hyderabadupdates.com movies కష్టాల నాయకుడికి ‘ప్రైమ్’ షాకు ?

కష్టాల నాయకుడికి ‘ప్రైమ్’ షాకు ?

రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే విఫలమయ్యారో పవన్ కళ్యాణ్ అక్కడే జనసేన రూపంలో పోరాటం చేసి డిప్యూటీ సిఎం దాక వచ్చారు. పక్క రాష్ట్రంలో రజనీకాంత్, కమల్ హాసన్ తమ వల్ల కాదని తిరిగి సినిమాల్లోకి వస్తే, ఎంజిఆర్ లాంటి లెజెండరీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేకపోయారు.

తాజాగా తన పొలిటికల్ ప్రస్థానాన్ని ఘనంగా ఆరంభించాలని చూస్తున్న విజయ్ కు ఎన్నో అడ్డంకులు తలెత్తుతున్నాయి. రోడ్ షోలో అభిమానులు చనిపోవడం, దాని మీద ఢిల్లీలో విచారణ, భార్య సంగీత విడాకుల వ్యవహారం, త్రిషతో ప్రేమాయణం పుకార్లు ఇలా రకరకాల వ్యూహ్యాల్లో చిక్కుకున్నాడు. వీటికన్నా ముందు సంక్రాంతి నుంచి వాయిదా పడుతున్న జన నాయకుడు విడుదల గురించి స్పష్టత లేక ఫ్యాన్స్ అసహనానికి గురవుతున్నారు.

చెన్నై టాక్ ప్రకారం జన నాయకుడు విడుదలలో విపరీతమైన జాప్యం జరిగిన కారణంగా అమెజాన్ ప్రైమ్ ఓటిటి డీల్ రద్దు చేసుకుందట. అధికారికంగా ఇంకా బయటికి చెప్పలేదు కానీ న్యూస్ అయితే జోరుగా చక్కర్లు కొడుతోంది. ఇస్తామన్న నూటా ఇరవై కోట్ల ఒప్పందం ఈ ఆలస్యం వల్ల నిర్మాత చేజారిపోయినట్టు వినికిడి. థియేటర్ రిలీజ్ డేట్ కు అనుగుణంగానే ఓటిటి అగ్రిమెంట్లు రాసుకుంటాయి. అది పదే పదే మిస్ అయితే క్యాన్సిల్ చేసుకునే హక్కు కూడా ఉంటుంది.

గతంలో హరిహర వీరమల్లు విషయంలోనూ ఇదే సమస్య తలెత్తితే ఏదోలా నిర్మాత ఏఎం రత్నం మేనేజ్ చేసుకుంటూ వచ్చారు. చివరికి భారీ కోత విధించాక ఈ సినిమాని ప్రైమ్ కొందనే వార్త చక్కర్లు కొట్టింది. మరి జన నాయకుడుకి అలాంటి వెసులుబాటు ఇస్తారో లేదో చూడాలి. అయితే జన నాయకుడు విడుదలై బ్లాక్ బస్టర్ అయితే తర్వాతైనా కొనేందుకు ఓటిటిలు ముందుకు వస్తాయి. కొంచెం సొమ్ము తగ్గుతుంది అంతే. వీలైనంత త్వరగా నిర్మాణ సంస్థ కెవిఎన్ ఈ ప్రచారాలకు చెక్ పెట్టడం బెటర్.

Related Post