hyderabadupdates.com Gallery కీల‌క మ్యాచ్ లో ఆడ‌నున్న సంజు శాంస‌న్

కీల‌క మ్యాచ్ లో ఆడ‌నున్న సంజు శాంస‌న్

కీల‌క మ్యాచ్ లో ఆడ‌నున్న సంజు శాంస‌న్ post thumbnail image

ముంబై : అంద‌రి క‌ళ్లు ఇప్పుడు రేపు జింబాబ్వేతో జ‌రిగే కీల‌క మ్యాచ్ పైనే ఉన్నాయి. దీనికి కార‌ణం భారత జ‌ట్టు ఇప్ప‌టికే డిఫెండింగ్ ఛాంపియ‌న్ గా ఉంది. ఈసారి కూడా టైటిల్ ఫెవ‌రేట్ గా ఉన్న‌ప్ప‌టికీ టీమిండియా ఆశించిన మేర రాణించ‌డం లేదు. టోర్నీలో భాగంగా వ‌రుస‌గా నాలుగు మ్యాచ్ ల‌లో గెలుపొంది స‌త్తా చాటినా చివ‌ర‌కు సూప‌ర్ -88లో భాగంగా జ‌రిగిన కీల‌క పోరులో బ‌ల‌మైన ద‌క్షిణాఫ్రికా జ‌ట్టుచేతిలో భారీ తేడాతో ఓట‌మి పాలైంది. ఇక ఇదే విభాగంగా ఇండియా టీం రెండు జ‌ట్ల‌తో త‌ల‌ప‌డ‌నుంది. ఇందులో భారీ తేడాతో గెలుపొందాల్సి ఉంది. మ‌రో వైపు విండీస్ టీం కూడా సూప‌ర్ షో చేస్తుండడంతో టీమిండియాకు అగ్ని ప‌రీక్ష‌గా మారింది.
ఐసీసీ బిగ్ టోర్నీలో ఇప్ప‌టి వ‌ర‌కు ఆశ‌లు రేపిన ఆట‌గాళ్లు ఎవ‌రూ ఆశించిన మేర రాణించ‌లేక పోయారు. అందులో ప్ర‌ధానంగా ప్ర‌త్య‌ర్థుల గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తించే బ్యాట‌ర్లుగా పేరొందిన అభిషేక్ శ‌ర్మ‌, సంజూ శాంస‌న్ నిరాశ ప‌రిచారు. శాంస‌న్ నాలుగు మ్యాచ్ ల‌లో వ‌రుస‌గా డ‌కౌట్ కాగా కీల‌క‌మైన సౌతాఫ్రికా తో శ‌ర్మ కేవ‌లం 15 ప‌రుగులు సాధించాడు. బోణీ కొట్టాడు. అయినా ఇది త‌న వ‌ర‌కు చూస్తే మంచి స్కోర్ కానే కాదు. ఇక సంజు శాంస‌న్ వ‌ర‌కు చూస్తే ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు. నమీబియాతో జ‌రిగిన మ్యాచ్ లో 8 బంతులు ఎదుర్కొని 3 సిక్సులు ఒక ఫోర్ తో 22 ర‌న్స్ చేశాడు. తాజాగా జింబాబ్వేతో రేపు జ‌రిగే మ్యాచ్ లో శాంస‌న్ ను వికెట్ కీప‌ర్, బ్యాట‌ర్ గా వాడుకోనున్న‌ట్లు బీసీసీఐ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.
The post కీల‌క మ్యాచ్ లో ఆడ‌నున్న సంజు శాంస‌న్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

CP Radhakrishnan: సత్యసాయి ఆశీస్సులతో 2047 నాటికి అగ్రస్థానానికి భారత్‌ – ఉప రాష్ట్రపతిCP Radhakrishnan: సత్యసాయి ఆశీస్సులతో 2047 నాటికి అగ్రస్థానానికి భారత్‌ – ఉప రాష్ట్రపతి

    సత్యసాయి ఆశీస్సులతో 2047 నాటికి భారత్‌ అగ్రస్థానానికి చేరుతుందని ఆశిస్తున్నట్టు ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్‌ తెలిపారు. పుట్టపర్తిలోని శ్రీసత్యసాయి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హయ్యర్‌ లెర్నింగ్‌ 44వ స్నాతకోత్సవంలో ఉప రాష్ట్రపతి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ‘‘నవంబర్‌ 22 విశిష్టత గురించి

‘భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి’ స్ట్రీమింగ్ పై ఉత్కంఠ‌‘భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి’ స్ట్రీమింగ్ పై ఉత్కంఠ‌

హైద‌రాబాద్ : మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, ఆషికా రంగ‌నాథ్, డింపుల్ హ‌యాతి కీ రోల్స్ పోషించిన చిత్రం భ‌ర్త మ‌హాశ‌యులుకు విజ్ఞ‌ప్తి. సంక్రాంతి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు వచ్చింది. ఈ మూవీతో పాటు మ‌రికొన్ని సినిమాలు విడుద‌ల‌య్యాయి.

మ‌చిలీప‌ట్నం పోర్టు రోడ్డు కోసం రూ. 570 కోట్లుమ‌చిలీప‌ట్నం పోర్టు రోడ్డు కోసం రూ. 570 కోట్లు

అమ‌రావ‌తి : కేంద్రం తీపి క‌బురు చెప్పింది. ఏపీలోని మ‌చిలీప‌ట్నం పోర్డు రోడ్డు అనుసంధానం కోసం ఏకంగా రూ. 570 కోట్లు మంజూరు చేసింది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ప్ర‌క‌టించారు కేంద్ర ఉపరిత‌ల, ర‌వాణా శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీ. ఈ