hyderabadupdates.com movies కిషోర్ తిరుమల మీద ‘మాస్’ బరువు

కిషోర్ తిరుమల మీద ‘మాస్’ బరువు

లవ్, ఫ్రెండ్ షిప్స్ ఆధారంగా చేసుకుని సెన్సిబుల్ సినిమాలు ఇస్తాడని పేరున్న దర్శకుడు కిషోర్ తిరుమల కొత్త మూవీ రవితేజతో తీస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ చాలా అంటే చాలా వేగంగా చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతి స్లాట్ మిస్ కాకూడదని కంకణం కట్టుకుని మరీ పరుగులు పెట్టిస్తున్నారు. అయితే ఇటీవలే రవితేజ మాస్ జాతర దారుణంగా ఫెయిలైన నేపథ్యంలో అంచనాల పరంగా ఇప్పుడా బరువంతా కిషోర్ తిరుమల మీదే పడుతోంది. భర్త మహాశయులకు విజ్ఞప్తి టైటిల్ ని దాదాపు ఖరారు చేసిన ఈ ఎంటర్ టైనర్ కు మళ్ళీ భీమ్స్ సిసిరోలియోనే సంగీతం సమకూర్చడం విశేషం.

ఇక్కడ తిరుమల కిషోర్ ముందు కొన్ని సవాళ్లున్నాయి. మొదటిది రవితేజకు హిట్ ఇవ్వడం. రెండోది తీసుకున్నది వినోదాత్మక కాన్సెప్ట్ అయినా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండేలా చూసుకోవడం. అందుకే ధమాకా తరహాలో ఒక మంచి జోష్ ఇచ్చే సాంగ్ ఇందులో పెట్టారని ఇన్ సైడ్ టాక్. పాపులర్ టీవీ సీరియల్స్ పాటలను తీసుకుని వాటిని రీమిక్స్ చేయించి కొత్త ప్రయోగం ఏదో చేశారట. ఇది కిషోర్ తిరుమల స్టైల్ కి భిన్నం. అయినా ఎందుకంటే రవితేజ హీరో కాబట్టి ఇలాంటి జోడింపులు తప్పనిసరి. ఇద్దరు హీరోయిన్ల మధ్య నలిగే పాత్రలో ఇండియా, ఫారిన్ రెండు చోట్ల కథ జరిగేలా కొంచెం డిఫరెంట్ ట్రీట్ మెంట్ ఉంటుందట.

ఇక అసలైన మరో ఛాలెంజ్ తీవ్రంగా ఉన్న పోటీలో ఈ సినిమాని గెలిపించుకోవడం. కాంపిటీషన్ మాములుగా లేదు. మన శంకరవరప్రసాద్ గారు, అనగనగా ఒక రాజు, జన నాయకుడు, పరాశక్తితో పోటీ చాలా టఫ్ గా ఉంది. అసలే రవితేజ వరస డిజాస్టర్ల తర్వాత ఈ సినిమాతో వస్తున్నాడు. అలాంటప్పుడు సోలోగా అయితే ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ ఇది సంక్రాంతి బొమ్మని బలంగా నమ్ముతున్న హీరో నిర్మాత ఈ అవకాశాన్ని వదలుకునే ఆలోచనలో లేరట. దర్శకుడిగా కిషోర్ తిరుమల గత చిత్రం ఆడవాళ్ళూ మీకు జోహార్లు ఫెయిలయ్యింది. ఈ గాయం కూడా భర్త మహాశయులే తీర్చాలి.

Related Post

సంధ్య థియేటర్ తొక్కిస‌లాట‌: ఏ11గా అల్లు అర్జున్‌సంధ్య థియేటర్ తొక్కిస‌లాట‌: ఏ11గా అల్లు అర్జున్‌

దాదాపు ఏడాది కింద‌ట విడుద‌లైన పుష్ప‌-2 సినిమా ప్రీమియ‌ర్ షో సంద‌ర్భంగా తీవ్ర విషాదం చోటు చేసుకున్న విష‌యం తెలిసిందే. హైద‌రాబాద్‌లోని సంధ్య థియేట‌ర్ వ‌ద్ద‌.. జ‌రిగిన తొక్కిస‌లాట‌లో రేవ‌తి అనే మ‌హిళ అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. ఆమె కుమారుడు శ్రీతేజ

దారుణం.. హోమ్ వర్క్ చెయ్యలేదని స్టూడెంట్ ను అలా చేస్తారా?దారుణం.. హోమ్ వర్క్ చెయ్యలేదని స్టూడెంట్ ను అలా చేస్తారా?

పిల్లలకు ఉపాధ్యాయులు విద్యాబుద్ధులు నేర్పించాలి. వారికి చదువు నేర్పుతూ భవిష్యత్తుకు బాటలు వేయాలి. అటువంటి టీచర్లు తమ విద్యార్ధిని చెట్టుకు వేలాడదీశారు. హోమ్ వర్క్ చేయలేదంటూ దారుణానికి ఒడిగట్టారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఛత్తీస్‌గఢ్‌లో