృష్టి సారిస్తుందని మంత్రి అన్నారు . బుద‌వారం మంత్రి మ‌హబూబ్ న‌గ‌ర్ జిల్లాలోని దేవ‌ర‌క‌ద్ర శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యే మ‌ధుసూన్ రెడ్డితో క‌లిసి ప‌లు అభివృద్ది ప‌నుల‌లో పాల్గొన్నారు. ఆయ‌న‌తో పాటు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీ‌హ‌రి కూడా పాల్గొన్నారు.
ఈ సంద‌ర్బంగా మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి ప్ర‌సంగించారు. బీఆర్ఎస్ అడ్ర‌స్ లేకుండా పోవ‌డం ఖాయ‌మ‌న్నారు. తాము ప‌ట్టించుకోమ‌ని పేర్కొన్నారు. ఆ పార్టీని తాము ప్ర‌తిప‌క్షంగా గుర్తించ‌డం లేద‌ని ఎద్దేవా చేశారు . అయితే ప‌లుసార్లు ఎందుకు విమ‌ర్శించాల‌ని, ఏం చేశార‌ని వారిపై ఆరోప‌ణ‌లు చేయాల‌ని త‌న కూతురు ఒక్క‌తే వారికి స‌రైన పోటీ అంటూ పేర్కొన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అన్ని చోట్లా గెలిస్తే, మరింత ఎక్కువ బలం తో పనిచేసే అవకాశం లభిస్తుందని కోమటిరెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికలు పార్టీ గుర్తులతో జరుగుతాయని పేర్కొంటూ, రాష్ట్రంలోని 138 మున్సిపాలిటీలలో బీఆర్ఎస్ 10 శాతానికి మించి గెలవదని ఆయన అన్నారు. పార్టీ గుర్తులతో సంబంధం లేని పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీ 40 శాతం సీట్లు గెలుస్తుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు పేర్కొన్నారని, మున్సిపల్ ఎన్నికల్లో తన బలాన్ని చూపించాలని మంత్రి ఆయనకు సవాల్ విసిరారు.
The post క‌ల్వ‌కుంట్ల క‌విత‌పై కోమ‌టిరెడ్డి షాకింగ్ కామెంట్స్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

CM Chandrababu: అమరావతిలో గ్రంథాలయ నిర్మాణానికి శోభా గ్రూప్‌ రూ.100 కోట్ల విరాళంCM Chandrababu: అమరావతిలో గ్రంథాలయ నిర్మాణానికి శోభా గ్రూప్‌ రూ.100 కోట్ల విరాళం

  ఏపీ రాజధాని అమరావతిలో రూ.100 కోట్లతో ప్రపంచ స్థాయి గ్రంథాలయ నిర్మాణానికి శోభా గ్రూప్ విరాళం ప్రకటించింది. శోభా గ్రూప్ సంస్థ అమరావతిలో ప్రపంచ స్థాయి స్టేట్ లైబ్రరీ నిర్మించేందుకు ముందుకు రావటంపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.

తన డైట్‌ గురించి ఈ ముద్దుగుమ్మ ఏమందంటే..!తన డైట్‌ గురించి ఈ ముద్దుగుమ్మ ఏమందంటే..!

గ్లామర్‌ హీరోయిన్‌ రాశి ఖన్నా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాల గురించి ఆసక్తికరంగా పంచుకుంది. తాను ఒకప్పుడు లావుగా ఉండేదానని, ఆ సమయాన్ని ఇప్పుడు గుర్తు చేసుకుంటే నవ్వు వస్తుందని చెప్పింది. చిన్నప్పటి నుంచే తాను తినడం చాలా

జటాధర ట్రైలర్‌ మామూలుగా లేదుగా..!జటాధర ట్రైలర్‌ మామూలుగా లేదుగా..!

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు హీరోగా, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా తెలుగులో మొదటిసారి నటిస్తున్న సినిమా “జటాధర” ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చగా మారింది. ఈ సినిమాకు వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ