hyderabadupdates.com movies కాంతను చుట్టుముట్టిన అనుకోని చిక్కు

కాంతను చుట్టుముట్టిన అనుకోని చిక్కు

ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న కాంతకు అనుకోని చిక్కు అడ్డుపడింది. ఇది తన తాత జీవితాన్ని ఆధారంగా చేసుకుని తీశారని, తమ కుటుంబం నుంచి ఎలాంటి అనుమతులు లేవని, కాబట్టి రిలీజ్ ఆపాలని కోరుతూ కోలీవుడ్ సీనియర్ స్టార్ ఎంకె త్యాగరాజ భాగవతార్ మనవడు బి తియాగరాజన్ చెన్నై సివిల్ కోర్టుని సంప్రదించడంతో నవంబర్ 18 లోపు బదులు చెప్పమని ఉత్తర్వులు జారీ కావడంతో కాంత మోక్షం డోలాయమానంలో పడింది. ఇప్పటికే తెలుగు తమిళ వెర్షన్లకు సంబంధించి ఆన్ లైన్ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైపోయాయి. హఠాత్తుగా జరిగిన పరిణామం ఫ్యాన్స్ ని నిరాశకు గురి చేసింది.

ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూలో దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ పాక్షికంగా ఎంకెటి జీవితాన్ని స్పృశించామని, బోలెడంత కాల్పనికత ఉందని, ఒక ఫిలిం మేకర్ కి దర్శకుడికి మధ్య చెలరేగే ఈగో వార్ ఎక్కడికి దారి తీసిందని పాయింట్ చుట్టూ కాంత ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఇది కూడా ఒకరకంగా ఇబ్బంది కలిగించే స్టేట్ మెంటే. స్వతహాగా గాయకుడు కం నటుడు అయినా ఎంకెటి ఎక్కువ సినిమాల్లో నటించలేదు. కానీ దాదాపు అన్నీ బ్లాక్ బస్టర్లే. ఒక మర్డర్ కేసులో ఇరుక్కుని బయటికి వచ్చాక కెరీర్ సమాప్తం అయ్యింది. ఇవన్నీ కాంతలో పొందుపరిస్తేనే కేసుకి వెయిట్ వస్తుంది.

నిర్మాతల్లో ఒకరైన దగ్గుబాటి రానా, హీరో దుల్కర్ సల్మాన్ ఇప్పుడు దీన్ని ఎలా పరిష్కరించుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే కాంత పలు వాయిదాలు పడింది. సెప్టెంబర్ నుంచి నవంబర్ కు వచ్చింది. ఇప్పుడు మిస్ చేసుకుంటే మళ్ళీ ఇంకో డేట్ పట్టడం కష్టం. పైగా నెలాఖరులో ఆంధ్ర కింగ్ తాలూకాతో పాటు డిసెంబర్ మొదటి వారంలో అఖండ 2, ఆపై క్రిస్మస్ కు పెద్ద సినిమాలు క్యూలో ఉన్నాయి. ఓటిటి డీల్ కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడీ కేసులో వాయిదా వేయాల్సి వస్తే అదో తలనెప్పి అవుతుంది. చూడాలి మరి కాంత ఈ అడ్డంకిని దాటుకుని 14నే వస్తుందా లేక పోస్ట్ పోన్ అవుతుందా.

Related Post

శ్రీవారి పరకామణి కేసులో సంచలనం: ఫిర్యాదు చేసిన వ్యక్తి మృతిశ్రీవారి పరకామణి కేసులో సంచలనం: ఫిర్యాదు చేసిన వ్యక్తి మృతి

తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకల హుండీ పరకామణిలో జరిగిన దొంగతనాన్ని బయటకు తీసి ఫిర్యాదు చేసిన టీటీడీ ఉద్యోగి మరియు ఏవీ ఎస్ వో సతీష్ కుమార్ అనుమానాస్పదంగా మృతి చెందారు. ఆయనే ఈ కేసును వెలుగులోకి తెచ్చిన వ్యక్తి.