hyderabadupdates.com movies కూలీ మిస్ చేసింది దురంధర్ చూపించింది

కూలీ మిస్ చేసింది దురంధర్ చూపించింది

కూలీలో నాగార్జున విలన్ గా నటిస్తారని దర్శకుడు లోకేష్ కనగరాజ్ ప్రకటించినప్పుడు అంచనాలు ఎక్కడికో వెళ్లిపోయాయి. చాలా వయొలెంట్ గా ఉంటుందని, రక్షకుడులో ఆయన స్వాగ్ కి ఫ్యాన్ అయ్యాక అప్పటి నుంచే ఇలాంటి క్యారెక్టరైజేషన్ రాసుకున్నానని చాలా కబుర్లు చెప్పాడు. తీరా చూస్తే రెండు మూడు స్టయిలిష్ షాట్లు తప్ప సైమన్ గా నటించిన నాగార్జున పాత్ర పరమ రొటీన్ గా ఉంది. మర్డర్లు చేయించాడు కానీ అవి ఎలాంటి ఇంపాక్ట్ చూపించేలేకపోయాయి. నిజానికి ఇది వర్కౌట్ అయితే మరిన్ని ప్రయోగాలు చేసేందుకు నాగ్ సిద్ధపడ్డారు. కాకపోవడంతో తిరిగి సోలో హీరోగా తన పాత రూటుకు వచ్చేశారు.

ఇక్కడ దురంధర్ ప్రస్తావన ఎందుకు వచ్చిందో చూద్దాం. అక్షయ్ ఖన్నా పోషించిన రెహమాన్ డెకాయిట్ పాత్ర ఎంత అద్భుతంగా పేలిందో చూస్తున్నాం. హీరో రణ్వీర్ సింగ్ కన్నా ఎక్కువ పేరు తనకే వచ్చిందనేది అతిశయోక్తి కాదు. ఇంటెన్స్ పెర్ఫార్మన్స్ తో ఆయనని దర్శకుడు ఆదిత్య దార్ చూపించిన విధానం చప్పట్లు కొట్టించుకుంది. చివర్లో చనిపోయే ఎపిసోడ్ కూడా టెర్రిఫిక్ గా డిజైన్ చేశారు. హాస్పిటల్ బెడ్ మీద రక్తమోడుతున్నా సిగరెట్ తాగుతూ రణ్వీర్ వైపు క్రూరంగా చూసే ఒక్క షాట్ చాలు తన  గురించి చెప్పడానికి. ఇలాంటిదే కనక కూలిలో నాగార్జునకు పెట్టి ఉంటే కంటెంట్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళేది.

అయితే రజనీకాంత్ ఎక్కడ సైడ్ ట్రాక్ అవుతారో లేదా నాగార్జున ఎక్కడ డామినేట్ చేస్తాడో అనే భయం వల్ల సైమన్ ని డౌన్ టోన్ చేసి ఉండొచ్చు కానీ ఒక స్టయిల్ విలన్ ని పరిచయం చేసే అవకాశాన్ని లోకేష్ కనగరాజ్ చేతులారా వృథా చేసుకున్నాడు. దురంధర్ చూశాక మూవీ లవర్స్ ఇదే ఫీలవుతున్నారు. లెజెండ్ తర్వాత జగపతిబాబు ఏ స్థాయికి వెళ్లారో అంతకన్నా పెద్ద రేంజ్ లో ఒక స్పెషల్ విలన్ స్టేటస్ నాగార్జునకి దక్కేదని భావిస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే కూలి ఫ్లాప్ కావడం నాగ్ ఫ్యాన్స్ కి సంతోషమే. ఇకపై నెగటివ్ రోల్స్ కి దూరంగా ఉండి కేవలం హీరోగా చేస్తారని ఫిక్స్ అయ్యారు. మరి నాగార్జున మనసులో ఏముందో.

Related Post

Telugu Film With 46 Awards Finds a New OTT Home Beyond Amazon Prime VideoTelugu Film With 46 Awards Finds a New OTT Home Beyond Amazon Prime Video

The Telugu sports drama Arjun Chakravarthy released in theatres in August 2025. Directed by Vikrant Rudra and produced by Srini Gubbala, the film traces the journey of Nagulayya, a kabaddi

అర్ధరాత్రి షోలతో వరప్రసాద్ గారి వీరంగంఅర్ధరాత్రి షోలతో వరప్రసాద్ గారి వీరంగం

మాములుగా కొత్త సినిమాల విడుదల రోజు తెల్లవారుఝాము లేదా అర్ధరాత్రి షోలు వేయడం సహజం. కానీ నాలుగో రోజు మిడ్ నైట్ స్క్రీనింగ్ ఊహలకు అందని పరిణామం. మన శంకరవరప్రసాద్ గారు డిమాండ్ ని తట్టుకోవడానికి బయ్యర్లకు ఇంతకన్నా మార్గం లేకపోయింది.