డైలాగ్ కింగ్ మంచు మోహన్‌బాబు కుటుంబంలో గొడవలు జరిగిన విషయం తెలిసిందే. ఇవి ఇంకా కొనసాగుతున్నాయని కొందరు చెబుతారు. అయితే.. ప్రస్తుతానికి ఈ కుటుంబంలో మౌనం రాజ్యమేలుతోంది. చిన్న కుమారుడు, నటుడు మంచు మనోజ్, పెద్ద కుమారుడు మంచు విష్ణుల మధ్య వివాదాలు చినుకు చినుకు గాలివానగా మారాయి. ఇవి కేసులు, కోర్టుల వరకు కూడా వెళ్లాయి. గత మూడు మాసాల కిందటి వరకు మీడియాలోనూ హైలెట్‌గా నిలిచాయి.
అయితే.. ఈ ఫ్యామిలీకే చెందిన మరో నటి, మోహన్‌బాబుకుమార్తె మంచు లక్ష్మి ఈ వివాదాలపై ఎప్పుడూ స్పందించలేదు. కానీ, తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె స్పందించారు. కుటుం బాల్లో ఘర్షణలు కామనేని చెప్పారు. అయితే.. అవి తెగేదాకా లాగడం సరికాదని, బంధాలను తెంచుకునేం దుకు ప్రయత్నించడం కూడా సరికాదని అన్నారు. తన కుటుంబంలో తలెత్తిన వివాదాలు తనను ఎంత గానో కలచి వేశాయని చెప్పారు. వాస్తవానికి తమ కుటుంబం ఇంత పెద్ద గొడవలు వస్తాయని తాను ఊహించలేదన్నారు.
మా కుటుంబం మళ్లీ కలిసిమెలిసి ఉండాలనే తాను కోరుకుంటున్నట్టు మంచు లక్ష్మి చెప్పారు. వాస్తవానికి అన్ని కుటుంబాల్లోనూ ఏవో ఒక గొడవలు ఉంటూనే ఉంటాయన్నారు. కానీ, ఎన్ని వివాదాలు వచ్చినా.. తర్వాత కలుసుకునే ప్రయత్నం చేయాలని.. చివరి వరకు ఉండేది కుటుంబ సంబంధాలేనని చెప్పారు. కానీ, దేశంలో రానురాను కుటుంబ బంధాలు.. తుదిదాకా చేరి తెగే పరిస్థితికి తెచ్చుకుంటున్నారని తెలిపారు. ఇలా అయితే.. కుటుంబ వ్యవస్థకే ప్రమాదమని తన అభిప్రాయంగా చెప్పారు.
ఇక, తనపై వచ్చిన విమర్శలకు స్పందిస్తూ.. “మా కుటుంబంలో చోటు చేసుకున్న వివాదాల సమయం లో నేను స్పందించలేదని చాలా మంది విమర్శించారు. కానీ, ఆ సమయంలో నేను చాలా బాధలో ఉన్నా ను. ఏం స్పందించాలి? అయినా.. బయటివారికి ఎందుకు చెప్పాలి?. ఇది మా కుటుంబ వ్యవహారం.“ అని లక్ష్మి చెప్పుకొచ్చారు. ఫ్యామిలీతో కలిసి ఉండటానికి ఎన్ని పోరాటాలైనా చేయాలన్న ఆమె.. విడిపోవడం సరికాదని వ్యాఖ్యానించారు.