hyderabadupdates.com movies కవితను ఇంతలా అవమానించారా?

కవితను ఇంతలా అవమానించారా?

హైదరాబాద్: బీఆర్ఎస్ నుంచి తనను అవమానకరంగా బయటకు పంపించారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి. పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తీరుపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

కవిత మాట్లాడుతూ, “ఉరి శిక్ష విధించే ఖైదీకి కూడా చివరి కోరిక అడుగుతారు. కానీ నాకు షోకాజ్ నోటీసు ఇవ్వకుండా సస్పెండ్ చేశారు. ఇది చాలా బాధాకరం” అని అన్నారు. ఇంకా ఆమె స్పష్టం చేస్తూ, “కేసీఆర్ పిలిస్తే కూతురిగా ఇంటికి వెళ్తాను. కానీ బీఆర్ఎస్‌తో ఇక నాకు ఎలాంటి సంబంధం లేదు” అని చెప్పింది.

తన సస్పెన్షన్‌పై కవిత చేసిన ఈ వ్యాఖ్యలు, పార్టీ అంతర్గత పరిస్థితులను మరింత కష్టతరం చేస్తున్నాయి. జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ కవిత మాట్లాడిన ప్రతి మాట బీఆర్ఎస్‌కు గట్టి దెబ్బలుగా మారుతున్నాయనే మాట రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.

పార్టీలో ఇప్పటికే ఉన్న విభేదాలు ఇప్పుడు బయటపడుతున్నాయి. కుటుంబ రాజకీయాలు, పార్టీ భవిష్యత్తు దిశ గురించి చర్చలు మళ్లీ వేడెక్కుతున్నాయి.

Related Post

ఊహకు అందని రాజమౌళి స్ట్రాటజీలుఊహకు అందని రాజమౌళి స్ట్రాటజీలు

ఇంకా సగం షూటింగ్ కూడా అవ్వలేదు. అప్పుడే రాజమౌళి వారణాసి ప్రమోషన్లు మొదలుపెట్టడం గురించి ఇండస్ట్రీలోనే కాదు ప్రేక్షకుల్లోనూ ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ప్రత్యేకంగా ఒక హాలీవుడ్ ఛానల్ కి మహేష్ బాబు, పృథ్విరాజ్, ప్రియాంకా చోప్రాలతో కలిసి ఇంటర్వ్యూ ఇవ్వడం, దాని