hyderabadupdates.com Gallery కాంగ్రెస్ మోసం నిరుద్యోగుల‌కు శాపం : కేటీఆర్

కాంగ్రెస్ మోసం నిరుద్యోగుల‌కు శాపం : కేటీఆర్

కాంగ్రెస్ మోసం నిరుద్యోగుల‌కు శాపం : కేటీఆర్ post thumbnail image

హైద‌రాబాద్ : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. మరో గ్యారెంటీ నుంచి నిస్సిగ్గుగా ముఖం చాటేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చూసి తెలంగాణ నిరుద్యోగుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోందని అన్నారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే 2 లక్షల ఉద్యోగాలిస్తామని అడ్డదారిలో గద్దెనెక్కిన రేవంత్.. తీరా అది ఐదేళ్ల హామీ అని, పీసీసీ చీఫ్ తో సీఎం పలికిస్తున్న చిలుక పలుకులు చూసి యువతరం ఛీకొడుతోందని అన్నారు. తొఒలి సంవత్సరమే రెండు లక్షల నియామకాలు చేపట్టకపోతే ప్రభుత్వాన్ని దించేయండని ఢిల్లీ నుంచి వచ్చి మరీ చెప్పిపోయిన ప్రియాంక గాంధీ మాట అమలై ఉంటే.. ఈ దగాకోరు సర్కారు కుప్పకూలి ఇప్పటికే ఏడాది పూర్తయ్యేదన్నారు.
కేసీఆర్ హయాంలో చివరి దశలో ఉన్న 65 వేల ఉద్యోగాలకు నియామక పత్రాలిచ్చి ఫోటోలకు ఫోజు కొట్టిన సీఎం, ఆ తరువాత మొత్తానికే చేతులెత్తేయడంతోనే తెలంగాణలో “రిక్రూట్ మెంట్ జీరో”గా మారిపోయిందని ఆరోపించారు కేటీఆర్. అప్పటికే లక్షా 65 వేల ఉద్యోగాలను భర్తీచేసిన బీఆర్ఎస్ ప్రభుత్వంపై పనిగట్టుకుని రేవంత్ చల్లిన బురద అంతా అబద్ధాలతో అందలం ఎక్కడానికేనని అందరికీ అర్థమై పోయిందన్నారు. పట్టుమని పదివేల కొత్త ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్లు ఇవ్వని చేతకాని దద్దమ్మ పాలన చూసి నిరుద్యోగులే కాదు, వారి తల్లిదండ్రులు కూడా దుమ్మెత్తి పోస్తున్నారని అన్నారు.
జాబ్ క్యాలెండర్ కు పాతరేసి, వరుస కుంభకోణాలతో రేవంత్ సర్కారు జేబులు నింపుకుంటున్న తీరును నిత్యం తెలంగాణ సమాజం గమనిస్తూనే ఉందన్నారు. రెండు లక్షల ఉద్యోగాల హామీపై నాలుక మడతేసినంత మాత్రాన నాలుగు కోట్ల ప్రజలు ఊరుకుంటారని, ముఖ్యమంత్రి చేసిన మోసాన్ని మరిచిపోతారని అనుకుంటే అది పొరపాటే అవుతుంంద‌న్నారు కేటీఆర్ . తెలంగాణ నిరుద్యోగులను నమ్మించి నయవంచన చేసినందుకు ముఖ్యమంత్రి ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పినా, పొర్లుదండాలు పెట్టినా క్షమించే ప్రసక్తే లేదన్నారు.
The post కాంగ్రెస్ మోసం నిరుద్యోగుల‌కు శాపం : కేటీఆర్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

జ‌న‌సేన ఎమ్మెల్యే వ్య‌వ‌హారంపై సమగ్ర విచార‌ణజ‌న‌సేన ఎమ్మెల్యే వ్య‌వ‌హారంపై సమగ్ర విచార‌ణ

విజ‌య‌వాడ : జ‌న‌సేన పార్టీకి చెందిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అర‌వ శ్రీ‌ధ‌ర్ రాస‌లీల వ్య‌వ‌హారం దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారితీసింది. ఓ ప్ర‌భుత్వ ఉద్యోగిని ప‌ట్ల ఆయ‌న అనుసరించిన తీరుపై ఆగ్రహం వ్య‌క్తం అవుతోంది. ఇదే స‌మ‌యంలో బాధితురాలు ధైర్యంగా

Rishab Shetty Denies Reports of Production Issues for Kantara: Chapter 1Rishab Shetty Denies Reports of Production Issues for Kantara: Chapter 1

Actor-director Rishab Shetty has dismissed recent reports suggesting that the production of Kantara: Chapter 1 faced multiple challenges and shooting delays. Speaking at a recent event in Mumbai, Rishab clarified

ప్రతిష్టాత్మకంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళికప్రతిష్టాత్మకంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక

వ‌రంగ‌ల్ జిల్లా : అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌జా పాల‌న ప్ర‌గ‌తి ప్ర‌ణాళిక కార్య‌క్ర‌మం కొన‌సాగుతోంద‌ని అన్నారు రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రజా సమస్యలను కలిసి కట్టుగా పరిష్కరించుకుందాం