
కూటమి ప్రభుత్వంపై అనతికాలంలోనే తిరుగుబాటు మొదలైంది. తాజాగా హిందూపురంలో రైతులు తిరగబడ్డారు. ఎకరాకు ప్రభుత్వం ఎంత ధర ఇస్తుందో నిర్ణయించక ముందే శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం మండలంలో భూ సేకరణకి రెవెన్యూ అధికారులు సమయాత్తం అవ్వడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో రెవెన్యూ అధికారులతో 8 గ్రామాల రైతులకు వాగ్వాదం జరిగింది. అధికారుల తీరును నిరసిస్తూ రైతులు పెద్ద ఎత్తున రాస్తారోకో చేపట్టారు. కూటమి ప్రభుత్వంపై మాకు నమ్మకం లేదు.. ముందు ధర నిర్ణయించాకే భూ సేకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఇది చంద్రబాబు నీపై రైతులకి ఉన్న నమ్మకం.. సిగ్గుపడు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
The post కూటమి ప్రభుత్వంపై రైతుల తిరుగుబాటు appeared first on Adya News Telugu.